మూడో ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ - ఐఎమ్‌డీబీలో టాప్ రేటింగ్ - మ‌రో హార‌ర్ మూవీ కూడా స్ట్రీమింగ్‌!-telugu movies mercy killing and karna pishachini released on ott where to watch this crime thriller and horror movies ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  మూడో ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ - ఐఎమ్‌డీబీలో టాప్ రేటింగ్ - మ‌రో హార‌ర్ మూవీ కూడా స్ట్రీమింగ్‌!

మూడో ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ - ఐఎమ్‌డీబీలో టాప్ రేటింగ్ - మ‌రో హార‌ర్ మూవీ కూడా స్ట్రీమింగ్‌!

Nelki Naresh HT Telugu

తెలుగు సినిమాలు మెర్సీ కిల్లింగ్‌, క‌ర్ణ పిశాచి శ‌నివారం అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ‌య్యాయి. మెర్సీ కిల్లింగ్ మూవీలో సాయికుమార్‌, కేరింత పార్వ‌తీశం కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. హార‌ర్ క‌థాంశంతో రూపొందిన క‌ర్ణ పిశాచి మూవీలో ప్ర‌ణ‌వి, నిఖిల్‌, ర‌మ్య‌శ్రీ హీరోహీరోయిన్లుగా న‌టించారు.

తెలుగు సినిమాలు

తెలుగు సినిమాలు మెర్సీ కిల్లింగ్‌, క‌ర్ణ పిశాచి ఓటీటీలోకి వ‌చ్చాయి. శ‌నివారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ రెండు సినిమాలు రిలీజ‌య్యాయి. మెర్సీ కిల్లింగ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్క‌గా...క‌ర్ణ పిశాచి హార‌ర్ క‌థాంశంతో రూపొందింది.

మెర్సీ కిల్లింగ్‌...

క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన మెర్సీ కిల్లింగ్‌లో సాయికుమార్‌, కేరింత పార్వ‌తీశం, ఐశ్వ‌ర్య, హారిక కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సూర‌ప‌ల్లి వెంక‌ట ర‌మ‌ణ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.అమెజాన్ ప్రైమ్ కంటే ముందు ఆహా ఓటీటీ, బుక్‌మై షో ఓటీటీలో మెర్సీ కిల్లింగ్ మూవీ రిలీజైంది. మూడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో తెలుగులో మాత్ర‌మే ఈ మూవీ అందుబాటులో ఉంది.

ఆర్టిక‌ల్ 21 స్ఫూర్తితో...

రాజ్యాంగంలోకి అర్టిక‌ల్ నంబ‌ర్ 21 ఆధారంగా మెర్సీ కిల్లింగ్ మూవీ రూపొందింది. గ‌త ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమా థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఐఎమ్‌డీబీలో 8.7 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది. స్వేచ్ఛ (హారిక‌) ఓ అనాథ‌. త‌న‌కు ఎదురైన అవ‌మానాల కార‌ణంగా త‌ల్లిదండ్రులు ఎవ‌ర‌న్న‌ది తెలుసుకోవాల‌ని అన్వేష‌ణ మొద‌లుపెడుతుంది. ఈ క్ర‌మంలోనే షిఫ్ యార్డ్‌లో ప‌నిచేసే మ‌హేష్‌తో (పార్వ‌తీశం) పాటు భార‌తి(ఐశ్వ‌ర్య‌) అనుకోకుండా స్వేచ్ఛ జీవితంలోకి వ‌స్తారు.

స్వేచ్ఛ తండ్రిని వెత‌క‌డంతో ఆమెకు మ‌హేష్‌, భార‌తి ఎలా సాయ‌ప‌డ్డారు? ప‌రువు కోస‌మే బ‌తికే రామ‌కృష్ణమ‌రాజుతో (సాయికుమార్‌) స్వేచ్ఛ‌కు ఎలాంటి సంబంధం ఉంది? స్వేచ్ఛ‌ను చంపేయాల‌ని అత‌డు ఎందుకు అనుకున్నాడు? త‌న ఊరివాళ్ల కోసం బ‌స‌వ‌రాజు అనే రౌడీని ఎదురించి మ‌హేష్ ఎలాంటి పోరాటం చేశాడు? భార‌తికి ఎలాంటి అన్యాయం జ‌రిగింది? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

కేరింత మూవీతో ఎంట్రీ...

మెర్సీ కిల్లింగ్ మూవీకి ఎంఎల్ రాజా మ్యూజిక్ అందించాడు. కేరింత‌ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పార్వ‌తీశం..తెలుగులో నేను నాన్న నా బాయ్‌ఫ్రెండ్స్‌, రోజులు మారాయి, భ‌లే మంచి చౌక బేర‌మ్, జగన్నాటకం, మార్కెట్ మ‌హాల‌క్ష్మితో పాటు మ‌రికొన్ని సినిమాల్లో హీరోగా న‌టించాడు.

క‌ర్ణ పిశాచి…

తెలుగు హార‌ర్ మూవీ క‌ర్ణ పిశాచి శ‌నివారం అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ మూవీకి విజ‌య్ మ‌ల్లాది ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ప్ర‌ణ‌వి, ర‌మ్య‌శ్రీ, నిఖిల్ కీల‌క పాత్ర‌లు పోషించారు. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది.

ల‌వ్‌తో పాటు లైఫ్‌లోనూ ఓ యువ‌కుడు ఫెయిల‌వుతాడు. తాగుబోతుగా మారిపోతాడు. అలాంటి టైమ్‌లోనే త‌న పూర్వీకుల‌కు సంబంధించిన ఓ పురాత‌న గ్రంథం అత‌డికి దొరుకుతుంది. ఆ బుక్ కార‌ణంగా ఆ యువ‌కుడి జీవితం ఎలా మారింది అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం