Telugu OTT: డైరెక్ట్‌గా ఓటీటీలో తెలుగు కామెడీ లవ్ డ్రామా మూవీ స్ట్రీమింగ్ - రెండు ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్
Telugu OTT: తెలుగు మూవీ అది ఒక ఇదిలే శుక్రవారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. లవ్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి టాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాపర్ స్వర్ణ మాస్టర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సబ్యసాచి మిశ్రా, రాధిక ప్రీతి హీరోహీరోయిన్లుగా నటించారు.
Telugu OTT: తెలుగు కామెడీ మూవీ అది ఒక ఇదిలే ఓటీటీలో రిలీజైంది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రీ స్ట్రీమింగ్ కాకుండా రెంటల్ విధానంలో ఈ తెలుగు మూవీ ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అది ఒక ఇదిలే మూవీని చూడాలంటే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 99 రూపాయల రెంటల్ చెల్లించాల్సిందే. అమెజాన్ ప్రైమ్‌తో బీసీఐనీట్ ఓటీటీలో కూడా అది ఒక ఇదిలే మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

కామెడీ లవ్‌స్టోరీ...
రొమాంటిక్ కామెడీ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో సబ్యసాచి మిశ్రా, రాధిక ప్రీతి హీరోహీరోయిన్లుగా నటించారు. రక్ష భవానీ, శ్యామ్ తేజో వికాస్ కీలక పాత్రలు పోషించారు. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ స్వర్ణ మాస్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, కొరియోగ్రఫీ కూడా స్వర్ణ మాస్టర్ అందించడం గమనార్హం. మురళీధర్ మ్యూజిక్ అందించాడు. థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలోనే ఈ తెలుగు మూవీ రిలీజైనట్లు సమాచారం. తమిళంలో నాదిర్ దిన్నా పేరుతో 2022లో ఈ మూవీ విడుదలైంది.
అది ఒక ఇదిలే మూవీ కథ ఏంటంటే?
ప్రేమ, స్నేహం అంశాలతో డైరెక్టర్ స్వర్ణ ఈ మూవీని తెరకెక్కించారు. సిద్ధు, బుజ్జి చిన్ననాటి మిత్రులు. ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటుంటారు. ఇద్దరు ఎప్పుడూ గొడవలు పడుతుంటారు. సిద్ధును బుజ్జి ఇష్టపడుతుంది. ఈ ప్రేమ కారణంగా సిద్ధుకు, బుజ్జి అన్నయ్యకు మధ్య గొడవలు మొదలవుతాయి. ప్రాణ మిత్రులుగా ఉన్న వారు శత్రువులుగా మారిపోతారు. ఈ ప్రేమ జంట ఎలా ఒక్కటయ్యారు? ఈ క్రమంలో వాళ్లు ఎదుర్కొన్న అడ్డంకులు ఏమిటన్నదే అది ఒక ఇదిలే మూవీ కథ.
యాభై సినిమాలు...
సీనియర్ కొరియోగ్రాఫర్ అయిన స్వర్ణ టాలీవుడ్‌లో యాభైకిపైగా సినిమాలకు డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేశారు. ఢమరుకం, నాగవల్లి, మహాసముద్రం, లీడర్, వేదం, గోవిందుడు అందరివాడేలేతో పాటు పలు సినిమాలకు కొరియోగ్రఫీ అందించారు.
తెలుగులో...
ఒడియా యాక్టర్ అయిన సబ్యసాచి మిశ్రా తెలుగులో సీతారాముల కళ్యాణం చూతమురారండి, నీరాజనంతో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు.