OTT Telugu Mystery Thriller Web Series: ఓటీటీలోకి వస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. కొత్త పోస్టర్ రిలీజ్
OTT Telugu Mystery Thriller Web Series: ఓటీటీలోకి తెలుగులో మరో మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ కు సంబంధించిన సరికొత్త పోస్టర్ ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ బుధవారం (నవంబర్ 6) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
OTT Telugu Mystery Thriller Web Series: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ మరో తెలుగు వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ సిరీస్ పేరు హరికథ. సంభవామి యుగే యుగే అనే ట్యాగ్‌లైన్ తో వస్తున్న సిరీస్ ఇది. మిస్టరీ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ఓ సరికొత్త పోస్టర్ ను హాట్‌స్టార్ బుధవారం (నవంబర్ 6) రిలీజ్ చేసింది.
హరికథ ఓటీటీ రిలీజ్
హరికథ వెబ్ సిరీస్ లేటెస్ట్ పోస్టర్ చూస్తుంటే ఇది కూడా ఓ మైథలాజికల్ థ్రిల్లర్ లాగా అనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో ఈ జానర్లో వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో హరికథ టీమ్ కూడా అలాంటి ఓ సరికొత్త స్టోరీ వస్తోంది. "అపోహలు త్వరలోనే వాస్తవాన్ని కలుసుకోబోతున్నాయి. హరికథ అతి త్వరలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అడుగుపెట్టబోతోంది" అనే క్యాప్షన్ తో ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్ చాలా ఇంటెన్స్ గా కనిపిస్తోంది. ముందు పిస్టల్ పట్టుకొని ఓ పోలీస్ ఆఫీసర్ పరుగెత్తుతుండగా.. బ్యాక్‌గ్రౌండ్ లో శ్రీమహా విష్ణువు వివిధ రూపాలను చూపించారు. ఈ మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ గురించి దసరా నాడే హాట్‌స్టార్ అనౌన్స్ చేసింది. హరికథ అనే టైటిల్ తోపాటు ఓ పోస్టర్ ఆ రోజు లాంచ్ చేసింది.
ఏంటీ హరికథ వెబ్ సిరీస్
హరికథ వెబ్ సిరీస్ కు సంభవామి యుగే యుగే అని భగవద్గీతలోని పాపులర్ లైన్ ను ట్యాగ్‌లైన్ గా పెట్టారు. దసరా రోజు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో.. అడవి మధ్యలో పంచె కట్టుకొని, వీపుపై జంధ్యంతో చేతిలో గొడ్డలి పట్టుకొని వెనక్కి తిరిగి ఉన్న ఓ యువకుడిని చూపించారు.
పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో మిస్టరీ థ్రిల్లర్ అంశాలతో హరికథ వెబ్‌సిరీస్ తెరకెక్కుతోన్నట్లు సమాచారం. ఈ వెబ్‌సిరీస్ అర్జున్ అంబటి, దివి, పూజిత పొన్నాడ, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రల్లో నటించబోతున్నారు.
తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ లో 8 ఎపిసోడ్లు ఉండొచ్చు. అర్జున్ అంబటి, దివి బిగ్‌బాస్ షోతోనే తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. బిగ్‌బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న అర్జున్ అంబటి ఫైనల్ చేరుకున్నాడు. ఐదో రన్నరప్‌గా హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. బిగ్‌బాస్‌తో పాపులర్ అయిన అర్జున్ ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లు చేస్తున్నారు.
మరోవైపు బిగ్‌బాస్ సీజన్ 4తో తెలుగు ఆడియెన్స్‌కు సుపరిచితురాలైంది దివి. బిగ్‌బాస్‌తో వచ్చిన క్రేజ్ కారణంగా సినిమాల్లో దివికి మంచి అవకాశాలే దక్కుతున్నాయి. మహర్షి, గాడ్‌ఫాదర్, పుష్ప సినిమాల్లో చిన్న రోల్స్ చేసింది. ఈ ఏడాది సింబా, లవ్ మీ సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించింది. లంబసింగి అనే సినిమాలో హీరోయిన్‌గా కనిపించింది.
టాపిక్