మ్యాడ్ స్క్వేర్ చిత్రం కలెక్షన్లలో సత్తాచాటుతోంది. ఈ కామెడీ సినిమా అంచనాలను దాటేసి బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. యంగ్ యాక్టర్స్ సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ త్రయం మరోసారి మ్యాజిక్ చేసింది. తొలి పార్ట్ మ్యాడ్ చిత్రానికి సీక్వెల్‍గా గత శుక్రవారం (మార్చి 28) రిలీజైన ఈ మూవీ దుమ్మురేపుతోంది. మ్యాడ్ స్క్వేర్ చిత్రం మూడోరోజుల్లోనే ఓ మైలురాయి దాటేసింది.
మ్యాడ్ స్క్వేర్ సినిమా రూ.50కోట్ల వరల్డ్ వైడ్ కలెక్షన్ల మార్క్ దాటేసింది. ఈ చిత్రం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.55.2 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుందని మూవీ టీమ్ నేడు (మార్చి 31) వెల్లడించింది.
“థియేటర్లు షేక్ అవుతున్నాయి. ప్రేక్షకులు కేరింతలు కొడుతున్నారు. మ్యాడ్ గ్యాంగ్ రూల్ చేస్తోంది. మ్యాడ్ స్క్వేర్ సినిమా మూడు రోజుల్లో రూ.55.2 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. రిపీట్ ఆడియన్స్ ఫీవర్ వైల్డ్ ఫైర్‌లా పెరుగుతోంది” అని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తొలి రోజు నుంచే మ్యాడ్ స్క్వేర్ చిత్రం సత్తాచాటుతోంది. మూడో రోజైన ఆదివారం ఉగాది పండుగ ఉండడం కూడా మరింత కలిసి వచ్చింది. ఈ మూవీ మూడో రోజు సుమారు రూ.18కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. దీంతో తొలి వీకెండ్ ముగిసే సరికే రూ.50కోట్లను దాటింది. రంజాన్ సెలవు కూడా ఉండటంతో సోమవారం కూడా జోష్ బాగానే ఉండొచ్చు.
మ్యాడ్ స్క్వేర్ సినిమా రూ.100కోట్ల మార్క్ సాధించగలదా అనే ఆసక్తి ఇప్పుడు ఎక్కువగా ఉంది. మూడు రోజుల్లోనే రూ.50కోట్లు దాటడంతో ఆ మైలురాయిపై ఆశలు పెరిగాయి. అయితే, వర్కింగ్ డే అయిన మంగళవారం ఈ మూవీకి అసలైన పరీక్ష ఎదురుకానుంది. ఆ రోజు బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్‌ను బట్టి కలెక్షన్ల జోరు ఎలా ఉంటుందనే అంచనాకు రావొచ్చు. అయితే, ఈ చిత్రానికి రూ.100కోట్ల మార్క్ కాస్త కష్టమనే అభిప్రాయాలు ఉన్నాయి. రూ.75కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ చేరే అవకాశాలైతే ఉన్నాయి. మరి అంచనాలకు మించి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మ్యూజిక్ చేస్తుందేమో చూడాలి.
గతేడాది సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన కామెడీ సీక్వెల్ మూవీ ‘టిల్లు స్క్వేర్’ అదరగొట్టి రూ.100కోట్లపైగా వసూళ్లను సాధించింది. ఆ మూవీని నిర్మించిన ప్రొడక్షన్ హౌసే మ్యాడ్ స్క్వేర్ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేసింది.
మ్యాడ్ స్క్వేర్ చిత్రంలో నార్నె నితిన్, సంగీత్, రామ్ నితిన్, విష్ణు ఓయ్ కామెడీ అదిరిపోయింది. ఈ మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా.. కామెడీ విషయంలో మాత్రం ప్రేక్షకుల నుంచి ఫుల్ మార్క్స్ సాధించింది. ఈ చిత్రానికి కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. ప్రియాంక జవల్కర్ కూడా కీలకపాత్రలో కనిపించారు. మురళీధర్ గౌడ్, రఘుబాబు, అనుష్ సత్యం రాజేశ్ కీరోల్స్ చేశారు. ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల ఈ మూవీని నిర్మించాయి. ఈ మూవీకి భీమ్ సెసిరోలియో, తమన్ మ్యూజిక్ డైరెక్టర్లుగా పనిచేశారు.
సంబంధిత కథనం
టాపిక్