Telugu Bold Movie: ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు బోల్డ్ మూవీ - డెబ్బై మిలియ‌న్ల వ్యూస్‌-telugu bold movie honeymoon express gets 70 million streaming views aha ott and amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Bold Movie: ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు బోల్డ్ మూవీ - డెబ్బై మిలియ‌న్ల వ్యూస్‌

Telugu Bold Movie: ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు బోల్డ్ మూవీ - డెబ్బై మిలియ‌న్ల వ్యూస్‌

Telugu Bold Movie: హెబ్బాప‌టేల్ హీరోయిన్‌గా న‌టించిన తెలుగు బోల్డ్ మూవీ హ‌నీమూన్ ఎక్స్‌ప్రెస్ ఆహా ఓటీటీతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ డెబ్బై మిలియ‌న్ల స్ట్రీమింగ్ వ్యూస్‌ను ద‌క్కించుకుంది. ఆహా ఓటీటీలో ట్రెండింగ్ మూవీస్ లిస్ట్‌లో ఒక‌టిగా కొన‌సాగుతోంది.

తెలుగు బోల్డ్ మూవీ

Telugu Bold Movie: హెబ్బాప‌టేల్ హీరోయిన్‌గా న‌టించిన తెలుగు బోల్డ్ మూవీ హ‌నీమూన్ ఎక్స్‌ప్రెస్ ఓటీటీలో దుమ్ములేపుతోంది. రెండు ఓటీటీల‌లో ఈ మూవీ రిలీజైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో డెబ్బై మిలియ‌న్ల స్ట్రీమింగ్ మిన‌ట్స్ వ్యూస్‌ను దాటేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఆహా ఓటీటీలో విడుద‌లై నెల రోజులు దాటిన ఇప్ప‌టికీ హ‌నీమూన్ ఎక్స్‌ప్రెస్ ట్రెండింగ్ మూవీస్ లిస్ట్‌లో కొన‌సాగుతోంది. .

బోల్డ్‌...రొమాన్స్‌...

హ‌నీమూన్ ఎక్స్‌ప్రెస్ మూవీలో చైత‌న్య‌రావు, హెబ్బా ప‌టేల్ నాయ‌కానాయిక‌లుగా న‌టించారు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు బాల రాజ‌శేఖ‌రుని ఈ మూవీని తెర‌కెక్కించాడు. ప్రేమ, పెళ్లి, విడాకులు అనే అంశాల ప‌రంగా న‌వ‌త‌రం ఆలోచ‌న‌లు, అభిప్రాయాలు ఎలా ఉంటున్నాయి?

శృంగార ప‌ర‌మైన విష‌యాల్లో వారు ఎదుర్కొనే స‌మ‌స్య‌ల‌ను బోల్డ్‌, రొమాన్స్ క‌ల‌గ‌లిపి ఈ సినిమాలో చూపించాడు ద‌ర్శ‌కుడు. వైవాహిక బంధంలో అల‌క‌లు, అపార్థాలు స‌హ‌జ‌మ‌ని, చిన్న చిన్న‌ విష‌యాల‌కే గొడ‌వ‌లు ప‌డి వైవాహిక బంధాన్ని విడిపోవ‌డం క‌రెక్ట్ కాద‌నే మెసేజ్‌ను ఈ సినిమాలో అంత‌ర్లీనంగా చూపించారు ద‌ర్శ‌కుడు.

సీనియ‌ర్ హీరోయిన్‌...

హ‌నీమూన్ ఎక్స్‌ప్రెస్ మూవీలో సీనియ‌ర్ హీరోయిన్ సుహాసిని మ‌ణిర‌త్నంతో పాటు త‌నికెళ్ల‌భ‌ర‌ణి, అర‌వింద్ కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాకు క‌ళ్యాణి మాలిక్, ఆర్‌పీ ప‌ట్నాయ‌క్ మ్యూజిక్ అందించారు.

హ‌నీమూన్ ఎక్స్‌ప్రెస్ క‌థ ఏమిటంటే?

సోనాలి (హెబ్బాప‌టేల్‌)ని ప్రేమించి పెళ్లిచేసుకుంటాడుఇషాన్ (చైత‌న్య‌రావు), భిన్న మ‌న‌స్త‌త్వాల కార‌ణంగా ఫ‌స్ట్ నైట్ రోజే ఇద్ద‌రు గొడ‌వ‌ప‌డ‌తారు. శృంగార జీవితాన్ని ఆనందించ‌లేక‌పోతారు. గొడ‌వ‌లు పెద్ద‌వై విడిపోయేప‌రిస్థితి వ‌స్తుంది. అలాంటి టైమ్‌లోనే హ‌నీమూన్ ఎక్స్‌ప్రెస్ అనే రిసార్ట్‌లోకి వెళితే త‌మ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొరుకుతుంద‌ని ఇషాన్‌, సోనాలిల‌కు తెలుస్తుంది.

ఆ రిసార్ట్‌లోకి అడుగుపెట్టిన వారికి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? ఇషాన్‌, సోనాలి మ‌ధ్య ఉన్నస‌మ‌స్య‌ల‌కుకి కార‌ణం ఏమిటి? రిసార్ట్‌లో ఇషాన్‌, సోనాలికి ప‌రిచ‌య‌మైన‌ వృద్ధ జంట (సుహాసిని, త‌నికెళ్ల‌భ‌ర‌ణి) ఎవ‌రు? వారి స‌మ‌స్య‌ల‌కు అక్క‌డ ప‌రిష్కారం దొరికిందా? లేదా? అన్న‌దే హ‌నీమూన్ ఎక్స్‌ప్రెస్ క‌థ‌. చైత‌న్య‌రావు, హెబ్బాప‌టేల్ కెమిస్ట్రీ హ‌నీమూన్ ఎక్స్‌ప్రెస్ మూవీకి హైలైట్‌గా నిలిచింది.

30 వెడ్స్ 21 వెబ్‌సిరీస్‌తో…

30 వెడ్స్ 21 వెబ్‌సిరీస్‌తో తెలుగులో ఫేమ‌స్ అయ్యాడు చైత‌న్య‌ రావు. ఈ సిరీస్ త‌ర్వాత అత‌డికి టాలీవుడ్‌లో అవ‌కాశాలు పెరిగాయి. ఓ వైపు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా కొన‌సాగుతోన్నాడు చైతన్య రావు. కీడాకోలా, పారిజాత‌ప‌ర్వం, తెప్ప‌స‌ముద్రం, డియ‌ర్ నాన్న‌తో పాలు ప‌లు చిన్న సినిమాల్లో హీరోగా క‌నిపించాడు. ప్ర‌స్తుతం అనుష్క ఘాటితో పాటు మ‌రికొన్ని సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తోన్నాడు.

ఓదెల 2 మూవీ..

తెలుగులో గ్లామ‌ర్ రోల్స్‌తో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న‌ది హెబాప‌టేల్‌. కుమారి 21 ఎఫ్‌, అలా ఎలా తో మంచి విజ‌యాల్ని అందుకున్న‌ది. ఈ ఏడాది హ‌నీమూన్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు వేయ్ ద‌రువేయ్ సినిమాలు చేసింది. ప్ర‌స్తుతం ఓదెల 2తో పాటు ధూమ్‌ధామ్ సినిమాల్లో న‌టిస్తోంది. . ఓదెల 2 మూవీలో త‌మ‌న్నా మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.