OTT Recent Telugu Releases: ఈ వీకెండ్‍లో చూసేందుకు రీసెంట్‍గా ఓటీటీల్లోకి 5 వచ్చిన తెలుగు సినిమాలు ఇవే
Recent Telugu OTT Releases: ఏప్రిల్ తొలివారంలో మరికొన్ని తెలుగు సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. ఈ వీకెండ్‍లో ఓటీటీల్లో తెలుగు రీసెంట్ కంటెంట్ చూడాలనుకునే వారికి ఇవి బెస్ట్ ఆప్షన్లుగా ఉన్నాయి. అలా.. ఇటీవలే ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు చిత్రాలు ఏవంటే..
ఈ వీకెండ్‍లో ఓటీటీల్లో తెలుగు సినిమాలు చూడాలని డిసైడ్ అయ్యారా.. అయితే, రీసెంట్‍గానే కొన్ని చిత్రాలు అడుగుపెట్టాయి. ఈవారం (ఏప్రిల్ తొలివారం) ఓటీటీల్లో విభిన్నమైన చిత్రాలు అడుగుపెట్టాయి. ఓ హారర్, మరో కామెడీ సహా మరిన్ని తెలుగు మూవీస్ అందుబాటులోకి వచ్చాయి. ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు వచ్చిన తెలుగు సినిమాలో ఏవో ఇక్కడ తెలుసుకోండి.
లంబసింగి
లంబసింగి సినిమా ఏప్రిల్ 2వ తేదీన డిస్నీ ప్లస్ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. భరత్‍రాజ్, బిగ్‍బాస్ ఫేమ్ దివీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మార్చి 15న థియేటర్లలో రిలీజ్ అయింది. నవీన్ గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే, ఈ లంబసింగి చిత్రం థియేటర్లలో రిలీజైన మూడు వారాల ఓటీటీలోకి వచ్చింది. ఈ చిత్రాన్ని హాట్‍స్టార్ ఓటీటీలో చూడొచ్చు. ఈ మూవీలో వంశీరాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ, మాధవి కీలకపాత్రల్లో కనిపించారు.
అదృశ్యం
అదృశ్యం సినిమా ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఏప్రిల్ 4వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చింది. మలయాళ మూవీ ‘ఇని ఉత్తరం’ చిత్రానికి తెలుగు వెర్షన్‍గా ఈ మూవీ వచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో అపర్ణా బాలమురళి, హరీశ్ ఉత్తమన్, కళాభవన్ షాజాన్, సిద్ధిఖీ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సుధీశ్ రామచంద్రన్ దర్శకత్వం వహించారు. మలయాళంలో రిలీజైన రెండేళ్లకు తెలుగు వెర్షన్‍లో అదృశ్యం పేరుతో ఈ చిత్రం వచ్చింది. ఈ మూవీని ఈవీటీ విన్ ఓటీటీలో వీక్షించవచ్చు.
తంత్ర
హారర్ సినిమా ‘తంత్ర’ ఓటీటీలో అడుగుపెట్టింది. ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఏప్రిల్ 5వ తేదీన ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చింది. అనన్య నాగళ్ల, ధనుష్ రాఘుమూడి ప్రధాన పాత్రలు పోషించిన తంత్ర చిత్రం మార్చి 15న థియేటర్లలో రిలీజైంది. శ్రీనివాస గోపిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. తంత్ర సినిమాలో టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్, కుషాలినీ, మనోజ్ ముత్యం కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి ఆర్ఆర్ ధృవన్ మ్యూజిక్ ఇచ్చారు.
చారి 111
స్పై కామెడీ ఎంటర్‌టైనింగ్ మూవీ ‘చారి 111’ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రం ఏప్రిల్ 5న సడెన్‍గా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. కమెడియన్ వెన్నెల కిశోర్ ఈ చిత్రంలో హీరోగా నటించారు. టీజీ కీర్తికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. సిమన్ కే కింగ్ సంగీతం అందించారు. మార్చి 1వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. సంయుక్త విశ్వనాథన్, మురళీ శర్మ కీలకపాత్రలు పోషించారు. చారి 111 చిత్రాన్ని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో చూడొచ్చు.
కిస్మత్
కిస్మత్ తెలుగు సినిమా ఏప్రిల్ 2వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అభినవ్ గోమటం, నరేశ్ అగస్త్య, విశ్వదేవ్, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీకి శ్రీనాథ్ బాదినేని దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజైంది. రెండు నెలల తర్వాత కిస్మత్ చిత్రం ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది.
టాపిక్