Horror Movie OTT: మరో మూడు భాషల్లో అందుబాటులోకి వచ్చిన తెలుగు హారర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..-telugu horror movie streaming in three other languages on amazon prime video ott movies anjali films ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Horror Movie Ott: మరో మూడు భాషల్లో అందుబాటులోకి వచ్చిన తెలుగు హారర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Horror Movie OTT: మరో మూడు భాషల్లో అందుబాటులోకి వచ్చిన తెలుగు హారర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Published Jul 03, 2024 02:13 PM IST

Geethanjali Malli Vachindi OTT: గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా మరో మూడు భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ముందుగా తెలుగులో వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు డబ్బింగ్ వెర్షన్‍లలో అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రాన్ని ఎక్కడ చూడొచ్చంటే..

Horror Movie OTT: మరో మూడు భాషల్లో అందుబాటులోకి వచ్చిన తెలుగు హారర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Horror Movie OTT: మరో మూడు భాషల్లో అందుబాటులోకి వచ్చిన తెలుగు హారర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

హారర్ కామెడీ సినిమా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఈ ఏడాది ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ చిత్రంలో అంజలి ప్రధాన పాత్ర పోషించారు. అందులోనూ ఇది ఆమెకు 50వ సినిమా కావడంతో మరింత క్రేజ్ ఏర్పడింది. 2014లో వచ్చిన సూపర్ హిట్ అయిన గీతాంజలికి సీక్వెల్‍గా పదేళ్ల అనంతరం ఈ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ రూపొందింది. అయితే, ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ముందుగా ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్‍లో మేకర్స్ రిలీజ్ చేయాలనుకున్నా అలా జరగలేదు. కాగా, గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్రం ఇప్పటికే తెలుగులో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రాగా.. ఇప్పుడు తాజాగా మరో మూడు భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

స్ట్రీమింగ్ ఎక్కడంటే..

గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో మే నెలలోనే అడుగుపెట్టింది. మంచి వ్యూస్ సాధించింది. ఇప్పుడు ఈ సినిమా తమిళం, కన్నడ, మలయాళం భాషల డబ్బింగ్ వెర్షన్‍లోనూ అందుబాటులోకి వచ్చింది. నాలుగు భాషల్లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.

రెండు ఓటీటీల్లో..

గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా మే 8వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోనూ తెలుగులో అందుబాటులోకి వచ్చింది. రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ మూవీ తమిళం, కన్నడ, మలయాళంలోనూ స్ట్రీమింగ్‍కు వచ్చింది.

పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసినా..

గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్రానికి శివ తుర్లపాటి దర్శకత్వం వహించారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ ఈ సినిమాను నిర్మించారు. ముందుగా ఐదు భాషల్లో పాన్ ఇండియా రేంజ్‍లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే, తెలుగులోనే అనుకున్న స్థాయిలో సక్సెస్ రాకపోవటంతో ఆ ప్లాన్‍ను విరమించుకున్నారు. థియేటర్లలో రిలీజైన నెలలోపే ఈ మూవీ రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఇప్పుడు మరో మూడు భాషల్లోనూ అందుబాటులోకి వచ్చేసింది.

గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాలో అంజలి ప్రధాన పాత్ర చేయగా.. శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేశ్, సత్య, సునీల్, రవి శంకర్, రాహుల్ మాధవ్, షకలక శంకర్, అలీ కీలకపాత్రలు పోషించారు. ఈ హారర్ మూవీకి ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ ఇచ్చారు.

గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాకు మూవీ టీమ్ ప్రమోషన్లను జోరుగా చేసింది. శ్మశానంతో టీజర్ లాంచ్‍తో ఫుల్ బజ్ వచ్చింది. ఆ తర్వాత కూడా ప్రమోషన్లను ఎక్కువగా చేసింది. అయితే, ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ రావటంతో కలెక్షన్లు అనుకున్నట్టుగా రాలేదు.

అంజలి లైనప్

నటి అంజలి వరుస సినిమాలో బిజీగా ఉన్నారు. గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అలాగే విశ్వక్‍సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో అంజలి ఓ ప్రధాన పాత్ర పోషించారు. ఆ చిత్రంలో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రంలో అంజలి ఓ కీలక పాత్ర చేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తనది ముఖ్యమైన పాత్ర అని ఇటీవలే అంజలి చెప్పారు. ఈ మూవీని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Whats_app_banner