OTT Crime Comedy: ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ కామెడీ మూవీ - ఎందులో చూడాలంటే?
OTT Crime Comedy: తెలుగు క్రైమ్ కామెడీ మూవీ పేక మేడలు ఓటీటీలోకి వచ్చింది. గురువారం నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో వినోద్ కిషన్, అనూష కృష్ణ హీరోహీరోయిన్లుగా నటించారు. బాహుబలిలో కీలక పాత్ర చేసిన రాకేష్ వర్రే ఈ మూవీని ప్రొడ్యూస్ చేశాడు.
OTT Crime Comedy: తెలుగు మూవీ పేకమేడలు థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా గడవక ముందే ఓటీటీలోకి వచ్చింది. క్రైమ్ కామెడీ డ్రామాగా రూపొందిన పేక మేడలు మూవీలో వినోద్ కిషన్, అనూష కృష్ణ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహించాడు. బాహుబలి సినిమాలో కీలక పాత్ర పోషించిన రాకేష్ వర్రే పేక మేడలు మూవీని నిర్మించాడు.
మిక్స్‌డ్ టాక్...
జూలై 19న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. కాన్సెప్ట్, హీరోహీరోయిన్ల నటన బాగుందంటూ కామెంట్స్ వినిపించాయి. లో బడ్జెట్ మూవీ కావడం, పోటీగా అదే రోజు పెద్ద సంఖ్యలో సినిమాలు రిలీజ్ కావడంతో థియేటర్లలో సరైన ఆదరణను పేక మేడలు మూవీ దక్కించుకోలేకపోయింది. పేక మేడలు మూవీ గురువారం ఓటీటీలోకి వచ్చింది. ఈటీవీ విన్ ఓటీటీలో ఈ క్రైమ్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
పేక మేడలు కాన్సెప్ట్ ఇదే...
లక్ష్మణ్ (వినోద్ కిషన్) ఇంజినీరింగ్ పూర్తిచేసి రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. డీల్ సెట్ అయితే లక్షల్లో డబ్బు వస్తుందని మాటలతోనే కోటలు కడుతుంటాడు. లక్ష్మణ్ సెట్ చేసే ఏ డీల్ సక్సెస్ కాదు. కుటుంబ బాధ్యతల్ని పట్టించుకోకుండా భార్య వరలక్ష్మి సంపాదనపై ఆధారపడుతూ జల్సాలు చేస్తుంటాడు. భార్య పేరిట అప్పులు చేస్తుంటాడు.
లక్ష్మణ్ ఎప్పటికైనా బాగుపడతాడనే భర్త చేసే అప్పులను కష్టపడి తీర్చుతుంటుంది. అమెరికా నుంచి భర్త, పిల్లల్ని వదిలేసి వచ్చిన శ్వేత (రితికా శ్రీనివాస్) అనుకోకుండా లక్ష్మణ్ లైఫ్‌లోకి వస్తోంది. డబ్బున్న యువకుడిగా శ్వేతను నమ్మించి ఆమెకు దగ్గరవుతాడు లక్ష్మణ్. శ్వేత మాయలో పడి భార్య, పిల్లలను దూరం పెడతాడు. ఆ తర్వాత ఏమైంది? భర్త ప్రవర్తనతో విసిగిపోయిన వరలక్ష్మి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? భార్యకు విడాకులు ఇవ్వాలని లక్ష్మణ్ ఎందుకు అనుకున్నాడు? లక్ష్మణ్ అబద్దాల గురించి శ్వేతకు తెలిసేలా చేసింది ఎవరు? అన్నదే పేక మేడలు మూవీ కథ.
నా పేరు శివ...
హీరోగా వినద్ కిషన్‌కు తెలుగులో ఇదే ఫస్ట్ మూవీ. నా పేరు శివ, అంధగారం లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు వినోద్ కిషన్, విశ్వక్‌సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో కనిపించాడు. పేకమేడలు మూవీని నిర్మాతగా వ్యవహరించిన రాకేష్ వర్రే తెలుగులో ఎవ్వరికీ చెప్పొద్దు మూవీలో హీరోగా నటించాడు.