OTT Thriller Telugu: నేరుగా ఓటీటీలోకి వస్తున్న ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రం.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
OTT Thriller Telugu: వైఫ్ ఆఫ్ చిత్రం నేరుగా ఓటీటీలోకి రానుంది. ఈ ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రం స్ట్రీమింగ్ డేట్ తాజాగా ఖరారైంది. ఈ చిత్రంలో దివ్య శ్రీ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా స్ట్రీమింగ్ వివరాలు ఇవే..
దాదాపు రెండేళ్ల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఓ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. నేరుగా ఓటీటీలోకే అడుగుపెట్టనుంది. అదే ‘వైఫ్ ఆఫ్’ సినిమా. ఈ మూవీలో దివ్య శ్రీ, అభినవ్ మణికంఠ లీడ్ రోల్స్ చేశారు. షూటింగ్ పూర్తయినట్టు మేకింగ్ వీడియోనూ మూవీ టీమ్ రెండేళ్ల క్రితమే తీసుకొచ్చింది. అయితే, ఇప్పటి వరకు ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాలేదు. ఇప్పుడు ఎట్టకేలకు వైఫ్ ఆఫ్ చిత్రం నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. తాజాగా డేట్ ఖరారైంది.

స్ట్రీమింగ్ వివరాలివే..
వైఫ్ ఆఫ్ సినిమా ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో జనవరి 23వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ట్రైలర్‌తో పాటు స్ట్రీమింగ్ డేట్‍ను నేడు రివీల్ చేసింది ఆ ప్లాట్‍ఫామ్. “జనవరి 23వ తేదీన ఈ ఎమోషనల్, థ్రిల్లింగ్ రైడ్‍లోకి వచ్చేందుకు రెడీగా ఉండండి. మీ మనసుకు దగ్గరగా అనిపించే జర్నీ ఇది” అని ఈటీవీ విన్ ట్వీట్ చేసింది.
ట్రైలర్ ఇలా..
వైఫ్ ఆఫ్ చిత్రం గృహ హింస అంశం చుట్టూ తిరిగే థ్రిల్లింగ్ స్టోరీగా తెరకెక్కింది. బావ రామ్‍ను ఇష్టపడి పెళ్లి చేసుకున్న అవని (దివ్యశ్రీ) కష్టాల్లో పడుతుంది. రామ్ ఆమెను వేధిస్తుంటాడని ట్రైలర్లో ఉంది. తీవ్రమైన హింసను అవని ఎదుర్కొంటుంది. ఇలా వేదన భరిస్తూ ఓ దశలో ఎదురుతిరిగేందుకు నిర్ణయించుకుంటుంది. “ఇప్పటి వరకు బరితెగించిన భర్తను చూశాను. ఇక నుంచి భయపెట్టే భార్యను చూస్తాడు” అని దివ్యశ్రీ చెప్పే డైలాగ్ డ్రైలర్లో ఉంది. ఆ తర్వాత ఆమె కఠినంగా మారుతుంది. కథ మరిన్ని ట్విస్టులు తిరుగుతుందనేలా ఈ ట్రైలర్ ఉంది. మరో ప్రేమ కథ కూడా ఉండేలా కనిపిస్తోంది. మొత్తంగా వైఫ్ ఆఫ్ మూవీ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రాన్ని జనవరి 23 నుంచి ఈటీవీ విన్‍లో చూడొచ్చు.
వైఫ్ ఆఫ్ చిత్రానికి భాను యేరుబండి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో దివ్యశ్రీ, అభినవ్ మణికంఠతో పాటు నిఖిల్ గాజుల, సాయి శ్వేత, వీర్ మనోహర్ కావలి, కిరణ్ పుతకల కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీని రాహుల్ తమద, సందీప్ రెడ్డి బొర్రా ప్రొడ్యూజ్ చేశారు. ఈ చిత్రానికి ప్రణీత్ సంగీతం అందించగా.. అక్సర్ అలీ సినిమాటోగ్రఫీ చేశారు.
రీసెంట్‍గా మిన్‍మినీ
ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ వారం మిన్‍మినీ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ న్యూఏజ్ డ్రామా మూవీలో గౌరవ్ కాలై, ఎస్తర్ అనీల్, ప్రవీణ్ కిశోర్ ప్రధాన పాత్రలు పోషించారు. మిన్‍మినీ చిత్రం తమిళంలో 2024 ఆగస్టు 9న రిలీజైంది. ఈ మూవీని తెలుగు డబ్బింగ్‍లో ఈటీవీ విన్ తీసుకొచ్చింది. ఈ చిత్రానికి హలిత షమీమ్ దర్శకత్వం వహించారు. మనోజ్ పరమహంస, మురళి కృష్ణన్ ప్రొడ్యూజ్ చేసిన ఈ మూవీకి ఖతిజా రహమాన్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రంలో ఐశ్వర్య రవి, అభిషేక్ కృష్ణన్, మాలినీ జీవరత్నం, షారా, రైచల్ రెబకా కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది.
సంబంధిత కథనం