Telugu Indian Idol 3: తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 వచ్చేసింది.. ఈ మ్యూజిక్ షో ఎక్కడ చూడాలంటే?
Telugu Indian Idol 3: సింగింగ్ రియాలిటీ షో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 వచ్చేసింది. శుక్రవారం (జూన్ 14) నుంచే ఈ షో ప్రారంభమైనట్లు ఆహా ఓటీటీ అధికారికంగా అనౌన్స్ చేసింది.
Telugu Indian Idol 3: తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 మొదలైంది. ఈ మ్యూజిక్ షో కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఆహా ఓటీటీ గుడ్ న్యూస్ చెప్పింది. శుక్రవారం (జూన్ 14) నుంచే ఈ షో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మొదటి రెండు సీజన్లు విజయవంతంగా పూర్తవడంతో ఈ మూడో సీజన్ పై ఎక్కడ లేని ఆసక్తి నెలకొంది.
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3
ఇండియన్ ఐడల్ షో దేశంలో ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. హిందీలో వచ్చే ఈ షోకి దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈ సింగింగ్ రియాలిటీ తెలుగులోనూ వచ్చిన విషయం తెలిసిందే. ఆహా ఓటీటీలో ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో తాజాగా మూడో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మూడో సీజన్ ప్రారంభమైందన్న అనౌన్స్‌మెంట్ ను ఆహా తన సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ ద్వారా చేసింది. "స్వర సంగీత సమరం.. సరిగమ రాగాల సంబరం.. తెలుగు ఇండియన్ ఐడల్ 3 ఆగమనం.. గ్లోబల్ స్టార్ ని చేసే స్టార్ మీరే.. ఇక చూసేయండి" అనే క్యాప్షన్ తో ఈ షో ప్రారంబమైన విషయాన్ని ఆహా వెల్లడించింది. ఇందులోనే తొలి ఎపిసోడ్ లింక్ కూడా షేర్ చేసింది.
తెలుగు ఇండియన్ ఐడల్.. 1500 ఆడిషన్స్
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఇక నుంచి ప్రతి శుక్ర, శనివారాల్లో సాయంత్రం 7 గంటల నుంచి స్ట్రీమింగ్ అవుతుందని తెలిపింది. ఈ సందర్భంగా తమ ఎక్స్ అకౌంట్ ప్రొఫైల్ పిక్ కూడా మార్చేసింది. ఇందులో ఇండియన్ ఐడల్ మైక్ ఫొటోను ఉంచింది. ఈ షో ప్రారంభం కానుండటంతో శుక్రవారం (జూన్ 14) ఉదయం నుంచే ఆహా ఓటీటీ తమ సోషల్ మీడియాలో కౌంట్‌డౌన్ మొదలు పెట్టింది.
లాంచ్ ప్రోమోను కూడా గత వారం రిలీజ్ చేసింది. ఈసారి ఈ షోకి జడ్జీలుగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సింగర్లు కార్తీక్, గీతా మాధురి, శ్రీరామచంద్ర వ్యవహరిస్తున్నారు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3పై గత కొన్నాళ్లుగా ఎంతో హైప్ క్రియేటైంది. మొత్తానికి షో ప్రారంభం కావడంతో ఈ సింగింగ్ రియాలిటీ షో తెలుగు ప్రేక్షకులకు మంచి టైంపాస్ కానుంది.
మొత్తం 33 దేశాలలో ఈ కొత్త సీజన్ కోసం ఆడిషన్స్ నిర్వహించారు. మొత్తంగా 1500 ఆడిషన్స్ జరగడం విశేషం. తొలి రోజు ఎపిసోడ్లో ఆడిషన్స్ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇందులో గోల్డెన్ మైక్ కోసం సింగర్స్ పోటీ పడ్డారు. ఈ ఆడిషన్స్ లో ఎవరు గోల్డెన్ మైక్ గెలుచుకున్నారన్నది ప్రారంభ ఎపిసోడ్లలో తేలనుంది. తర్వాత అసలు కాంపిటీషన్ ప్రారంభం అవుతుంది.
తెలుగు ఇండియన్ ఐడల్ తొలి సీజన్ లో 31 ఎపిసోడ్లు, రెండో సీజన్ లో 29 ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అయ్యాయి. ఇప్పుడు మూడో సీజన్ ఎన్ని ఎపిసోడ్ల పాటు సాగుతుందో చూడాలి.