OTT Mystery Thriller: తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ భూతద్ధం భాస్కర్ నారాయణ థియేటర్లలో విడుదలైన ఏడాది తర్వాత అమెజాన్ ప్రైమ్ రిలీజైంది. ఇప్పటికే ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
సైకో కిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన భూతద్ధం బాస్కర్ నారాయణ మూవీలో శివ కందుకూరి హీరోగా నటించాడు. పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించాడు. గత ఏడాది మార్చి 1న థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది.మోస్తారు వసూళ్లను రాబట్టింది. సీరియల్ కిల్లర్ కథకు పురాణాలను జోడించి దర్శకుడు పురుషోత్తం రాజ్ భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో శివ కందుకూరి డిటెక్టివ్‌గా నటించాడు. రాశీసింగ్ హీరోయిన్‌గా నటించింది.
కర్ణాటక , ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న ప్రాంతంలో వరుసగా అమ్మాయిలు హత్యలకు గురువుతుంటారు. మహిళల్నికిరాతకంగా హత్య చేస్తోన్న సైకో వారి తలల స్థానంలో దిష్టిబొమ్మలను పెడుతుంటాడు.. దిష్టిబొమ్మ హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. 17 మంది అమ్మాయిలు చనిపోయిన ఒక్క క్లూ కూడా పోలీసులు సంపాదించలేకపోతారు.
ఈ సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి డిటెక్టివ్ భాస్కర్ నారాయణ (శివ కందుకూరి) రంగంలోకి దిగుతాడు. ఆ సీరియల్ కిల్లర్ ఎవరు?నర బలుల పేరుతో అమ్మాయిలను ఆ కిల్లర్ హతమార్చడానికి కారణం ఏమిటి? కిల్లర్ మిస్టరీని సాల్వ్ చేయడంలో లక్ష్మి (రాశీ సింగ్) అనే జర్నలిస్ట్ భాస్కర్ నారాయణకు ఎలా అండగా నిలిచింది? ఈ హత్యలకు సీఐ దానవ శంకరాచార్యులుకు ఉన్న సంబంధం ఏమిటి? అన్నదే భూతద్ధం భాస్కర్ నారాయణ మూవీ కథ.
భూతద్ధం భాస్కర్ నారాయణ మూవీ శివకందుకూరితో పాటు దేవిప్రసాద్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. గత సినిమాల్లో ఎక్కువగా సాఫ్ట్ క్యారెక్టర్స్ చేసిన శివ కందుకూరి ఈ మూవీలో ఓ డిఫరెంట్ రోల్‌లో కనిపించాడు. భూతద్ధం భాస్కర్ నారాయణలో దేవిప్రసాద్ తో పాటు అరుణ్, షఫీ, శివన్నారాయణ కీలక పాత్రలు పోషించారు.
చూసీ చూడంగానే మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు శివ కందుకూరి. గమనం, మను చరిత్ర తో పాటు హీరో నాని ప్రొడ్యూస్ చేసిన మీట్‌క్యూట్ వెబ్‌సిరీస్‌లో నటించాడు. శర్వానంద్ హీరోగా నటించిన మనమే మూవీలో గెస్ట్ రోల్ చేశాడు. ప్రస్తుతం తెలుగులోబూమ్‌రాంగ్ పేరుతో ఓ థ్రిల్లర్ మూవీ చేస్తోన్నాడు. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది.
సంబంధిత కథనం