బిగ్‌బాస్ బ్యూటీ శ్వేతా వర్మ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు అంథాలజీ మూవీ ఏకమ్ యూట్యూబ్‌లో రిలీజైంది. డ్రామా థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో అభిరామ్ వర్మ, తనికెళ్లభరణి, అదితి మ్యాకల్, కల్పిక గణేష్ కీలక పాత్రల్లో నటించారు. వంశీరామ్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు.
2021లో అక్టోబర్‌లో ఏకమ్ మూవీ థియేటర్లలో రిలీజైంది. డిఫరెంట్ అటెంప్ట్‌గా ప్రేక్షకుల ప్రశంసలను అందుకున్నది. ఐఎమ్‌డీబీలో పదికిగాను 7.2 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది. ఏకమ్ మూవీకి జోన్ ఫ్లాంక్లిన్ మ్యూజిక్ అందించాడు.
ఆనంద్ చిన్నవయసులోనే తల్లిదండ్రులను కోల్పోతాడు. జాబ్ పోవడంతో పాటు ప్రేమలో బ్రేకప్ అవుతుంది. ప్రపంచాన్వేషణకు బయలుదేరుతాడు. అయ్యప్ప ఓ పూజారి. కానీ కొన్ని కారణాల వల్ల తాను కొలుస్తోన్న దేవుడిని దొంగతనంగా ఎత్తుకుపోయి స్మశానంలో దాచేస్తాడు.
దివ్యకు కాపీ షాఫ్ పెట్టాలన్నది కల. ఆనంద్‌ను ప్రేమిస్తుంది నిత్య. అతడి మనసు మార్చి పెళ్లి చేసుకోవాలని కలలు కంటుంది. అనుకోకుండా ఆనంద్ జీవితంలోకి విఫల ప్రేమతో బాధపడుతోన్న నిర్వాణ ఎంటర్ అవుతుంది. ఈ ఐదుగురి జీవితాల్లో చివరకు ఏ మజిలీకి చేరుకున్నాయి. దావ్య కాఫీ షాప్‌లో చేరిన డేవిడ్ ఎవరు? నిత్య, నిర్వాణలతో ఆనంద్ ఎవరి ప్రేమకు ఓకే చెప్పాడు? అయ్యప్ప దొంగతనం బయటపడిందా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
ఏకమ్ మూవీలో నిర్వాణ పాత్రలో కనిపించింది శ్వేతా వర్మ. బోల్డ్ రోల్‌లో తన యాక్టింగ్‌తో ఆకట్టుకుంటుంది.బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్నది శ్వేతా వర్మ. నలభై రెండో రోజు హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యింది.
బిగ్‌బాస్‌తో తెలుగులో పాపులర్ అయిన ఈ బ్యూటీ రోజ్ విల్లా, ముగ్గురు మొనగాళ్లు, ఆపరేషన్ వాలెంటైన్, వ్యూహం, కొండవీడుతో పాటు మరికొన్ని తెలుగు సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసింది.ఏకమ్‌లో కీలక పాత్రలో నటించిన అదితి మ్యాకల్, కల్పిక గణేష్ కూడా తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో కనిపించారు.
సంబంధిత కథనం