OTT Thriller: ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన కోలీవుడ్ సీరియల్ కిల్లర్ మూవీ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!
OTT Thriller: కోలీవుడ్ సీరియల్ కిల్లర్ మూవీ వైట్ రోజ్ ఓటీటీలోకి వచ్చింది. ఆనంది హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో జాంబీరెడ్డి, బస్ స్టాప్, శ్రీదేవి సోడా సెంటర్‌తో పాటు పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది ఆనంది.
అచ్చ తెలుగు అందం ఆనంది తెలుగు కంటే తమిళ సినిమాలతోనే మంచి గుర్తింపును సొంతం చేసుకున్నది. కయల్ మూవీతో హీరోయిన్‌గా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఆనంది. త్రిష ఇల్లానా నయనతార, విశారణై తో పాటు పలు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్‌తో విజయాల్ని అందుకున్నది. ఆమె హీరోయిన్‌గా నటించిన తమిళ్ లేడీ ఓరియెంటెడ్ మూవీ వైట్ రోజ్ ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్...
సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన వైట్ రోజ్ మూవీ కే రాజశేఖర్ దర్శకత్వం వహించాడు. ఆనందితో పాటు ఆర్‌కే సురేష్ కీలక పాత్రలు పోషించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో వైట్ రోజ్ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. వైట్ రోజ్ కన్నడ, హిందీ వెర్షన్స్ యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్నాయి.
సీరియల్ కిల్లర్ కథ...
వైట్ రోజ్ మూవీ థియేటర్లలో మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. ఆనంది యాక్టింగ్ బాగుందనే కామెంట్స్ వచ్చినా కథ, కథనాలపై నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి. సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్‌తో దర్శకుడు రాజశేఖర్ ఈ మూవీని తెరకెక్కించాడు. కిల్లర్ బారి నుంచి తన కూతురిని ఓ తల్లి ఎలా కాపాడుకుంది అనే ట్విస్ట్‌కు క్లైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ జోడించి ఈ మూవీ తెరకెక్కింది. యథార్థ ఘటనల నుంచి స్ఫూర్తి పొందుతూ ఈ కథను రాసుకున్నట్లు ప్రమోషన్స్‌లో డైరెక్టర్ చెప్పాడు.
వైట్‌రోజ్ మూవీ కథ ఇదే...
సిటీలో ఓ సీరియల్ కిల్లర్ (ఆర్‌కే సురేష్) వరుస హత్యలకు పాల్పడుతుంటాడు. ఆ కిల్లర్ పట్టుకోవడానికి ఏసీపీ వెట్రి ప్రయత్నాలు చేస్తుంటాడు. దివ్య (ఆనంది) ఓ సూపర్ మార్కెట్‌లో పనిచేస్తుంటుంది. దివ్య కూతురిని సైకో కిల్లర్ (ఆర్‌కే సురేష్) కిడ్నాప్ చేస్తాడు. పోలీసుల సాయంతో ఆ కిల్లర్ నుంచి తన కూతురిని కాపాడేందుకు దివ్య ఏం చేసింది? నిజంగానే ఆ కిల్లర్ దివ్య కూతురిని కిడ్నాప్ చేశాడా? దివ్య భర్త చావుకు కారణం ఎవరు? అన్నదే ఈ మూవీ కథ.
తెలుగులో హీరోయిన్‌గా...
ఆనంది సినీ జర్నీ తెలుగు సినిమాలోనే మొదలైంది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈరోజుల్లో మూవీలో టాలీవుడ్‌లోకి అరగేట్రం చేసింది ఆనంది. ప్రిన్స్ హీరోగా నటించిన బస్‌స్టాప్ మూవీలో హీరోయిన్‌గా కనిపించింది. తెలుగులో జాంబీరెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్, మారేడుమిల్లి ప్రజానికంతో పాటు పలు సినిమాల్లో కథానాయికగా కనిపించింది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ...
ఇటీవలే గరివిడి లక్ష్మి పేరుతో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీకి ఆనంది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ మూవీ ఇటీవలే లాంఛ్ అయ్యింది. ఈ సినిమాలో సీనియర్ నరేష్, రాగ్ మయూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.