Telugu Film Producers Council Homage to Krishna: కృష్ణకు నివాళిగా రేపు సినిమా పరిశ్రమ బంద్-telugu film producers council homage to krishna as the film industry to be closed on wednesday ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Film Producers Council Homage To Krishna: కృష్ణకు నివాళిగా రేపు సినిమా పరిశ్రమ బంద్

Telugu Film Producers Council Homage to Krishna: కృష్ణకు నివాళిగా రేపు సినిమా పరిశ్రమ బంద్

HT Telugu Desk HT Telugu
Nov 15, 2022 05:37 PM IST

Telugu Film Producers Council Homage to Krishna: సూపర్‌స్టార్‌ కృష్ణ మృతికి నివాళిగా బుధవారం (నవంబర్‌ 16) సినిమా పరిశ్రమ బంద్ చేయనున్నట్లు తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది.

కృష్ణ పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు
కృష్ణ పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు

Telugu Film Producers Council Homage to Krishna: టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని కృష్ణ మృతికి తెలుగు సినీ పరిశ్రమ ఘనంగా నివాళులర్పిస్తోంది. ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు కృష్ణ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. చిరంజీవి, జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రాజేంద్ర ప్రసాద్, వెంకటేశ్‌లాంటి సినీ ప్రముఖులు కృష్ణ ఇంటికి వెళ్లారు.

ఇక ఇప్పుడు తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కూడా కృష్ణ మృతిపై ఒక ప్రకటన విడుదల చేసింది. అతని మృతికి నివాళిగా బుధవారం (నవంబర్ 16) తెలుగు సినీ పరిశ్రమను మూసివేస్తున్నట్లు తెలిపింది. ఆ ప్రకటనలో కృష్ణ.. సినీ ఇండస్ట్రీకి చేసిన సేవలను గుర్తు చేసుకుంది. తెలుగు సినిమాకు తొలిసారి ఈస్ట్‌మన్‌ కలర్‌, 70 ఎంఎం, డీటీఎస్‌ సౌండ్‌, సినిమా స్కోప్‌ను పరిచయం చేసిన ఘనత కృష్ణదే అని తెలిపింది.

350కిపైగా సినిమాల్లో నటించిన గొప్ప నటుడని చెప్పింది. అందులో అల్లూరి సీతారామరాజులాంటి గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడి సినిమా కూడా ఒకటని కొనియాడింది. హీరో, ప్రొడ్యూసర్‌, డైరెక్టర్‌, స్టూడియో ఓనర్‌గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి కృష్ణ ఎనలేని సేవలందించాడని ఫిల్మ్‌ ఛాంబర్ ఆఫ్‌ కామర్స్‌ చెప్పింది.

ఇక కృష్ణ కెరీర్‌లో సాధించిన అవార్డుల గురించి కూడా ఇందులో ప్రస్తావించింది. కృష్ణ తన కెరీర్‌లో పద్మభూషణ్‌తోపాటు ఎన్టీఆర్‌ నేషనల్‌ అవార్డు, బెస్ట్‌ యాక్టర్‌గా నంది అవార్డు, ఫిల్మ్‌ఫేర్‌ సౌత్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు, ఆంధ్రా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌లాంటి అందుకున్నట్లు తెలిపింది.

అంతటి లెజెండరీ నటుడి మృతికి సంతాపంగా బుధవారం సినీ పరిశ్రమలో అన్ని షూటింగ్‌లు, ఇతర కార్యకలాపాలను నిలిపేస్తున్నట్లు తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాలకూ ఇదే వర్తిస్తుందని చెప్పింది. సూపర్‌ స్టార్‌ కృష్ణ మంగళవారం (నవంబర్ 15) తెల్లవారుఝామున 4 గంటలకు కన్నుమూసిన విషయం తెలిసిందే. గుండెపోటు రావడంతో ఆదివారం రాత్రి అతన్ని హాస్పిటల్‌లో చేర్చారు. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుఝామున తుదిశ్వాస విడిచారు.

Whats_app_banner