Telugu Web Series: టీవీలో టెలికాస్ట్ కానున్న తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ - ఏ ఛానెల్‌లో...ఎప్పుడు చూడాలంటే?
Telugu Web Series: తెలుగు మర్డర్ మిస్టరీ వెబ్‌సిరీస్ గాలివాన టీవీలోకి వస్తోంది. నవంబర్ 16 శనివారం మధ్నాహ్నం 12 గంటల జీ తెలుగు ఛానెల్‌లో టెలికాస్ట్ కాబోతోంది. గాలివాన వెబ్‌సిరీస్‌లో రాధిక శరత్‌కుమార్, సాయికుమార్, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషించారు.
Telugu Web Series: రాధిక శరత్‌కుమార్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ గాలివాన ఓటీటీలోకి వస్తోంది. నవంబర్ 16న శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి జీ తెలుగు ఛానెల్‌లో ఈ వెబ్ సిరీస్ టెలికాస్ట్ కాబోతోంది. ఈ విషయాన్ని జీ తెలుగు అఫీషియల్‌గా ప్రకటించింది.
చాందిని చౌదరి...
గాలివాన వెబ్‌సిరీస్‌కు శరత్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించాడు. ఈ వెబ్‌సిరీస్‌లో చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, శరణ్య కీలక పాత్రలు పోషించారు. జీ5 ఓటీటీలో 2022లో ఈ వెబ్‌సిరీస్ రిలీజైంది. ఓటీటీలో రిలీజైన రెండేళ్ల తర్వాత టీవీలోకి వస్తోంది.
హాలీవుడ్ రీమేక్...
హాలీవుడ్ వెబ్‌సిరీస్ వన్ ఆఫ్ అజ్ రీమేక్‌గా గాలి వాన వెబ్‌సిరీస్ తెరకెక్కింది. ఇంగ్లీష్ వెబ్‌సిరీస్‌లోని మూల కథను తీసుకొని తెలుగు నేటివిటీకి అనుగుణంగా అనేక మార్పులు చేర్పులు చేస్తూ దర్శకుడు శరణ్ ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించాడు. మొత్తం ఏడు ఎపిసోడ్స్‌తో ఈ వెబ్‌సిరీస్ రూపొందింది.
హత్య ఎవరు చేశారు?
ఆయుర్వేద వైద్యుడైన రాజు(సాయికుమార్) కూతురు గీత, సరస్వతి(రాధిక శరత్ కుమార్) కొడుకు అజయ్ వర్మ ప్రేమించి పెళ్లిచేసుకుంటారు. హనీమూన్ కోసం వైజాగ్ వెళ్లిన వారు దారుణ హత్యకు గురవుతారు.పడమటి లంక శ్రీను అనే కిల్లర్ డబ్బు, నగల కోసం వారిని చంపేస్తాడు.
పోలీసులకు దొరక్కుండా పారిపోయే క్రమంలో లంక శ్రీను కారు సరస్వతి ఇంటి ముందే ప్రమాదానికి గురవుతుంది . ఈ ప్రమాదం నుంచి లంక శ్రీనును సరస్వతి పెద్దకొడుకు మార్తాండ్(చైతన్య కృష్ణ) కూతురు శ్రావణి (చాందినీ చౌదరి)కాపాడుతారు.
గీత, అజయ్‌లను హత్య చేసింది అతడే అనే నిజం టీవీల్లో వచ్చే వార్తల ద్వారా వారికి తెలిసిపోతుంది. లంకశ్రీనును పోలీసులకు అప్పగించాలని అనుకోనే లోపే అతడు హత్యకు గురవుతారు.అతడిని రాజు, సరస్వతి కుటుంబసభ్యుల్లో ఎవరు హత్య చేశారు.
శ్రీను మిస్సింగ్ కేసును పోలీస్ ఆఫీసర్ నందిని ఎలా సాల్వ్ చేసింది. . శ్రీను శవం పోలీసులకు దొరక్కుండా రాజు, సరస్వతి ఎలాంటి ప్లాన్స్ వేశారు. అజయ్, గీతల హత్యల వెనకున్నది ఎవరు? అన్నదే ఈ సిరీస్ కథ.
ట్విస్ట్ లు అదుర్స్…
ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్‌లో ట్విస్ట్‌లతో పాటు రాధిక, సాయికుమార్ యాక్టింగ్‌కు ప్రశంసలు దక్కాయి.
గాలివాన వెబ్‌సిరీస్‌కు సీక్వెల్‌ను అనౌన్స్‌చేశారు. ఈ వెబ్‌సిరీస్‌కు శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ అందించాడు.