Save The Tigers 2: తెలుగు కామెడీ సిరీస్ సేవ్ ది టైగర్స్ సీజన్ 2 రిలీజ్ డేట్ ఇదేనా? - సీజన్ వన్ ఫ్రీ స్ట్రీమింగ్
Save The Tigers: తెలుగు వెబ్‌సిరీస్ సేవ్ ది టైగర్స్ సీజన్ 2 మార్చి 10 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. మార్చి 10 వరకు సీజన్ వన్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఫ్రీగా చూడొచ్చని మేకర్స్ వెల్లడించారు.
Save The Tigers: తెలుగు కామెడీ వెబ్‌సిరీస్ సేవ్ ది టైగర్స్ సీజన్ 2 ఓటీటీ రిలీజ్ డేట్‌పై మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను రివీల్ చేశారు. త్వరలోనే ఈ వెబ్‌సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించారు. సీజన్ 2తో రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇవ్వడంతో పాటు ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను మేకర్స్ వెల్లడించారు.
మార్చి 10 వరకు సీజన్ వన్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఫ్రీ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్కైబర్లు అందరూ ఉచితంగా ఈ సిరీస్‌ను చూడొచ్చని తెలిపారు. సేవ్ ది టైగర్స్ సీజన్ 2 మార్చి 10 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మహి వి రాఘవ్ క్రియేటర్‌గా…
సేవ్ ది టైగర్స్ వెబ్‌సిరీస్‌లో ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ కీలక పాత్రలు పోషించారు. వారికి జోడీగా జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని కనిపించారు. ముగ్గరు భార్యాబాధితుల కథతో ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీని తేజా కాకుమాను దర్శకత్వం వహించాడు.
యాత్ర మూవీ ఫేమ్ డైరెక్టర్ మహి వి రాఘవ్ క్రియేటర్‌గా వ్యవహరించాడు. మహి వి. రాఘవ్‌తో పాటు ప్రదీప్ అద్వైతం ఈ మూవీకి కథను అందించారు. ఫస్ట్ సీజన్‌కు ఓటీటీలో సూపర్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్నది.
ఫస్ట్ సీజన్ కథ ఇదే...
గంటా రావి బోరబండ బస్తీలో పాల వ్యాపారం చేస్తుంటాడు. బస్తీలో ఉండటం అతడి భార్య హైమవతికి నచ్చదు. బస్తీ వాతావరణం వల్ల పిల్లలు చెడిపోతున్నారని భర్తతో ఎప్పుడూ గొడవపడుతుంటారు. రైటర్ కావాలనే ఆలోచనతో సాఫ్ట్‌వేర్ జాబ్‌కు రిజైన్ చేసి ఇంట్లో ఖాళీగా ఉంటాడు రాహుల్ (అభినవ్ గోమటం).
రైటర్‌గా ప్రయత్నాలు ఏం చేయకుండా పని మనిషితో బాతాఖానీ కొడుకు జీవితాన్ని వెళ్లదీస్తుంటాడు. దాంతో ఇంటి బాధ్యత మొత్తం భార్య మాధురిపై (పావని గంగిరెడ్డి) పడుతుంది. విక్రమ్ (చైతన్య కృష్ణ) ఓ యాడ్ ఏజెన్సీలో పనిచేస్తుంటాడు.
భార్య రేఖ (దేవయాని) ఫెమినిస్ట్. భార్య చేసే డామినేషన్ సహించలేకపోతాడు. భార్యాబాధితులైన గంటారవి, విక్రమ్, రాహుల్ మంచి స్నేహితులుగా మారుతారు. ప్రేమించి పెళ్లిచేసుకున్న మాధురిని రాహుల్ ఎందుకు అనుమానించాడు?
రేఖ వల్ల విక్రమ్ ఉద్యోగం ఉడిపోయే పరిస్థితి ఎందుకొచ్చింది? ఈ ముగ్గురిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు అన్నదే సేవ్ ది టైగర్స్ ఫస్ట్ సీజన్ కథ. గత ఏడాది ఏప్రిల్‌లో సేవ్ ది టైగర్స్ సీజన్ వన్‌రిలీజైంది.
సెకండ్ సీజన్....
ఓ హీరోయిన్ మిస్సింగ్ కేసులో గంటారవి,చైతన్య రాహుల్‌ను అరెస్ట్ చేయడంతో సెకండ్ సీజన్ మొదలుకాబోతున్నట్లు సమాచారం. వారు ముగ్గురు జైలు నుంచి ఎలా బయటపడ్డారు అనే కథతో సెకండ్ సీజన్ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది.
బలగం, మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా...
జబర్ధస్త్ కమెడియన్ వేణు దర్శకత్వంలో రూపొందిన బలగం సినిమాతో హీరోగా పెద్ద హిట్‌ను అందుకున్నాడు ప్రియదర్శి. కోటిన్నర బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ 30 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన మంగళవారంలో కిల్లర్‌గా కనిపంచాడు. మరోవైపు మస్త్ షేడ్స్ ఉన్నాయ్‌రా మూవీతో అభినవ్ గోమటం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. గత వారం థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది.