Bold Thriller OTT: థియేటర్లలో రిలీజైన నాలుగు నెలల తర్వాత మరో ఓటీటీలోకి వచ్చిన తెలుగు బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ
Bold Thriller OTT:చాందని చౌదరి హీరోయిన్‌గా నటించిన యేవమ్ మూవీ ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సైకలాజికల్ బోల్డ్ థ్రిల్లర్ మూవీ మరో ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. యేవమ్ మూవీలో వశిష్ట సింహా, ఆషురెడ్డి కీలక పాత్రల్లో నటించారు
Bold Thriller OTT: చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటించిన యేవమ్ మూవీ సన్ నెక్స్ట్ ద్వారా శుక్రవారం ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. థియేటర్లలో రిలీజైన నాలుగు నెలల తర్వాత సన్ నెక్స్ట్‌లో ఈ మూవీ విడుదలైంది. ఇప్పటికే ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేకపోయిన ఈ బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆహా ఓటీటీలో మాత్రం రికార్డ్ వ్యూస్‌ను దక్కించుకున్నది.
ఆషురెడ్డి...
యేవమ్ మూవీలో చాందిని చౌదరితో పాటు జై భరత్, వశిష్ట సింహా, ఆషురెడ్డి కీలక పాత్రలు పోషించారు. ప్రకాష్ దంతులూరి దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో చాందని చౌదరి పోలీస్ ఆఫీసర్‌గా నటించింది.
రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్స్‌కు భిన్నమైన క్యారెక్టర్‌లో కనిపించింది. ఈ సినిమాకు హీరో నవదీప్ ఓ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే కాన్సెప్ట్‌తో సైకలాజికల్ బోల్డ్ థ్రిల్లర్‌గా దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించాడు.
సైకో కిల్లర్ కథ...
సౌమ్య (చాందిని చౌదరి) ఎస్ఐ జాబ్‌కు సెలెక్ట్ అవుతుంది. వికారాబాద్‌లో ఆమెకు పోస్టింగ్ వస్తుంది. అదే పోలీస్ స్టేషన్‌లో పనిచేసే అభి(భరత్ రాజ్)ను సౌమ్య ఇష్టపడుతుంది. అప్పటికే అభికి పెళ్లవుతుంది. కానీ భార్య (ఆషురెడ్డి) అతడిని వదిలేసి వెళ్లిపోతుంది.
మరోవైపు వికారాబాద్ ఏరియాలో యుగంధర్ అనే సైకో కిల్లర్ సినిమా హీరోల పేర్లతో అమ్మాయిలను ట్రాప్ చేసి వారిని హతమార్చుతుంటాడు. ఆ సైకో కిల్లర్‌ను పట్టుకునే ప్రయత్నంలో అభి గురించి సౌమ్యకు ఓ షాకింగ్ నిజం తెలుస్తుంది? అదేమిటి? యుగంధర్‌కు అభికి ఎలాంటి సంబంధం ఉంది? అభికి ఉన్న మానసిక సమస్య ఏమిటి? అభి భార్య ఏమైంది అన్నదే యేవమ్ మూవీ కథ.
ఒకే రోజు రెండు సినిమాలు..
యేవమ్‌తో పాటూ జూన్ చాందిని చౌదరి హీరోయిన్‌గా నటించిన మ్యూజిక్ షాప్ మూర్తి మూవీ కూడా ఒకే రోజు రిలీజైంది. ఫ్యామిలీ డ్రామా కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను దక్కించుకున్నది. ఈ రెండు సినిమాలతో ఈ ఏడాది విశ్వక్‌సేన్ గామిలో కూడా హీరోయిన్‌గా కనిపించింది. మొత్తంగా చాందని 2024లో చాందిని చౌదరి నటించిన మూడు సినిమాలు రిలీజయ్యాయి.
నేషనల్ అవార్డ్...
తెలుగులో ప్రేమ ఇష్క్ కాదల్ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది చౌందని చౌదరి. మను, కలర్ ఫొటో, సమ్మతమే తో పాటు పలు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్‌తో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.
కలర్ ఫొటో మూవీ బెస్ట్ తెలుగు మూవీగా నేషనల్ అవార్డును అందుకున్నది. మహేష్ బాబు బ్రహ్మోత్సవం, నితిన్ లైతో పాటు మరికొన్ని భారీ బడ్జెట్ మూవీస్ లలో కీలక పాత్రలు చేసింది.
సబా నాయగన్ మూవీతో గత ఏడాది కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సంతాన ప్రాప్తిరస్తు పేరుతో ఓ మూవీ చేస్తోంది.