ఓటీటీలో దుమ్ము రేపుతున్న తెలుగు సినిమా.. ఐఎండీబీలో 8.3 రేటింగ్.. ఎక్కడ చూసినా పాజిటివ్ రివ్యూలు-telugu movie anaganaga on etv win ott hit 100 million streaming minutes ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలో దుమ్ము రేపుతున్న తెలుగు సినిమా.. ఐఎండీబీలో 8.3 రేటింగ్.. ఎక్కడ చూసినా పాజిటివ్ రివ్యూలు

ఓటీటీలో దుమ్ము రేపుతున్న తెలుగు సినిమా.. ఐఎండీబీలో 8.3 రేటింగ్.. ఎక్కడ చూసినా పాజిటివ్ రివ్యూలు

Hari Prasad S HT Telugu

నేరుగా ఓటీటీలోకి వచ్చిన ఓ తెలుగు సినిమా ఇప్పుడు దుమ్ము రేపుతోంది. ప్రతి రోజూ ఓ మైలురాయిని అందుకుంటూ దూసుకెళ్తోంది. గత వారం స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ మూవీ తాజాగా 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అందుకోవడం విశేషం.

ఓటీటీలో దుమ్ము రేపుతున్న తెలుగు సినిమా.. ఐఎండీబీలో 8.3 రేటింగ్.. ఎక్కడ చూసినా పాజిటివ్ రివ్యూలు

ఓటీటీలో చిన్న సినిమాలు కూడా సత్తా చాటుతున్నాయి. థియేటర్లలో కాకుండా నేరుగా డిజిటల్ ప్రీమియర్ అయిన మూవీస్ ని కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకు తాజా ఉదాహరణ అనగనగా మూవీ. ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు మరో రికార్డును సొంతం చేసుకుంది.

అనగనగా మూవీ రికార్డు

ఓటీటీలో కొన్నిసార్లు బ్లాక్‌బస్టర్ సినిమాలు కూడా బోల్తా పడుతుంటాయి. మరికొన్నిసార్లు చిన్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఇప్పుడు సుమంత్ నటించిన అనగనగా మూవీ విషయంలోనూ ఇదే జరుగుతోంది. థియేటర్లలో కాకుండా నేరుగా ఈటీవీ విన్ ఓటీటీలోకి అడుగుపెట్టిన ఈ సినిమా.. ఐదు రోజుల్లోపే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ ఘనతను సొంతం చేసుకుంది.

ఈ విషయాన్ని ఈటీవీ విన్ ఓటీటీయే సోమవారం (మే 19) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. “100 మిలియన్ల ప్లస్ స్ట్రీమింగ్ మినట్స్. 100 మిలియన్ల ప్లస్ ఎమోషనల్ కన్నీళ్లు. మీ ప్రేమ అనగనగాను కేవలం ఒక సినిమా కాదు ఓ హృదయపూర్వక ప్రయాణంగా మలిచింది. చూసినందుకు, ఫీలైనందుకు, మాతో ప్రతి క్షణాన్ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్యూ” అనే క్యాప్షన్ తో ఈ విషయం వెల్లడించింది. అనగనగా మూవీకి ఐఎండీబీలో 8.3 రేటింగ్ వచ్చిన విషయం కూడా తెలిపింది.

అనగనగా మూవీ గురించి..

అనగనగా మూవీ మే 15 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అంతకు ఒక రోజు ముందే థియేటర్లలో ప్రీమియర్ షోలు వేశారు. వాటికి అన్ని వైపుల నుంచీ పాజిటివ్ రివ్యూలు రావడంతో ఓటీటీ స్ట్రీమింగ్ ప్రారంభం కాగానే ప్రేక్షకులు ఎగబడి చూశారు. దీంతో రెండు రోజుల్లోనే 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అందుకుంది.

ఈ సినిమాను సన్నీ సంజయ్ డైరెక్ట్ చేయగా.. సుమంత్, కాజల్ చౌదరి లీడ్ రోల్స్ లో నటించారు. దేశ విద్యావ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపే కథతో ఈ సినిమాను రూపొందించారు. ఇందులో వ్యాస్ కుమార్ అనే టీచర్ పాత్రలో సుమంత్ నటించాడు. అతనికి చాలా రోజుల తర్వాత దక్కిన సూపర్ హిట్ మూవీ ఇది. తరగతి గదిలో పాఠాలను కథలుగా చెప్పడాన్ని ప్రోత్సహించే పాత్ర ఇది.

మార్కులు, ర్యాంకులు అనే మూస కార్పొరేట్ ధోరణిని అతడు తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లను కూడా ఎదుర్కొంటాడు. ఈ సినిమాను తెరకెక్కించిన తీరు తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో ఓటీటీలో ఈ మూవీ దూసుకెళ్తోంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం