Crime Comedy OTT: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ కామెడీ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Crime Comedy OTT: లేటెస్ట్ తెలుగు క్రైమ్ కామెడీ మూవీ ది బర్త్ డే బాయ్ థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది.
ఇరవై రోజుల్లోనే...
క్రైమ్ కామెడీ కథాంశంతో రూపొందిన ది బర్త్‌డే బాయ్ మూవీ లో రవికృష్ణ, రాజీవ్ కనకాల, సమీర్ మళ్లా కీలక పాత్రలు పోషించారు. ఈ తెలుగు మూవీకి విస్కీ దర్శకత్వం వహించాడు. జూలై 19న థియేటర్లలో రిలీజైన ది బర్త్‌డే బాయ్ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. థియేటర్ రిజల్ట్ కారణంగానే మూడు వారాలు కూడా కాకముందే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చింది.
బర్త్‌డే బంప్స్ తెచ్చిన కష్టాలు...
బాలు, అర్జున్, సాయి, సత్తి, వెంకట్ రూమ్‌మేట్స్. అమెరికాలో చదువుకుంటుంటారు. బాలు బర్త్‌డేను మిగిలిన స్నేహితులుగా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తారు. తాగిన మత్తులో బర్త్ డే బంప్స్ పేరుతో బాలును ఇష్టం వచ్చినట్లు కొడతారు అతడి ఫ్రెండ్స్. ఆ దెబ్బల ధాటికి బాలు చనిపోతాడు. బాలు డెడ్‌బాడీని మాయం చేసి ఆ కేసు నుంచి బయటపడాలని మిగిలిన స్నేహితులు ప్లాన్ చేస్తారు.
అదే టైమ్‌లో అనుకోకుండా బాలును వెతుక్కుంటూ అతడి తల్లిదండ్రులు (రాజీవ్ కనకాల, ప్రమోదిని) అమెరికాకు వస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? కొడుకు చనిపోయిన విషయం బాలు తల్లిదండ్రులకు తెలిసిందా? బాలు డెడ్‌బాడీని మాయం చేయడంలో అతడి స్నేహితులకు లాయర్ అర్జున్ (రవికృష్ణ) ఎందుకు సాయం చేశాడు? ఆ నలుగురు యువకులతో అర్జున్‌కు ఉన్న సంబంధం ఏమిటన్నదే ఈ మూవీ కథ.
ప్రమోషన్స్ డిఫరెంట్...
ది బర్త్ డే బాయ్ ప్రమోషన్స్‌ను మేకర్స్ డిఫరెంట్‌గా చేశారు. దర్శకుడు తన ముఖం చూపించకుండా, ఒరిజినల్ పేరు చెప్పకుండా మాస్క్‌తో ప్రమోషన్స్‌కు అటెండ్ అయ్యి ఆడియెన్స్‌లో సినిమా పట్ల ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాడు. అయితే ప్రమోషన్స్‌లో ఉన్న కొత్తదనం సినిమాలో కనిపించలేదు.
బిగ్‌బాస్ రవికృష్ణ, రాజీవ్ కనకాల మినహా ఇందులో ప్రధాన పాత్రలు చేసిన వారందరూ కొత్త ఆర్టిస్టులే కావడం గమనార్హం. వాస్తవ ఘటనల స్ఫూర్తితో దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించాడు.
నెగెటివ్ షేడ్స్..
గత కొన్నాళ్లుగా సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోన్నాడు రవికృష్ణ. సాయిధరమ్‌తేజ్ విరూపాక్షలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో కనిపించాడు. లవ్ మీ, ఆ ఒక్కటి అడక్కుతో పాటు మరికొన్ని సినిమాల్లో పాజిటివ్ క్యారెక్టర్స్ చేశాడు. ది బర్త్ డే బాయ్‌లో ఫుల్ లెంగ్త్ రోల్ చేశాడు.