Comedy Movie OTT: థియేటర్లలో రిలీజైన రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు కామెడీ మూవీ
Comedy Movie OTT: తెలుగు కామెడీ మూవీ విందు భోజనం థియేటర్లలో రిలీజైన రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం ఆహా ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది.
Comedy Movie OTT: తెలుగు కామెడీ మూవీ విందుభోజనం థియేటర్లలో రిలీజైన రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం (జూన్ 28న) ఆహా ఓటీటీలో (Aha OTT) ఈ మూవీ రిలీజైంది. విందు భోజనం సినిమాలో అఖిల్ రాజ్, ఐశ్వర్య హోల్లక్కల్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి కార్తీక్ దర్శకత్వం వహించాడు.

విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు టైప్‌లో ఓ చెఫ్ ప్రేమకథతో తెరకెక్కిన ఈ మూవీ టీజర్స్, ట్రైలర్స్‌తో ఆసక్తిని రేకెత్తించింది. 2022లో రిలీజైన ఈ మూవీ కమర్షియల్‌గా మాత్రం సరైన విజయాన్ని అందుకోలేకపోయింది. థియేటర్లలో రిలీజైన రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది.
విందుభోజనం కథ ఇదే...
ఆదిత్య (అఖిల్ రాజ్) ఓ చెఫ్. తండ్రి కట్టించి ఇచ్చిన హోటల్‌లోనే చెఫ్‌గా పనిచేస్తుంటాడు. ఆ హోటల్‌ను అతడి సోదరుడు వివేక్ అమ్మాలని చూస్తాడు. ఆదిత్య మాత్రం అందుకు ఒప్పుకోడు. తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి హోటల్‌ను తానే నడిపించాలని అనుకుంటాడు.
అన్నదమ్ముల పోరాటంలో గెలుపు ఎవరది? ఆదిత్య ప్రేమించిన సింగర్ (ఐశ్వర్య హోలక్కల్) ఎవరు? తొలుత ఆదిత్య ప్రేమను ఆ సింగర్ ఎందుకు తిరస్కరించింది? ప్రేమతో పాటు హోటల్‌ను కాపాడుకోవాలనే తన లక్ష్యంలో ఆదిత్య ఎలా విజేతగా నిలిచాడు అన్నదే ఈ మూవీ కథ.
హార్షవర్ధన్‌తో పాటు...
విందుభోజనం సినిమాలో హర్షవర్ధన్, కేశవ్ దీపక్, సిద్ధార్థ్ గొల్లపూడి, ఆశ్రిత వేముగంటి కీలక పాత్రలు పోషించారు. విందుభోజనం కాన్సెప్ట్ బాగున్నా కథనాన్ని ఎక్కువగా డ్రామాతో కథనాన్ని నడిపించడం, ఎమోషన్స్ సరిగా వర్కవుట్ కాకపోవడంతో సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
కార్తీక్‌కు దర్శకుడిగా విందుభోజనం ఫస్ట్ మూవీ. గతంలో పలు షార్ట్ ఫిలిమ్స్ తెరకెక్కించాడు. వాటిలో ఉదయ్ షార్ట్ ఫిలిమ్ అతడికి మంచి పేరును తెచ్చిపెట్టింది.
తెలుగులో వెబ్‌సిరీస్‌లు...
విందుభోజనం సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఐశ్వర్య హోలక్కల్ తెలుగులో పలు వెబ్‌సిరీస్‌లు చేసింది. కామెడీ కథాంశాలతో ఆమె చేసిన తులసీవనం, హాస్టల్ డేస్ వెబ్‌సిరీస్‌లు తెలుగు ప్రేక్షకులను మెప్పించాయి. ఈ సిరీస్‌లలో తన కామెడీ టైమింగ్‌తో ఐశ్వర్య ఆకట్టుకుంటుంది.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌లో
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌లో ఐశ్వర్య ఓ కీలక పాత్ర చేసింది. వైల్డ్ వరల్డ్‌తో పాటు మరికొన్ని చిన్న సినిమాలు చేసింది. ప్రస్తుతం బ్రహ్మానందం, ఆయన తనయుడు గౌతమ్ కలిసి నటిస్తోన్న బ్రహ్మ ఆనందం మూవీలో ఐశ్వర్య హోలక్కల్ ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది. అలాగే తెలుగులో మరికొన్ని వెబ్‌సిరీస్‌లను అంగీకరించింది.