ఓటీటీలో ఎన్నో రకాల సినిమాలు అలరిస్తున్నాయి. వాటిలో ఎక్కువగా హారర్ థ్రిల్లర్స్ ఉంటున్నాయి. ఈ జోనర్ సినిమాలు వివిధ కాన్సెప్ట్‌తో తెరకెక్కినప్పటికీ ప్రేక్షకులకు భయం, థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వటమే వాటి టార్గెట్. అయితే, అలాంటి ట్విస్టులతో వణికించే ఓ తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమాను సజెషన్ కింద ఇక్కడ తెలుసుకుందాం.
ఆ తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీనే ది ఎండ్. టాక్సీ వాలా, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో దర్శకుడుగా మంచి పేరు తెచ్చుకున్న రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ట్ చేసిన తొలి సినిమానే ది ఎండ్. 2014లో హారర్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 15న థియేటర్లలో విడుదలైంది. మంచి పేరు కూడా తెచ్చుకుంది.
అలాగే, అన్ని సినిమాలకు రేటింగ్ ఇచ్చే ఐఎమ్‌డీబీ సంస్థ ది ఎండ్ మూవీకి పదికి 6.5 రేటింగ్ ఇచ్చింది. అంతేకాకుండా స్టార్ మా షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌లో ది ఎండ్ సినిమా విజేతగా నిలిచింది. అలాగే, 94 శాతం మంది గూగుల్ యూజర్స్ ది ఎండ్ సినిమాను లైక్ చేశారు.
ఇక ది ఎండ్ సినిమాలో హీరోయిన్ పావని రెడ్డి, యువ చంద్ర, సుధీర్ రెడ్డి గుజ్జుల, సందీప్ వెద్, గజల్ సోమయ ప్రధాన పాత్రలు పోషించారు. ఇలాంటి ది ఎండ్ ఓటీటీలో కాకుండా మరో వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది. యూట్యూబ్‌లో ది ఎండ్ తెలుగులో ప్రసారం అవుతోంది.
రెండు గంటల 28 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ది ఎండ్ యూట్యూబ్‌లోని ఐ డ్రీమ్ ఛానెల్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కాబట్టి, హారర్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే వారు ట్విస్టులతో వణికించే ఈ తెలుగు హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ ది ఎండ్‌ను యూట్యూబ్‌లో ఫ్రీగా చూసేయొచ్చు.
ఇక ది ఎండ్ సినిమా కథ అంతా భార్యాభర్తలు అయిన ప్రియా (పావని రెడ్డి), రాజీవ్ మ్యాథ్యూస్ (సుధీర్ రెడ్డి), గౌతమ్ (యువ చంద్ర), రేఖ గజల్ (సోమయ) మధ్య నడుస్తుంది. రాజీవ్, ప్రియ పెళ్లి చేసుకుని హైదరాబాద్ సిటీ అవుట్‌స్కట్స్‌లో ఉన్న సొంత విల్లాలో సంతోషంగా జీవితం గడుపుతుంటారు.
ప్రియ, రాజీవ్‌కు కామన్ ఫ్రెండ్ అయిన గౌతమ్ హాస్పిటల్ కట్టడానికి యూకే నుంచి వస్తాడు. ఈ క్రమంలోనే ప్రియ, రాజీవ్ ఇంట్లో అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. ప్రియకు దెయ్యం పట్టిందని గౌతమ్‌కు కాల్ చేసి చెబుతాడు రాజీవ్. దాంతో ఇంటికి గౌతమ్ వస్తాడు.
ఆ తర్వాత ఆ విల్లాలో ఏం జరిగింది? ప్రియాకు పట్టిన దెయ్యం ఎవరు? ప్రియ-రాజీవ్-గౌతమ్ ముగ్గురికి ఉన్న సంబంధం ఏంటీ? భార్యాభర్తల మధ్య దెయ్యం చిచ్చు పెట్టడానికి గల కారణం ఏంటీ? అనే థ్రిల్లింగ్ అండ్ ఎంగేజింగ్ సీన్లతో తెరకెక్కిన ది ఎండ్‌ను యూట్యూబ్‌లో ఉచితంగా వీక్షించవచ్చు.
సంబంధిత కథనం