Shraddha Das: సనాతన ధర్మం కాన్సెప్ట్‌తో త్రికాల - శ్రద్ధాదాస్ సూపర్ హీరో మూవీ ట్రైలర్ రిలీజ్!
Shraddha Das: శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలో త్రికాల పేరుతో ఓ సూపర్ హీరో మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అజయ్, మాస్టర్ మహేంద్రన్ కీలక పాత్రలు పోషించారు. మణితెల్లగూటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

Shraddha Das: శ్రద్ధా దాస్ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చి చాలా రోజులు అవుతోంది. కొంత గ్యాప్ తర్వాత ఓ సూపర్ హీరో మూవీతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. సనాతన ధర్మం కాన్సెప్ట్‌కు సూపర్ హీరో ఎలిమెంట్స్ జోడించి రూపొందిన త్రికాల మూవీలో శ్రద్ధాదాస్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమెతో పాటు ఈ మూవీలో
మాస్టర్ మహేంద్రన్, అజయ్, సాహితి అవంచ, ఆమని, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి ముఖ్య పాత్రల్ని పోషించారు మణి తెల్లగూటి దర్శకత్వం వహించాడు. త్రికాల ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
తనికెళ్ల భరణి డైలాగ్స్‌తో...
‘యుద్దం రేపటి వెలుగు కోసం.. కానీ ఈ అంధకాసురిడి యుద్దం వెలుగుని నాశనం చేయడానికి’.. అంటూ తనికెళ్ల భరణి డైలాగ్స్‌తో ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా మొదలైంది. ‘ఒక సైక్రియార్టిస్ట్‌గా ఛాలెంజింగ్ కేసుని డీల్ చేస్తున్నా...అప్పుడే నాకు ఈ టిపికల్ కేసు వచ్చింది’ అంటూ శ్రద్దా దాస్ పాత్రను ఈ ట్రైలర్‌లో పరిచయం చేశారు. మాస్టర్ మహేంద్రన్ చేసే యాక్షన్ సీక్వెన్స్, ట్రైలర్ చివర్లో అజయ్ విశ్వరూపం, డైలాగ్స్ అదిరిపోయాయి. విజువల్స్, క్యారెక్టర్ లుక్స్ కొత్తగా ఉన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకుంటున్నాయి.
ఒక్క రోజే వర్క్ చేశా...
ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో అంబటి అర్జున్ మాట్లాడుతూ.. ‘త్రికాల ట్రైలర్ చూశాక అందరికీ ఈ మూవీ ఏంటో అర్థం అవుతుంది. ఈ మూవీ కోసం నేను ఒక్క రోజే వర్క్ చేశాడు. నా క్యారెక్టర్ డిఫరెంట్‌గా ఉంటుంది’ అని అన్నారు.మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ.. ‘త్రికాల సినిమా కోసం నిర్మాతలు చాలా కష్టపడ్డారు. ఈ మూవీ కోసం చాలా రీ షూట్స్ జరిగాయి. కానీ ఎప్పుడూ కూడా వారు ప్రశ్నించలేదు.ఈ వేసవిలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది’ అని చెప్పారు.
సినిమాటిక్ యూనివర్స్...
దర్శకుడు మణి మాట్లాడుతూ.. ‘అజయ్ కే ఈ కథను ముందుగా చెప్పాను. వీఎఫ్ఎక్స్ గురించి జాగ్రత్తగా చూసుకో అని ఆయన సలహా ఇచ్చారు. త్రికాల సినిమాటిక్ యూనివర్స్ అని ట్రైలర్‌లో పెట్టాం. ఈ మూవీకి నాతో పాటు అన్ని రోజులు పని చేశాడు మహేంద్రన్. సాహితి పాత్రను ట్రైలర్‌లో ఎక్కువగా రివీల్ చేయలేదు.
షాజిత్, హర్ష వర్దన్ రామేశ్వర్ సంగీతం అద్భుతంగా ఉంటుంది అని అన్నాడు. ‘సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని, మన సూపర్ హీరోల్ని అందరికీ చూపించాలని త్రికాల సినిమాను తీశాం. బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్‌లా మన త్రికాల ఉంటుంది. కాలంతో సంబంధం లేకుండా ప్రపంచాన్ని కాపాడేవాడే త్రికాల. ఇంకా త్రికాల గురించి తెలియాలంటే సినిమాను చూడాల్సిందేనని నిర్మాత రాధిక తెలిపింది.
సంబంధిత కథనం