Telugu Horror Web Series: ఓటీటీలోకి వచ్చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ -స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా మరో ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ సిరీస్‌కు ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐస్‌లాండ్ అనే టైటిల్ ఖరారు చేశారు.
తెలుగులోకి మరో ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ రాబోతోంది. ఈ వెబ్‌సిరీస్‌కు ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐస్‌లాండ్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ వెబ్‌సిరీస్ టైటిల్, ఫస్ట్ లుక్ శనివారం రిలీజైంది. ఈ హారర్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా మంది యాక్టర్స్ కనిపిస్తున్నారు. అషుతోష్ రాణా , నందు, దివి, తేజస్వి, అజయ్ కతుర్వార్‌తో పాటు సీనియర్ యాక్టర్లు భానుచందర్, సుధ సీరియస్ లుక్‌లో పోస్టర్‌లో దర్శనమిచ్చారు .ఈ వెబ్‌సిరీస్ ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆసక్తిని పంచుతోంది.
త్వరలో డిస్నీ హాట్ స్టార్‌లో...
ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐస్‌లాండ్ వెబ్‌సిరీస్‌కు దర్శకుడితో పాటు ఇతర టెక్నీషియన్లు ఎవరన్నది మేకర్స్ రివీల్ చేయలేదు. ఈ వెబ్‌సిరీస్ త్వరలోనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
మోక్ష అనే ఐస్‌లాండ్ బ్యాక్‌డ్రాప్ లో తెలుగు వెబ్‌సిరీస్ సాగనున్నట్లు టైటిల్ చూస్తుంటే తెలుస్తోంది. ఆ ఐస్‌లాండ్‌లో అడుగుపెట్టిన వారికి ఎలాంటి అనూహ్య సంఘటనలు ఎదురయ్యాయి? ఆ ఐస్‌లాండ్ మిస్టరీని ఎలా రివీల్ చేశారన్నది ఈ సిరీస్‌లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఐదు భాషల్లో...
ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐస్‌లాండ్ వెబ్‌సిరీస్ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. తొందరలోనే ఈ వెబ్‌సిరీస్ టీజర్, ట్రైలర్స్‌తో పాటు ప్రమోషన్స్ మొదలుపెట్టబోతున్నట్లు తెలిసింది. మొత్తం ఏడు ఎపిసోడ్స్‌తో ఈ తెలుగు వెబ్ సిరీస్ తెరకెక్కుతోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కల్కి తర్వాత రీఎంట్రీ...
బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అషుతోష్ రాణా తెలుగులో పలు సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించాడు. వెంకీ, బలుపు, పటాస్, నేనే రాజు నేనే మంత్రి సినిమాల్లో తన విలనిజంతో ఆడియెన్స్‌ను భయపెట్టాడు అషుతోష్ రాణా. 2019లో రిలీజైన కల్కి తర్వాత టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్నాడు అషుతోష్ రాణా. లాంగ్ గ్యాప్ తర్వాత ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐస్‌లాండ్‌తో తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ప్రస్తుతం హిందీలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2లో అషుతోష్ రాణా కీలక పాత్ర చేస్తోన్నాడు.
సింబా మూవీలో...
నందు, దివి ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్‌సిరీస్‌లలో నటిస్తున్నారు. ఈ శుక్రవారం రిలీజైన సింబా మూవీలో ఓ కీలక పాత్రలో దివి కనిపించింది. మ్యాన్షన్ 24, వధువుతో పాటు తెలుగులో నందు పలు వెబ్‌సిరీస్‌లు చేశాడు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఇటీవల రిలీజైన యక్షిణి, మ్యాన్షన్ 24, దయా, వధువు వెబ్‌సిరీస్‌లు ఆడియెన్స్‌ను మెప్పించాయి.