Movies Runtime: ఈ తెలుగు సినిమాల ఒరిజినల్ రన్ టైమ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే- మంచు విష్ణు కన్నప్ప మూవీనే టాప్!-telugu movies runtime before their theatrical release and manchu vishnu kannappa movie is top with 5 hrs 30 minutes ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Movies Runtime: ఈ తెలుగు సినిమాల ఒరిజినల్ రన్ టైమ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే- మంచు విష్ణు కన్నప్ప మూవీనే టాప్!

Movies Runtime: ఈ తెలుగు సినిమాల ఒరిజినల్ రన్ టైమ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే- మంచు విష్ణు కన్నప్ప మూవీనే టాప్!

Sanjiv Kumar HT Telugu
Published Feb 19, 2025 02:26 PM IST

These Telugu Movies RunTime Before Theatrical Release: తెలుగులో అధిక రన్ టైమ్ ఉన్న సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ, వాటిలో థియేట్రికల్ రిలీజ్‌కు ముందు చిత్రీకరించిన ఒరిజినల్ రన్ టైమ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అలాంటి కొన్ని తెలుగు సినిమాల ఒరిజినల్ రన్ టైమ్ ఎంతో ఇక్కడ తెలుసుకుందాం.

ఈ తెలుగు సినిమాల ఒరిజినల్ రన్ టైమ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే- మంచు విష్ణు కన్నప్ప మూవీనే టాప్!
ఈ తెలుగు సినిమాల ఒరిజినల్ రన్ టైమ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే- మంచు విష్ణు కన్నప్ప మూవీనే టాప్!

These Telugu Movies RunTime Before Theatrical Release: ఒక సినిమా చిత్రీకరణ కోసం హీరో, హీరోయిన్స్, డైరెక్టర్స్, నిర్మాతలు ఇతర టెక్నిషియన్స్ అంతా ఎంతో కష్టపడుతుంటారు, రోజుల నుంచి సంవత్సారల తరబడి సినిమా షూటింగ్ చేస్తుంటారు. అయితే, అలా చిత్రీకరించిణ సినిమాల ఫుటేజ్ చాలానే వస్తుంది.

అసలు రన్ టైమ్

ఆ ఫుటేజ్‌ను చాలా వరకు ఎడిట్ చేసి ఫైనల్ కట్‌తో రిలీజ్ చేస్తుంటారు. అయితే, రిలీజ్‌కు ముందు ఉన్న సినిమాల అసలు రన్ టైమ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అలా తెలుగులోని తెలుగులోని కొన్ని సినిమాల ఒరిజినల్ రన్ టైమ్ ఎంతో ఇక్కడ తెలుసుకుందాం.

అర్జున్ రెడ్డి

యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా డెబ్యూ చేసిన అర్జున్ రెడ్డి మూవీ ఎంత క్రేజ్ తెచ్చుకుందో తెలిసిందే. 3 గంటల 2 నిమిషాల రన్‌ టైమ్‌తో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా అత్యధిక నిడివి ఉన్న తెలుగు మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా అంత లెంత్‌తో విడుదలైన కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మరో సంచలనం సృష్టించింది.

ఇలాంటి అర్జున్ రెడ్డి సినిమా రన్ టైమ్ రిలీజ్‌కు ముందు మరింత ఎక్కువగా ఉంది. అర్జున్ రెడ్డికి నాలుగు గంటల రన్ టైమ్ వచ్చింది. అయితే, రెండుసార్లు ఎడిట్ చేసిన తర్వాత ఫైనల్‌గా మూడు గంటల 2 నిమిషాలతో అర్జున్ రెడ్డి సినిమాను విడుదల చేశారు.

గేమ్ ఛేంజర్

రామ్ చరణ్- డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన భారీ మూవీ గేమ్ ఛేంజర్ ఊహించని ఫలితం అందుకుంది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో మాత్రం టాప్ 1 ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. అయితే, ఈ సినిమా ఒరిజినల్ రన్ టైమ్ సుమారుగా ఐదు గంటలు అని సమాచారం. దీన్ని ఎడిట్ చేసి ఫైనల్‌గా 2 గంటల 45 నిమిషాలతో జనవరి 10న వరల్డ్ వైడ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేశారు.

కన్నప్ప మూవీ

మంచు విష్ణు నటించిన ప్రతిష్టాత్మక చిత్రం కన్నప్ప. పాన్ ఇండియా సినిమాగా రూపొందిన కన్నప్పలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, శివరాజ్‌ కుమార్, మధుబాల వంటి భారీ తారాగణం నటిస్తోన్న విషయం తెలిసిందే. ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా పరిచయం అవుతున్న కన్నప్ప సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు.

చివరి రన్ టైమ్

రూ. 100 నుంచి 150 కోట్ల బడ్జెట్ మూవీగా తెరకెక్కిన ఫాంటసీ యాక్షన్ డ్రామా మూవీ కన్నప్ప షూటింగ్ తర్వాత అసలు ఫుటేజ్ దాదాపుగా 3 గంటల 30 నిమిషాలు వచ్చిందట. మరి ఈ నిడివిని ఎడిట్ చేసి 3 గంటల రన్ టైమ్‌తో రిలీజ్ చేయనున్నారని సమాచారం. మరి చివరిగా థియేటర్లలో ఎంత రన్ టైమ్‌‌తో రిలీజ్ చేస్తారో వేచి చూడాలి. అయితే, రిలీజ్‌‌కు ముందు అధిక రన్ టైమ్ ఉన్న సినిమాల్లో టాప్‌లో కన్నప్ప నిలిచినట్లు అయింది.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌ కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం