రమేష్ ఉప్పు హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన మూవీ ‘వీడే మన వారసుడు’. సందేశాత్మక కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో లావణ్య రెడ్డి, సర్వాణి మోహన్ హీరోయిన్లుగా నటించారు. సమ్మెట గాంధీ, విజయ రంగరాజు, ఆనంద్ భారతి, గూడూరు కిషోర్, శిల్ప (వైజాగ్) కీలక పాత్రలు పోషించారు. జూలై 18న తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా విడుదలకాబోతుంది. వీడే మన వారసుడు మూవీకి హీరో, డైరెక్టర్‌గానే కాకుండా స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు కూడా రమేష్ ఉప్పు అందించారు.
తాజాగా వీడే మన వారసుడు సినిమా చూసిన సెన్సార్ సభ్యులు చిత్రయూనిట్‌ను అభినందించారు. కుటుంబం, రైతుల పోరాటం, యువతపై మాదకద్రవ్యాల ప్రభావం వంటి అంశాలను సమర్థవంతంగా చూపించిన మూవీ మెచ్చుకున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ఈ సందర్భంగా దర్శకనిర్మాత రమేష్ ఉప్పు మాట్లాడుతూ.. “సమాజానికి మంచి సందేశం అందించే మూవీ ఇది. సినిమాలోని ఎమోషన్స్ ప్రతి ఒక్కరిని కదిలిస్తాయి. సెన్సార్ బోర్డు సభ్యులతో పాటు, ప్రీమియర్ షో చూసిన పలువురు ప్రముఖులు సినిమాపై ప్రశంసలు కురిపించడంతో మా నమ్మకం మరింతా పెరిగింది.మా కష్టానికి తగిన ఫలితం అందుతుందనే నమ్మకం బలంగా ఉంది. రైతుల కష్టాలను అర్థవంతంగా సినిమాలో చూపించాం” అని పేర్కొన్నారు. జూన్ 29న మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
ఈ సినిమాకు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేశారు. పాటలను సదివే దేవంద్ర అందించగా...బీజీఎమ్ శ్రీవెంకట్ సమకూర్చారు.