Children Movie: డ్ర‌గ్స్ మాఫియా ఆట క‌ట్టించే అభిన‌వ్ - చిల్డ్ర‌న్స్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?-telugu children movie abhinav release in theaters on this date tollywood update ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Children Movie: డ్ర‌గ్స్ మాఫియా ఆట క‌ట్టించే అభిన‌వ్ - చిల్డ్ర‌న్స్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

Children Movie: డ్ర‌గ్స్ మాఫియా ఆట క‌ట్టించే అభిన‌వ్ - చిల్డ్ర‌న్స్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

Nelki Naresh HT Telugu

Children Movie డ్ర‌గ్స్ మాఫియాపై సందేశంతో తెలుగులో ఓ బాల‌ల చిత్రం రాబోతోంది అభిన‌వ్ పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ చిల్డ్ర‌న్స్ మూవీకి భీమ‌గాని సుధాక‌ర్ గౌడ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ మూవీలో స‌మ్మెట గాంధీ, స‌త్య ఎర్ర‌, మాస్ట‌ర్ గ‌గ‌న్‌, గీతా గోవింద్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

బాలల సినిమా

Children Movie ఆదిత్య‌, విక్కీస్ డ్రీమ్, డాక్ట‌ర్ గౌత‌మ్ వంటి సందేశాత్మక బాలల చిత్రాల‌ను నిర్మించారు దర్శక నిర్మాత భీమ‌గాని సుధాక‌ర్ గౌడ్. కొంత గ్యాప్ త‌ర్వాత అభినవ్ పేరుతో మ‌రో చిల్డ్ర‌న్స్ మూవీని రూపొందించారు. డ్ర‌గ్స్ మాఫియాపై సందేశంతో తెర‌కెక్కిన ఈ మూవీలో స‌మ్మెట గాంధీ, స‌త్య ఎర్ర‌, మాస్ట‌ర్ గ‌గ‌న్‌, గీతా గోవింద్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సినిమాను చిల్డ్రన్స్ డే సందర్భంగా నవంబర్ 14న రిలీజ్ చేయబోతున్నారు.

డ్రగ్ మాఫియా...

ఈ సంద‌ర్భంగా దర్శక, నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ – మన సమాజానికి జాఢ్యంలా పట్టుకున్న డ్రగ్స్ భూతం విద్యార్థులనూ వదలడం లేదు. డ్రగ్ మాఫియా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మన దేశాన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి మాఫియా బాగా పెరిగింది. స్వాతంత్య్ర సమరయోధుడైన తన తాతయ్య స్ఫూర్తితో అభినవ్ అనే సాహస బాలుడు ఈ గంజాయి మాఫియా ఆట ఎలా కట్టించాడు అనేది ఈ బాల‌ల సినిమాలో చూడబోతున్నారు. తన స్నేహితులతో కలిసి అభినవ్ చేసిన సాహసాలు పిల్ల‌ల‌తో పాటు పెద్ద‌ల‌ను ఆకట్టుకుంటాయి

సీఏం రేవంత్ రెడ్డి....

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ రహిత సమాజం కోసం సినిమా వాళ్లు చిన్న వీడియో చేయాలని కోరారు. నేను డ్రగ్స్ రహిత సమాజం కోసం నా వంతుగా ఈ సినిమాను నిర్మించి దర్శకత్వం వహించాను. ఎన్ సీసీ, స్కౌట్స్, యోగ, ధ్యానం నేర్చుకోవడం ద్వారానే పిల్లలు ఇలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండగలరు.

14న చిల్డ్రన్స్ డే సందర్భంగా....

మన దేశం ఆర్థికంగా వెనకబాటుకు పిల్లల్లో అక్షరాస్యత లేకపోవడం కూడా ఓ కారణం. పిల్లలను బాగా చదివించడం ద్వారా మన దేశాన్ని అగ్రగామిగా నిలపవచ్చు. ఇలాంటి అంశాలన్నీ అభినవ్ చిత్రంలో చూపిస్తున్నాం. ఈ సినిమాను నవంబ‌ర్‌ 14న చిల్డ్రన్స్ డే సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అభినవ్ చిత్రాన్ని విద్యార్థులకు చూపించడం ద్వారా వారిలో మంచి ఆలోచనలు కలిగించి, చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా చేయాలని ప్రయత్నిస్తున్నాం అని భీమగాని సుధాకర్ గౌడ్ అన్నాడు.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం