Crime Thriller OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. కానీ!
Rape D Movie: ఓ తక్కువ బడ్జెట్ చిత్రం నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ‘రేప్ డీ’ అనే క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది. అయితే, ముందుగా రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా స్ట్రీమింగ్ వివరాలు ఇవే.
ముందుగా థియేటర్లలో రిలీజ్ చేయాలనుకున్నా.. కొన్ని తక్కువ బడ్జెట్ చిత్రాలు ఓటీటీల్లోకే నేరుగా వచ్చేస్తుంటాయి. వివిధ కారణాలతో ఓటీటీ బాటపడతాయి. తాజాగా ‘రేప్ డీ’ అనే క్రైమ్ థ్రిల్లర్ చిత్రం కూడా నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ‘కలియుగ పట్టణంలో’ మూవీ ఫేమ్ విశ్వకార్తికేయ ఈ చిత్రంలో హీరోగా నటించారు. తక్కువ బడ్జెట్‍తో ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రానికి రవివర్మ దర్శకత్వం వహించారు. ఈ రేప్ డీ మూవీ నేరుగా ఓటీటీలోకే అడుగుపెట్టింది.
స్ట్రీమింగ్ వివరాలివే
రేప్ డీ సినిమా బీ సినీ ఈటీ (Bcineet) అనే నయా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. థియేటర్లలో విడుదల కాకుండానే ఈ ఓటీటీలోకి అడుగుపెట్టింది. కానీ ప్రస్తుతం ఆ ఓటీటీలో రెంటల్ విధానంలో ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. అయితే, త్వరలోనే వేరే ఓటీటీలోనూ అందుబాటులోకి తెస్తామని మూవీ టీమ్ వెల్లడించింది.
బీసినీఈటీ ఓటీటీలో రేప్ డీ మూవీని చూసేందుకు ప్రోమోకోడ్‍ను కూడా మూవీ టీమ్ ప్రకటించింది. RAPED100 కోడ్‍తో యాన్యువల్ సబ్‍స్క్రిప్షన్ ఆఫర్ దక్కుతుందని మేకర్స్ వెల్లడించారు. ఆగస్టు 24న వేరే ఓటీటీలోనూ ఈ చిత్రాన్ని అందుబాటులోకి తెచ్చే ప్లాన్‍లో ఉన్నట్టు వెల్లడించారు.
రేప్ డీ మూవీలో విశ్వ కార్తికేయ సరసన కారణ్య చౌదరి హీరోయిన్‍గా నటించారు. వంశీ ఆలూర్, నేహాల్ గంగావత్, రవి వర్మ అద్దూరి, అమీక్ష పవార్, వశిష్ట చౌదరి కీలకపాత్రలు పోషించారు. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కించారు దర్శకుడు రవివర్మ.
రేప్ డీ మూవీని టాలెండ్ కెఫే ప్రొడక్షన్స్ పతాకంపై దేవీ మేరేటీ నిర్మించారు. లో బడ్జెట్ మూవీగా రూపొందించారు. వికాస్ కురిమెల్ల సంగీతం అందించిన ఈ మూవీకి బాస్కర్ ద్రోణాల సినిమాటోగ్రఫీ చేశారు.
వరుసగా జరుగుతున్న రేప్, మర్డర్లపై దర్యాప్తు చుట్టూ రేప్ డీ స్టోరీ సాగుతుంది. అయితే, ఈ కేసుల్లో డ్రగ్స్ పాత్ర ఉందని పోలీసులు గుర్తిస్తారు. ఈ దురాగతాలకు పాల్పడుతుందెవరు? మిస్టరీ వీడిందా అనే అంశాల చుట్టూ ఈ మూవీ సాగుతుంది.
బీసినీఈటీ ఓటీటీ గురించి..
బీసినీఈటీ ఓటీటీ ప్లాట్‍ఫామ్ మూడేళ్ల క్రితం ప్రారంభమైంది. ఈ ఓటీటీలో ఎక్కువగా తక్కువ బడ్జెట్ చిత్రాలే వస్తుంటాయి. ఇందులో కొన్ని రెంటల్ విధానంగా అందుబాటులో ఉన్నాయి. ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుంది. తెలుగుతో పాటు తమిళ సినిమాలు కూడా ఈ ఓటీటీలో ఉన్నాయి. కొన్ని పాత హిట్ చిత్రాలను కూడా ఈ ఓటీటీలో అందుబాటులో ఉంచారు నిర్వాహకులు.
ఆహాలో బర్త్‌డే బాయ్ స్ట్రీమింగ్
బర్త్‌డే బాయ్ సినిమా ఆహా ఓటీటీలో తాజాగా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఆగస్టు 9న ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చింది. ముందుగా ప్రచారం లేకుండా సడెన్‍గా ఆహాలో ఎంట్రీ ఇచ్చింది. జూలై 19వ తేదీన థియేటర్లలో రిలీజైన బర్త్‌డే బాయ్ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ కామెడీ థ్రిల్లర్ మూవీలో రవికృష్ణ, మణి వాక, రాజా అశోక్, విక్రాంత్ వేద్, సాయి అరుణ్, రాహుల్ సీహెచ్ లీడ్ రోల్స్ చేశారు. విస్కీ దర్శకత్వం వహించిన ఈ మూవీని భరత్ నిర్మించారు. ఈ చిత్రానికి ఇప్పుడు ఆహా ఓటీటీలో చూడొచ్చు.