టాలీవుడ్ కు ఈ శుక్రవారం (మే 9) కాస్త కలిసొచ్చిందనే చెప్పాలి. రెండు చిన్న సినిమాలు రిలీజైనా రెండింటికీ పాజిటివ్ టాకే వచ్చింది. వీటిలో ఒకటి సమంత నిర్మించిన శుభం మూవీ కాగా.. మరొకటి శ్రీవిష్ణు నటించిన సింగిల్. మరి ఈ సినిమాలు ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లోకి అడుగుపెడుతున్నాయో ఒకసారి చూద్దాం.
శ్రీవిష్ణు నటించిన సింగిల్ మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. మంచి ధరకు ఈ సినిమాను దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకూ శ్రీవిష్ణు సినిమాలకు వచ్చిన అత్యధిక మొత్తం ఇదే కావడం విశేషం. సింగిల్ మూవీకి పాజిటివ్ రివ్యూలు రావడంతో డిజిటల్ ప్రీమియర్ ఎప్పుడున్న ఆసక్తి నెలకొంది. ఈ సినిమా వచ్చే నెలలోనే ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.
ఓ అమ్మాయితో తొలిచూపులోనే ప్రేమలో పడ్డ యువకుడు.. అతడిని ఇష్టపడ్డ మరో అమ్మాయి.. ఈ ముగ్గురి ట్రయాంగిల్ లవ్‌స్టోరీతోనే సింగిల్ సాగుతుంది. ఈ సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేలా స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు డైరెక్టర్. స్టార్ హీరోలను శ్రీవిష్ణు ఇమిటేట్ చేసే సీన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. రెండు గంటల పాటు నాన్ స్టాప్ గా నవ్వించే మూవీ ఈ సింగిల్.
శాటిలైట్ హక్కులు కూడా జీ నెట్‌వర్క్ కే దక్కాయి. దీంతో శుభం మూవీ అటు ఓటీటీ, ఇటు టీవీలోకి ఒకేసారి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో తాను హక్కులు పొందిన అన్ని సినిమాలను జీ నెట్‌వర్క్ ఇలాగే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలోనే ఈ సినిమా కూడా ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.
ఆడవాళ్లలో ఉండే సీరియల్ పిచ్చి ప్రధానంగా సాగే హారర్ కామెడీ మూవీ ఇది. సింపుల్ పాయింట్‌తో చివరి వరకు ఎంటర్‌టైన్ చేశాడు డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల.
సీరియల్ అంటేనే ఏళ్లకు ఏళ్లు సాగడం కామన్. ఓ టీవీ సీరియల్‌ను రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ..అది పూర్తికాకుండానే చనిపోయిన వాళ్లు ఆత్మలై తిరిగి వచ్చి సీరియల్‌ను చూస్తే ఏంటన్నదే శుభం సినిమా కథ. ఈ గమ్మత్తైన కథను మూడు యువ జంటల జీవితాలతో అంతే ఫన్నీగా తెరపై చూపించారు దర్శకుడు.
సంబంధిత కథనం