తెలుగు మూవీ ఎమ్4ఎమ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో స్ట్రీనింగ్ అయ్యింది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో అమెరికన్ నటి జో శర్మ కీలక పాత్రలో నటించింది. మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించాడు. కేన్స్‌లో ఎమ్4ఎమ్ రెడ్ కార్పేట్ వేడుకపై హీరోయిన్ జో శర్మతో మెరిసింది. ఈ స్క్రీనింగ్‌కు డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల కూడా అటెండ్ అయ్యాడు.
రెడ్ కార్పేట్ వేడుకలో దుబాయ్, ఢిల్లీలోని ప్రముఖ డిజైనర్లు రూపొందించిన దుస్తులు ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది జో శర్మ. కేన్స్‌లోని ప్రెస్టీజియస్ PALAIS-C థియేటర్‌లో ‘ఎం4ఎం’ మూవీ రెడ్ కార్పెట్ స్క్రీనింగ్ జరిగింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో స్క్రీనింగ్ అయిన ఏకైక తెలుగు మూవీగా ఎమ్4ఎమ్ నిలిచింది. తెలుగు సినిమాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు దర్శకనిర్మాతలు చెప్పారు.
ఇప్పటివరకు తెలుగులో వచ్చిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీస్‌కు భిన్నమైన పాయింట్‌తో ఎమ్4ఎమ్ మూవీని తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. స్క్రీన్‌ప్లే కూడా కొత్తగా ఉంటుందని అన్నారు. ఎమ్4ఎమ్ మోటీవ్ ఫర్ మర్డర్ అనే టైటిల్‌ను మంచి రెస్పాన్స్ వస్తుందని పేర్కొన్నారు.
సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్‌తో ఎమ్4ఎమ్ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో జో శర్మ రోల్ ఛాలెంజింగ్‌గా ఉంటుందని అన్నారు. ఈ సినిమాలోని ట్విస్ట్‌లు ఆకట్టుకుంటాయని అన్నారు. త్వరలో ఎమ్4ఎమ్ ఎమ్4ఎమ్ విడుదలకు ముందే పలు అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు అందుకుంటోంది. ఇటీవలే ఈ మూవీ టీజర్‌ను దిల్‌రాజు రిలీజ్ చేశారు. సీరియల్ కిల్లర్‌ను పోలీస్ ఆఫీసర్‌తో కలిసి ఓ యువతి ఎలా పట్టుకుంది అనే పాయింట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోన్నట్లు టీజర్‌లో చూపించారు.
గతంలో భూమిక మల్లెపువ్వుతో పాటు బట్టర్‌ఫ్లైస్, లవ్ 20-20 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు మోహన్ వడ్లపట్ల. బట్టర్‌ఫ్లైస్ మూవీలో జో శర్మ హీరోగా నటించింది. ఎమ్4ఎమ్ మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ మూవీలో సంబీత్ ఆచార్య హీరోగా నటిస్తోన్నాడు.
సంబంధిత కథనం