OTT Telugu Movies: ఫిబ్రవరిలో ఓటీటీల్లో తెలుగు సినిమాల జాతరే.. టాప్-5 ఇవే.. ఓ చిత్రం నేరుగా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
OTT Telugu Movies: ఫిబ్రవరిలో ఓటీటీల్లోకి టాప్ తెలుగు చిత్రాలు వచ్చేనున్నాయి. సంక్రాంతికి రిలీజైన మూడు చిత్రాలు వచ్చే నెలలోనే ఓటీటీలోకి అడుగుపెట్టే అవకాశాలు అధికం. పుష్ప 2 కూడా స్ట్రీమింగ్‍కు రానుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
జనవరిలో ఓటీటీల్లో భారీ తెలుగు చిత్రాలు ఎక్కువగా రాలేదు. చిన్న సినిమాలే ఎక్కువగా స్ట్రీమింగ్‍కు వచ్చాయి. అయితే ఫిబ్రవరిలో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో తెలుగు సినిమాల జాతర ఉండనుంది. భారీ చిత్రాలు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనున్నాయి. బ్లాక్‍బస్టర్ పుష్ప 2 సహా సంక్రాంతికి రిలీజైన చిత్రాలు కూడా ఓటీటీల్లోకి వచ్చే నెల ఎంట్రీ ఇవ్వనున్నాయి. మరో చిత్రం నేరుగా రానుంది. ఫిబ్రవరిలో ఓటీటీల్లోకి వచ్చే అవకాశం ఉన్న టాప్-5 తెలుగు సినిమాలు ఏవో ఇక్కడ చూడండి.

పుష్ప 2: ది రూల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2: ది రూల్’ చిత్రం భారీ బ్లాక్‍బస్టర్ సాధించి.. అనేక రికార్డులను నెలకొల్పింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన రూ.1,830 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటేసింది. పుష్ప 2 మూవీ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఫిబ్రవరి తొలి వారంలో స్ట్రీమింగ్‍కు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. జనవరి 30 లేదా 31న స్ట్రీమింగ్‍కు రావొచ్చని కూడా రూమర్లు ఉన్నాయి. మొత్తంగా ఫిబ్రవరి తొలి వారం ముగిసేలోగా పుష్ప 2 సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశాలు అధికం.
గేమ్ ఛేంజర్
మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన థియేటర్లలో రిలీజైంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ పొటిలికల్ యాక్షన్ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. గేమ్ ఛేంజర్ మూవీ ఫిబ్రవరిలో నెలలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చే అవకాశాలు అధికం. స్ట్రీమింగ్ డేట్‍పై ప్రైమ్ వీడియో నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
సంక్రాంతికి వస్తున్నాం
సంక్రాంతికి వస్తున్నాం సినిమా అంచనాలకు మంచి కలెక్షన్లతో దుమ్మురేపుతోంది. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన రిలీజైంది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇప్పటికే రూ.250కోట్ల గ్రాస్ అధిగమించింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ కైవసం చేసుకుంది. ఫిబ్రవరిలోనే జీ5లో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చే ఛాన్స్ ఉంది.
డాకు మహారాజ్
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ చిత్రం కూడా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజైంది. ఈ మూవీ రూ.130కోట్ల గ్రాస్ కలెక్షన్లు దాటింది. ఈ యాక్షన్ చిత్రాన్ని డైరెక్టర్ బాబీ కొల్లి తెరకెక్కించారు. డాకు మహారాజ్ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఫిబ్రవరిలోనే స్ట్రీమింగ్‍కు రానుంది. స్ట్రీమింగ్ డేట్ ఖరారు కావాల్సి ఉంది.
కోబలి
రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కోబలి’ నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్‍కు రానుంది. డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో ఈ చిత్రం ఫిబ్రవరి 4వ తేదీన స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. రాయలసీమ బ్యాక్‍డ్రాప్‍లో తెరకెక్కిన ఈ చిత్రంలో రవి ప్రకాశ్, శ్యామల, రాకీ సింగ్, వెంకట్ ప్రధాన పాత్రలు పోషించారు. కోబలి చిత్రానికి రేవంత్ లెవక దర్శకత్వం వహించారు.
సంబంధిత కథనం