ఒకే రోజు ఒకే ఓటీటీలోకి వ‌చ్చిన రెండు తెలుగు సినిమాలు - ఒక‌టి రొమాంటిక్ యాక్ష‌న్‌ - మ‌రోటి స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌-telugu movies samudrudu and rudraveena streaming on amazon prime video from today onwards latest tollywood ott releases ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఒకే రోజు ఒకే ఓటీటీలోకి వ‌చ్చిన రెండు తెలుగు సినిమాలు - ఒక‌టి రొమాంటిక్ యాక్ష‌న్‌ - మ‌రోటి స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌

ఒకే రోజు ఒకే ఓటీటీలోకి వ‌చ్చిన రెండు తెలుగు సినిమాలు - ఒక‌టి రొమాంటిక్ యాక్ష‌న్‌ - మ‌రోటి స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌

Nelki Naresh HT Telugu

బుధ‌వారం అమెజాన్ ప్రైమ్‌లో రెండు తెలుగు సినిమాలు రిలీజ‌య్యాయి. స‌ముద్రుడు, రుద్ర‌వీణ సినిమాలు స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వ‌చ్చాయి. రుద్ర‌వీణ మూవీలో శ్రీరామ్ నిమ్మ‌ల ఎల్సాఘోష్‌, శుభ‌శ్రీ హీరోయిన్లుగా న‌టించారు. స‌ముద్రుడు మూవీలో ర‌మాకాంత్‌, అవంతిక‌, భానుశ్రీ నాయ‌కానాయిక‌లుగా క‌నిపించారు.

తెలుగు సినిమాలు...

బుధ‌వారం రోజు రెండు తెలుగు సినిమాలు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వ‌చ్చాయి. రుద్ర‌వీణ‌తో పాటు స‌ముద్రుడు సినిమాలు ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా సైలెంట్‌గా రిలీజ‌య్యాయి. ఈ రెండు సినిమాలు గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో థియేట‌ర్ల‌లో రిలీజ‌య్యాయి. ఆరు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చాయి.

స‌ముద్రుడు మూవీ...

స‌ముద్రుడు మూవీలో ర‌మాకాంత్‌, అవంతిక‌, భానుశ్రీ హీరోహీరోయిన్లుగా న‌టించారు. న‌గేష్ నార‌దాసి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో సుమ‌న్‌, స‌మ్మెట గాంధీ, జ‌బ‌ర్ధ‌స్థ్ శేషు కీల‌క పాత్ర‌లు పోషించారు. చేప‌ల వృత్తి జీవ‌నాధారంగా బ‌తికే మ‌త్య్స‌కారులు ద‌ళారుల కార‌ణంగా ఎలా దోపిడీల‌కు గురువుతున్నార‌నే సందేశానికి యాక్ష‌న్‌, స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ అంశాల‌ను జోడించి ద‌ర్శ‌కుడు ఈ మూవీని రూపొందించాడు.

గంగ తిరుగుబాటు...

గంగ స‌ముద్రంపై చేపలు ప‌ట్ట‌గా వ‌చ్చే డ‌బ్బుల‌తో జ‌ల్సాలు చేస్తుంటాడు. దేవ‌తో పాటు అల్లూర‌య్య అనే ద‌ళారులు త‌మ క‌ష్టాన్ని దోచుకుంటున్నార‌ని గ్ర‌హిస్తాడు గంగ‌. వారితో గొడ‌వ‌ప‌డ‌తాడు. గ‌జ‌ని మొహ‌మ్మ‌ద్ అనే రౌడీతో చేతులు క‌లిపిన దేవ‌...గంగ‌ను చంపాల‌ని చూస్తాడు. ఆ త‌ర్వాత ఏమైంది. ఆ ఊరికి టీచ‌ర్‌గా వ‌చ్చిన నందినిని గంగ ఎందుకు పెళ్లిచేసుకోవాల్సివ‌చ్చింది? గ‌జిని మొహ‌మ్మ‌ద్‌ను ఎదురించి గంగ ఎలాంటి పోరాటం సాగించాడు? గంగ‌కు అంజ‌లితో ఉన్న సంబంధం ఏమిటి అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

రుద్ర‌వీణ మూవీ...

రుద్ర‌వీణ మూవీలో శ్రీరామ్ నిమ్మ‌ల‌, ఎల్సా ఘోష్‌, శుభ‌శ్రీ హీరోయిన్లుగా న‌టించారు. ఈ మూవీలో ర‌ఘు కుంచె విల‌న్‌గా క‌నిపించాడు. మ‌ధుసూద‌న్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ ఐఎమ్‌డీబీలో 7.1 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది.

ఐపీఎల్‌కు సెలెక్ట్ అయ్యి...

లాల‌ప్ప యానంలో పెద్ద రౌడీ. త‌న అక్ర‌మ వ్యాపారాల‌కు అడ్డొచ్చిన వారిని దారుణంగా హ‌త‌మారుస్తుంటాడు. లాల‌ప్ప మ‌న‌షులు ఒక్కొక్క‌రుగా అనుమానాస్ప‌ద రీతిలో చ‌నిపోతుంటారు. వారిని మ‌ర్డ‌ర్స్ చేస్తుంది రుద్ర అనే నిజం బ‌య‌ట‌ప‌డుతుంది. లాల‌ప్ప‌ను రుద్ర ఎందుకు టార్గెట్ చేశాడు. క్రికెట‌ర్‌గా ఐపీఎల్‌కు సెలెక్ట్ అయిన రుద్ర హంత‌కుడిగా జైలు పాలు కావ‌డానికి కార‌ణం ఏమిటి? రుద్ర జీవితంలోకి వ‌చ్చిన వీణ‌, ప్రియ ఎవ‌రు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం