తెలుగు కామెడీ మూవీ సినిమా పిచ్చోడు ఓటీటీలోకి వచ్చింది. మంగళవారం అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది. ఫ్రీగా కాకుండా 99 రూపాయల రెంట్‌తో అమెజాన్ ఈ తెలుగు మూవీని ఓటీటీ ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చింది.
సినిమా పిచ్చోడు లోహీరోగా నటిస్తూ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు కుమారస్వామి. సావిత్ర కృష్ణ హీరోయిన్‌గా నటించింది. హీరోహీరోయిన్లతో పాటు చాలా మంది కొత్త ఆర్టిస్టులే ఈ మూవీలో నటించారు. గత ఏడాది నవంబర్‌లో సినిమా పిచ్చోడు మూవీ థియేటర్లలో రిలీజైంది. ఐఎమ్‌డీబీలో పదికిగాను ఈ మూవీ 9.5 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.
పల్లెటూరు, సిటీ అనే తేడాలతో పని లేకుండా నటనపై ఆసక్తి ఉన్నవారు ఎవరైనా హీరోలు కావచ్చుననే పాయింట్‌కు లవ్, యాక్షన్ అంశాలను జోడించి కుమారస్వామి ఈ సినిమాను తెరకెక్కించారు. అంతర్లీనంగా ఇండస్ట్రీ కష్టాలను ఈ మూవీలో చూపించాడు.
కుమారస్వామి అలియాస్ జోష్ పల్లెటూళ్లో పాల వ్యాపారం చేస్తుంటాడు. సినిమాలంటే పిచ్చి. ఎప్పటికైనా హీరో కావాలని కలలు కంటాడు. అతడి సినిమా పిచ్చిని అందరూ ఎగతాళి చేస్తుంటారు. ఓ డెమో ఫిల్మ్ షూట్ చేయడానికి భాను అనే లేడీ డైరెక్టర్ పల్లెటూరికి వస్తుంది. అనుకోకుండా ఆ డెమ్ ఫిల్మ్‌లో హీరోగా జోష్‌కు ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత ఏమైంది? తమ ఊళ్లో షూటింగ్ చేయడానికి వీలులేదని సర్పంచ్ ఎందుకు కండీషన్ పెట్టాడు? అతడికి జోష్‌కు ఉన్న గొడవలకు కారణమేంటి? డైరెక్టర్ భానుతో ప్రేమలో పడ్డ జోష్ ఆమెకు ప్రపోజ్ చేశాడా? చివరకు జోష్ హీరో అయ్యాడా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
లిమిటెడ్ బడ్జెట్‌లో డైరెక్టర్ కుమారస్వామి సినిమా పిచ్చోడు మూవీని కుమారస్వామి తెరకెక్కించాడు.ఈ మూవీలో పవన్ కళ్యాణ్, చిరంజీవితో పాటు పలువురు టాలీవుడ్ హీరోల రిఫరెన్స్‌లు, వారి మ్యానరిజమ్స్, ఫేమస్ డైలాగ్స్‌ను చూపించారు.
ఈ వారం సుమంత్ అనగనగా మూవీ కూడా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. డైరెక్ట్‌గా ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. అలాగే తమిళ మూవీ నేసిప్పాయా, మలయాళం మూవీ మారనమాస్ కూడా ఈ వారం ఓటీటీలో సందడి చేయబోతున్నాయి.
సంబంధిత కథనం