Radhamadhavam OTT: ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు మూవీ రాధామాధ‌వం - ప‌రువు హ‌త్య‌ల సినిమాను ఎందులో చూడాలంటే?-telugu movie radhamadhavam streaming now on amazon prime video ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Radhamadhavam Ott: ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు మూవీ రాధామాధ‌వం - ప‌రువు హ‌త్య‌ల సినిమాను ఎందులో చూడాలంటే?

Radhamadhavam OTT: ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు మూవీ రాధామాధ‌వం - ప‌రువు హ‌త్య‌ల సినిమాను ఎందులో చూడాలంటే?

Nelki Naresh Kumar HT Telugu
Jun 20, 2024 09:02 AM IST

Radhamadhavam OTT: తెలుగు మూవీ రాధామాధ‌వం ఓటీటీలో రిలీజైంది. గురువారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ప‌రువు హ‌త్య‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో వినాయ‌క్ దేశాయ్‌, అప‌ర్ణ‌దేవి హీరోహీరోయిన్లుగా న‌టించారు.

 రాధామాధ‌వం ఓటీటీ
రాధామాధ‌వం ఓటీటీ

Radhamadhavam OTT: ప‌రువు హ‌త్య‌ల నేప‌థ్యంలో వ‌చ్చిన తెలుగు మూవీ రాధామాధ‌వం ఓటీటీలోకి వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో బుధ‌వారం నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. రాధామాధ‌వం సినిమాలో వినాయ‌క్ దేశాయ్‌, అప‌ర్ణ దేవి హీరోహీరోయిన్లుగా న‌టించారు. దాస‌రి ఇస్సాక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారుఈ ఏడాది మార్చి 1న ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది.

పీరియాడిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో...

చిన్న సినిమాగా దాదాపు అంద‌రూ కొత్త న‌టీన‌టుల‌తోనే రాధామాధ‌వం మూవీ రూపొందింది. పీరియాడిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో విలేజ్ ల‌వ్ స్టోరీగా ద‌ర్శ‌కుడు ఈ మూవీ తెర‌కెక్కింది.

రాధా మాధ‌వం క‌థ ఇదే...

రాధ (అప‌ర్ణ‌దేవి) ....మాధ‌వ పేరుతో కేర్ సెంట‌ర్ నెల‌కొల్పుతుంది. అనాథ‌లైన వృద్ధుల‌కు, పిల్ల‌ల‌కు సేవ చేస్తుంటుంది. ఆ కేర్ సెంట‌ర్‌లోకి జైలు నుంచి త‌ప్పించుకున్న‌వీర‌భ‌ద్రం (మేక రామ‌కృష్ణ‌) చేరుతాడు. త‌న కూతురు రాధ‌నే ఈ కేర్ సెంట‌ర్ న‌డుపుతుంద‌నే నిజం వీర‌భ‌ద్రానికి తెలుస్తుంది. అస‌లు వీర‌భ‌ద్రం జైలుకు ఎందుకు వెళ్లాడు? రాధ ప్రేమించిన మాధ‌వ్ (వినాయ‌క్ దేశాయ్‌) ఏమ‌య్యాడు? రాధ‌, మాధ‌వ్‌ల ప్రేమ‌క‌థ‌కు వీర‌భ‌ద్రం ఎందుకు అడ్డు చెప్పాడు? మాధ‌వ్ ప్రేమ కోసం రాధ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంది అన్న‌దే రాధామాధ‌వం మూవీ క‌థ‌.

కులమ‌త అంత‌రాల‌తో...

ప్రేమ‌కు కుల‌మ‌తాలు ఎలా అడ్డంకిగా నిలుస్తున్నాయి? ప‌రువు కోసం పాకులాడి కొంద‌రు ఎలాంటి క‌ఠిన‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌నేది ఈ మూవీలో డైరెక్ట‌ర్ చూపించాడు. రాధామాధ‌వం మూవీకి చైతూ మ్యూజిక్ అందించాడు. జ‌య‌ప్ర‌కాష్, ప్రియ, న‌వీన్ తో పాటు ప‌లువురు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

మ‌ల‌యాళ బ్యూటీ...

రాధామాధ‌వం మూవీతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది మ‌ల‌యాళీ బ్యూటీ అప‌ర్ణ‌దేవి. ఈ మూవీ త‌ర్వాత తెలుగులో 1996 ధ‌ర్మ‌పురి, సోద‌ర‌సోద‌రీమ‌ణులారాతో పాటు మ‌రికొన్ని చిన్న సినిమాలు చేసింది. గ్లామ‌ర్‌కు దూరంగా ఎక్కువ‌గా ట్రెడిష‌న‌ల్ రోల్స్‌లోనే క‌నిపించింది.

సీరియ‌ల్స్‌లో...

సినిమాల్లోకి రావ‌డానికి కంటే ముందు మ‌ల‌యాళంలో ప‌లు సీరియ‌ల్స్‌లో క‌నిపించింది. టీవీ సీరియ‌ల్స్ ద్వారా వ‌చ్చిన గుర్తింపుతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. పెళ్లి చేసుకొని సినిమాలు, సీరియ‌ల్స్‌లో న‌టిస్తోంది. అప‌ర్ణ‌దేవికి యాక్టింగ్ గురువు ఆమె భ‌ర్త కావ‌డం గ‌మ‌నార్హం.

WhatsApp channel

టాపిక్