సూపర్ హిట్ తెలుగు హారర్ కామెడీ మూవీ.. మరో ఐదు రోజుల్లోనే ఓటీటీలోకి.. ఫన్నీ ట్రైలర్ రిలీజ్-telugu horror comedy movie subham ott release date jiohotstar ott to stream the movie from 13th june ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  సూపర్ హిట్ తెలుగు హారర్ కామెడీ మూవీ.. మరో ఐదు రోజుల్లోనే ఓటీటీలోకి.. ఫన్నీ ట్రైలర్ రిలీజ్

సూపర్ హిట్ తెలుగు హారర్ కామెడీ మూవీ.. మరో ఐదు రోజుల్లోనే ఓటీటీలోకి.. ఫన్నీ ట్రైలర్ రిలీజ్

Hari Prasad S HT Telugu

ఓటీటీలోకి తెలుగు సూపర్ హిట్ హారర్ కామెడీ మూవీ వచ్చేస్తోంది. మరో ఐదు రోజుల్లో స్ట్రీమింగ్ కానుండగా.. ఆదివారం (జూన్ 8) జియోహాట్‌స్టార్ ఓటీటీ ఓ ఫన్నీ ట్రైలర్ రిలీజ్ చేసింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సూపర్ హిట్ తెలుగు హారర్ కామెడీ మూవీ.. మరో ఐదు రోజుల్లోనే ఓటీటీలోకి.. ఫన్నీ ట్రైలర్ రిలీజ్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తొలిసారి ప్రొడ్యూసర్ గా మారి నిర్మించిన మూవీ శుభం (Subham). ఈ సినిమా గత నెలలో థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించింది. మొత్తానికి ఇప్పుడు వచ్చే వారమే ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని కొన్ని రోజుల కిందటే వెల్లడించిన జియోహాట్‌స్టార్ ఓటీటీ తాజాగా ఆదివారం (జూన్ 8) ట్రైలర్ రిలీజ్ చేసింది.

శుభం ఓటీటీ రిలీజ్ డేట్

సమంత ప్రొడ్యూస్ చేసిన తెలుగు హారర్ కామెడీ మూవీ శుభం. ఏళ్లకు ఏళ్లుగా సాగే టీవీ సీరియల్స్ చూస్తూ దెయ్యాలుగా మారే భార్యల చుట్టూ సాగే ఫన్నీ మూవీ ఇది. ఈ సినిమా వచ్చే శుక్రవారం (జూన్ 13) నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఇదే విషయాన్ని మరోసారి చెబుతూ ఆ ఓటీటీ ఓ ట్రైలర్ రిలీజ్ చేసింది. “మీరు నవ్వుతారు. మీరు భయపడతారు. మళ్లీ మళ్లీ అదే చేస్తారు. మీరు ఇప్పటి వరకూ చూడని హారర్ కామెడీ. జియోహాట్‌స్టార్ ఓటీటీలో జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది” అనే క్యాప్షన్ తో ఈ ట్రైలర్ పోస్ట్ చేసింది.

నిజానికి ఈ సినిమా మొదట జీ5 ఓటీటీలో వస్తుందని భావించారు. అయితే ఆ ఓటీటీ డీల్ రద్దు చేసుకోవడంతో జియోహాట్‌స్టార్ దక్కించుకుంది.

శుభం మూవీ గురించి..

శుభం మూవీని సమంత ప్రొడ్యూస్ చేసింది. చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం భారీ సక్సెస్ సాధించింది. అంతేకాదు ఈ సినిమా డిజిటల్ హక్కులను కూడా జియోహాట్‌స్టార్ ఏకంగా రూ.3 కోట్లకు సొంతం చేసుకుంది. ఓ లోబడ్జెట్ సినిమాకు ఇది చాలా ఎక్కువే. హార‌ర్ కామెడీ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీలో హ‌ర్షిత్ రెడ్డి, శ్రీనివాస్ గ‌విరెడ్డి, చ‌ర‌ణ్ పెరి, శ్రియా కొంతం, షాలిని కొండెపూడి కీల‌క పాత్ర‌లు పోషించారు. ప్ర‌వీణ్ కాండ్రేగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఆడ‌వాళ్ల‌లో ఉండే సీరియ‌ల్ పిచ్చి ప్ర‌ధానంగా సాగే హార‌ర్ కామెడీ మూవీ ఇది. సింపుల్ పాయింట్‌తో చివ‌రి వ‌ర‌కు ఎంట‌ర్‌టైన్ చేశాడు డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ కాండ్రేగుల‌. సీరియ‌ల్ అంటేనే ఏళ్ల‌కు ఏళ్లు సాగ‌డం కామ‌న్‌. ఓ టీవీ సీరియ‌ల్‌ను రెగ్యుల‌ర్‌గా ఫాలో అవుతూ .. అది పూర్తికాకుండానే చ‌నిపోయిన వాళ్లు ఆత్మ‌లై తిరిగి వ‌చ్చి సీరియ‌ల్‌ను చూస్తే ఏంట‌న్న‌దే శుభం సినిమా క‌థ‌. ఈ గ‌మ్మ‌త్తైన క‌థ‌ను మూడు యువ జంట‌ల జీవితాల‌తో అంతే ఫ‌న్నీగా తెరపై చూపించారు ద‌ర్శ‌కుడు. టీవీ సీరియ‌ల్స్‌లో ఎక్కువ‌గా క‌నిపించే స్త్రీల అణిచివేత‌, పురుషాధిక్య‌త లాంటి సున్నిత‌మైన అంశాల‌ను వివాదాల‌కు తావు లేకుండా వినోదాత్మ‌కంగా డీల్ చేసిన విధానం బాగుంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.