Court OTT Streaming: కోర్ట్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్: అనుకున్నదే జరిగింది!-telugu legal drama movie court state vs nobody now trending india top on netflix ott steaming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Court Ott Streaming: కోర్ట్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్: అనుకున్నదే జరిగింది!

Court OTT Streaming: కోర్ట్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్: అనుకున్నదే జరిగింది!

Court Movie OTT Streaming: కోర్ట్ చిత్రం ఓటీటీలోనూ అదిరే ఓపెనింగ్ దక్కించుకుంది. ఐదు భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చిన ఈ చిత్రం భారీ వ్యూస్ సాధిస్తోంది. దీనిపై ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఓ అప్‍డేట్ ఇచ్చింది.

Court OTT: కోర్ట్ ఓటీటీ స్ట్రీమింగ్: అనుకున్నదే జరిగింది!

తెలుగు లీగల్ డ్రామా సినిమా ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ నోబడీ’ థియేటర్లలో దుమ్మురేపింది. రామ్ జగదీశ్ దర్శకత్వంలో ప్రియదర్శి లీడ్ రోల్ చేసిన ఈ మూవీ అంచనాలను మించి కలెక్షన్లు సాధించింది. బ్లాక్‍బస్టర్ కొట్టిన కోర్ట్ చిత్రం నెలలోపే ఓటీటీలోకి వచ్చింది. ఓటీటీలో కూడా ఈ సినిమా సత్తాచాటుతోంది. స్ట్రీమింగ్‍లో ఓపెనింగ్ అదిరిపోయింది. ఆ వివరాలు ఇవే..

అనుకున్నట్టు టాప్ ప్లేస్‍కు..

కోర్ట్ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఒక్క రోజులోనే ఇండియా వ్యాప్తంగా ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు దూసుకొచ్చేసింది. ఈ చిత్రం ఈ శుక్రవారం ఏప్రిల్ 11వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడలో అందుబాటులోకి వచ్చింది. 24 గంటలలోపే నేడు (ఏప్రిల్ 12) నేషనల్ వైడ్‍లో నెట్‍ఫ్లిక్స్ ట్రెండింగ్‍లో ఫస్ట్ ప్లేస్‍కు చేరుకుంది.

నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో కోర్ట్ సినిమా హవా చూపిస్తుందని ముందు నుంచే అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం గ్రిప్పింగ్‍గా ఉండడం, కోర్ట్ రూమ్ డ్రామా కావడం, బాగా పాపులర్ అవటంతో నేషనల్ వైడ్‍గా ఈ మూవీ సత్తాచాటుతుందనే అనిపించింది. అనుకున్నట్టుగానే కోర్ట్ చిత్రం 24 గంటల్లోనే నెట్‍ఫ్లిక్స్ ఇండియా సినిమాల విభాగం ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు ఎగబాకింది. ఈ మూవీ మరిన్ని రోజులు జోరు చూపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

అధికారికంగా వెల్లడించిన నెట్‍ఫ్లిక్స్

కోర్ట్ చిత్రం ట్రెండింగ్‍లో టాప్‍కు వచ్చిందని నెట్‍ఫ్లిక్స్ నేడు అధికారికంగా వెల్లడించింది. “న్యాయం మాట్లాడుతోంది. ప్రపంచం వింటోంది. కోర్ట్: స్టేట్ వర్సెస్ నోబడీ చిత్రం నెట్‍ఫ్లిక్స్‌లో నంబర్ 1లో ట్రెండ్ అవుతోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో స్ట్రీమ్ అవుతోంది” అని సోషల్ మీడియాలో నేడు పోస్ట్ చేసింది నెట్‍ఫ్లిక్స్.

కోర్ట్ సినిమా తెలుగులో థియేటర్లలో రిలీజై భారీ హిట్ కొట్టింది. సుమారు రూ.10కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ దాదాపు రూ.57కోట్ల కలెక్షన్లు సాధించింది. లీగల్ డ్రామా చిత్రంగా వచ్చి ఆ రేంజ్ కలెక్షన్లతో ఆశ్చర్యపరిచింది. నేచురల్ స్టార్ నానికి చెందిన వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ఈ మూవీని నిర్మించింది. దీంతో ముందు నుంచే ఈ చిత్రానికి మంచి బజ్ ఏర్పడింది. చిత్రం కూడా మెప్పించటంతో బ్లాక్‍బస్టర్ సాధించింది.

కోర్ట్ చిత్రంలో ప్రియదర్శితో పాటు హర్ష్ రోహణ్, శ్రీదేవి కూడా లీడ్ రోల్ చేశారు. ప్రేమ కథ, పోక్సో కేసు, కోర్టులో వాదనలు ఈ చిత్రంలో ప్రధానంగా ఉంటాయి. గ్రిప్పింగ్ నరేషన్‍తో ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ రామ్ జగదీశ్. తన తొలి మూవీతోనే సక్సెస్ సాధించారు. ఈ మూవీలో న్యాయవాదిగా ప్రియదర్శి తన నటనతో మెప్పించారు. సీనియర్ యాక్టర్ శివాజీ నెగెటివ్ రోల్ చేశారు. ఈ చిత్రంలో హర్షవర్దన్, సాయికుమార్, సురభి పార్వతి, రోహిణి కీరోల్స్ చేశారు.

కోర్ట్ సినిమాకు విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ ఇచ్చారు. ప్రశాంతి త్రిపురనేని, దీప్తి గంటా నిర్మాతలుగా ఉండగా.. నాని సమర్పకుడిగా వ్యవహరించారు. ఈ చిత్రం ప్రమోషన్లలోనూ బాగా పాల్గొన్నారు నాని. చాలా నమ్మకంగా మాట్లాడారు. అందుకు తగ్గట్టే ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం