తెలుగు హారర్ థ్రిల్లర్ ‘భవానీ వార్డ్ 1997’ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో గణేశ్ రెడ్డి, పూజా కెండ్రే లీడ్ రోల్స్ చేశారు. ఈ సినిమా థియేట్రికల్ రన్‍తో మిక్స్డ్ టాక్ వచ్చింది. పెద్దగా కలెక్షన్లను దక్కించుకోలేకపోయింది. ఈ భవానీ వార్డ్ 1997 చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.
భవానీ వార్డ్ 1997 సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే, రెంటల్ పద్ధతిలో ఈ మూవీ అడుగుపెట్టింది. ప్రస్తుతం రూ.99 రెంట్ చెల్లించి ఈ మూవీని ప్రైమ్ వీడియో చూసేలా అందుబాటులోకి వచ్చింది. తెలుగులో ఒక్కటే స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది.
భవానీ వార్డ్ 1997 మూవీకి జీడీ నరసింహ దర్శకత్వం వహించారు. లవ్, హారర్ ఎలిమెంట్లతో ఈ చిత్రాన్ని తెరకెకక్కించారు. ఈ మూవీలో గణేశ్, పూజతో పాటు గాయత్రి గుప్తా, జబర్దస్త్ అప్పారావు, మీషమ్ సురేశ్ కీలకపాత్రలు పోషించారు.
అజయ్, దివ్య ప్రేమలో ఉంటారు. ప్రశాంతంగా సాగుతున్న వారి జీవితాలల్లో ఒక్కసారిగా కుదుపు వస్తుంది. దివ్యకు దెయ్యం పడుతుంది. ఆత్మ ఆవహిస్తుంది. ఆ తర్వాత ఊహించని ఘటనలు జరుగుతూ ఉంటాయి. మానసికంగా నలిగిపోతారు. దివ్యను కాపాడేందుకు అజయ్ ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో సమస్య ఇంకా పెరిగిపోతుంది. అసలు దివ్యకు పట్టిన ఆత్మ ఎవరిది? ప్రేయసిని అజయ్ కాపాడుకోగలిగాడా? ఆ ఆత్మ దివ్యనే ఎందుకు ఎంచుకుంది? చివరికి ఏమైందనేది భవానీ వార్డ్ 1997 సినిమాలో ఉంటాయి.
భవానీ వార్డ్ 1997 చిత్రాన్ని జీఆర్డీ మోషన్ పిక్చర్స్ పతాకంపై చంద్రకఠ సోలంకి నిర్మించారు. దర్శకుడు నరసింహ కూడా నిర్మాణంలో భాగమయ్యారు. నిస్సు జస్టిన్ సంగీతం అందించిన ఈమూవీకి అరవింద్ భవానీ సినిమాటోగ్రఫీ చేశారు.
కాగా, ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘ఓదెల 2’ దుమ్మురేపుతోంది. తమన్నా భాటియా ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ ప్రైమ్ వీడియో సినిమాల విభాగంలో నేషనల్ వైడ్‍లో టాప్‍లో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. థియేటర్లలో రిలీజైన నెలలోగానే మే 8న ఓదెల 2 ప్రైమ్ వీడియోలోకి ఎంట్రీ ఇచ్చింది.
సంబంధిత కథనం