Telugu Classic movies on ott: ఓటీటీల్లో ఉన్న ఈ తెలుగు క్లాసిక్స్ చూశారా? ఏ మూవీ ఏ ఓటీటీలో ఉందంటే?-telugu classic movies on ott mayabazar to khaidi in prime video youtube mx player ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Classic Movies On Ott: ఓటీటీల్లో ఉన్న ఈ తెలుగు క్లాసిక్స్ చూశారా? ఏ మూవీ ఏ ఓటీటీలో ఉందంటే?

Telugu Classic movies on ott: ఓటీటీల్లో ఉన్న ఈ తెలుగు క్లాసిక్స్ చూశారా? ఏ మూవీ ఏ ఓటీటీలో ఉందంటే?

Hari Prasad S HT Telugu
Published Jun 04, 2024 09:03 AM IST

Telugu Classic movies on ott: తెలుగులో వచ్చిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీస్ ఎన్నో ప్రస్తుతం ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీరు ఆ పాత మధురాలను చూస్తూ ఎంజాయ్ చేయాలనుకుంటే.. ఈ ఓటీటీల్లో వాటిని చూడండి.

ఓటీటీల్లో ఉన్న ఈ తెలుగు క్లాసిక్స్ చూశారా? ఏ మూవీ ఏ ఓటీటీలో ఉందంటే?
ఓటీటీల్లో ఉన్న ఈ తెలుగు క్లాసిక్స్ చూశారా? ఏ మూవీ ఏ ఓటీటీలో ఉందంటే?

Telugu Classic movies on ott: ఓటీటీలు వచ్చిన తర్వాత ఏ సినిమా ఎప్పుడైనా చూసే అవకాశం ప్రేక్షకులకు కలుగుతోంది. ఈ ఓటీటీల్లోనే తెలుగులో గత ఆరేడు దశాబ్దాలుగా వచ్చిన ఎన్నో క్లాసిక్ మూవీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. మాయా బజార్ నుంచి చిరంజీవి ఖైదీ వరకు ఎన్నో సినిమాలు ప్రైమ్ వీడియో, యూట్యూబ్, ఎంఎక్స్ ప్లేయర్ లాంటి ఓటీటీట్లో చూడొచ్చు.

ఓటీటీల్లోని తెలుగు క్లాసిక్ మూవీస్

తెలుగులో ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఎన్నో సినిమాలు ఉన్నాయి. వీటిని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. ఈ నేపథ్యంలో అలాంటి సినిమాలు ప్రస్తుతం ఏ ఓటీటీల్లో ఉన్నాయో చూడండి.

మాయాబజార్ - ఎంఎక్స్ ప్లేయర్

మాయాబజార్ తెలుగు సినిమాలోనే కాదు ఇండియన్ సినిమా చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయే ఓ క్లాసిక్ మూవీ. మహాభారతం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ఎన్టీఆర్, ఎస్వీఆర్ పోటాపోటీ నటనను తెలుగు ప్రేక్షకులు అంత త్వరగా మరచిపోరు. ఈ మూవీ ప్రస్తుతం ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

దేవదాసు - యూట్యూబ్

ఏఎన్నార్ నటించిన దేవదాసు మూవీ కూడా ఓ క్లాసికే. ఈ నవలపై ఎన్నో ఇండస్ట్రీల నుంచి ఎంతో మంది హీరోలు ఈ పాత్ర పోషించినా.. ఏఎన్నార్ దేవదాసు ఆకట్టుకున్నట్లుగా మిగతావి ఆకట్టుకోలేకపోయాయి. ఈ సినిమాను యూట్యూబ్ లో చూడొచ్చు.

గుండమ్మ కథ - ప్రైమ్ వీడియో

ఎన్టీఆర్, ఏఎన్నార్ నటించిన గుండమ్మ కథ కూడా తెలుగు సినిమా చరిత్రలో చాలా ప్రత్యేకమనే చెప్పాలి. ఈ సినిమాను ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

శంకరాభరణం - ప్రైమ్ వీడియో

శంకరాభరణం ఓ పెద్ద మ్యూజికల్ హిట్. కే విశ్వనాథ్ డైరెక్షన్ లో సోమయాజులు నటించిన ఈ సినిమా కూడా తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ మూవీ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఉంది.

సాగర సంగమం - ప్రైమ్ వీడియో

కమల్ హాసన్, విశ్వనాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సాగర సంగమం మూవీకి కూడా ఇప్పటికీ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కమల్ నట విశ్వరూపం ఈ సినిమాలో చూడొచ్చు. ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

పాతాళ భైరవి - ప్రైమ్ వీడియో

ఎన్టీఆర్ నటించిన మరో సూపర్ డూపర్ హిట్ మూవీ పాతాళ భైరవి. ఈ క్లాసిక్ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

ఖైదీ - ప్రైమ్ వీడియో

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అతిపెద్ద హిట్ ఖైదీ. అతనికి ఇండస్ట్రీలో బ్రేక్ ఇచ్చిన మూవీ. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనూ ప్రత్యేకంగా నిలిచిపోయిన సినిమా. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో ఉంది.

ముత్యాల ముగ్గు - యూట్యూబ్

రావు గోపాలరావు నట విశ్వరూపం చూపించిన సినిమా ముత్యాల ముగ్గు. ఆ సినిమాలో అతని డైలాగులు ఇప్పటికీ ఎంతో పాపులర్. ఈ సినిమాను యూట్యూబ్ లో చూడొచ్చు.

అడవి రాముడు - ప్రైమ్ వీడియో

ఎన్టీఆర్, రాఘవేంద్రరావు కాంబినేషన్లో మ్యాజిక్ చేసిన సినిమా అడవి రాముడు. ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. ఈ మూవీని ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

Whats_app_banner