Tantiram OTT: ఓటీటీలో భయపెడుతున్న తెలుగు హారర్ మూవీ తంతిరం.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Tantiram OTT Streaming: ఇటీవల ఓటీటీలోకి తెలుగు హారర్ మూవీ తంతిరం వచ్చేసింది. పెద్దగా ప్రమోషన్స్ జరగని ఈ సినిమా థియేటర్ రన్ తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి తంతిరం మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ వివరాల్లోకి వెళితే..
Tantiram: Chapter 1: Tales of Sivakasi OTT: నేటి కాలంలో ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీసులు మంచి ఆదరణ పొందుతున్నాయి. నేరుగా ఓటీటీలో విడుదలయ్యే సినిమాలే కాకుండా థియేటర్లలో పెద్దగా ప్రేక్షకాదరణ పొందని చిత్రాలు సైతం ఈ డిజిటల్ వేదికలపై సత్తా చాటుతున్నాయి. అలా ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్న తెలుగు హారర్ మూవీ "తంతిరం: టేల్స్ ఆఫ్ శివకాశి చాప్టర్ 1".
శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన తంతిరం టేల్స్ ఆఫ్ శివకాశి చిత్రానికి ముత్యాల మెహర్ దీపక్ దర్శకత్వం వహించారు. ఇటీవల దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 13న థియేటర్లలో విడుదలైంది తంతిరం మూవీ. అయితే, పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడంతో తంతిరం సినిమా గురించి ప్రేక్షకులకు ఎక్కువగా తెలియలేదు. ఇక థియేటర్లలో విడుదలైన కొన్ని రోజులకే మాయమైపోయింది తంతిరం మూవీ.
ఇప్పుడు తంతిరం మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు (Tantiram: Tales of Sivakasi OTT) వచ్చేసింది. ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండానే సైలెంట్‍గా ఓటీటీలోకి వచ్చి భయపెడుతోంది తంతిరం చిత్రం. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 11 నుంచి తంతిరం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
భార్యాభర్తల మధ్య ఓ ఆత్మ ప్రవేశిస్తే.. వారి జీవితం ఎలాంటి మలుపు తిరిగిందన్న కథాంశంతో తంతిరం సినిమా రూపొందించారు. దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. హారర్ అండ్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారికి ఇదొక మంచి సినిమా అని అంటున్నారు. కాగా బండి పతాకంపై శ్రీకాంత్ కంద్రుగుల నిర్మించిన ఈ సినిమాలో హీరోహీరోయిన్లతోపాటు అవినాష్ ఎలందూరు కీ రోల్ ప్లే చేశాడు. అజయ్ అరసాడ సంగీతం, ఎస్. వంశీ శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.