Bilingual Movie: ముగ్గురు హీరోయిన్లతో తెలుగు హీరో ద్విభాష మూవీ.. తనకు రీ ఎంట్రీలా ఉందన్న రాధ-telugu actor trigun new bilingual movie sweety naughty crazy with three heroines radha in sweety naughty crazy launch ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bilingual Movie: ముగ్గురు హీరోయిన్లతో తెలుగు హీరో ద్విభాష మూవీ.. తనకు రీ ఎంట్రీలా ఉందన్న రాధ

Bilingual Movie: ముగ్గురు హీరోయిన్లతో తెలుగు హీరో ద్విభాష మూవీ.. తనకు రీ ఎంట్రీలా ఉందన్న రాధ

Sanjiv Kumar HT Telugu
Aug 10, 2024 02:03 PM IST

Trigun Bilingual Movie Sweety Naughty Crazy Movie Launch: ముగ్గురు హీరోయిన్లతో తెలుగు హీరో త్రిగుణ్ నటిస్తున్న ద్విభాష చిత్రం స్వీటీ నాటీ క్రేజీ. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హీరోయిన్ రాధ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ముగ్గురు హీరోయిన్లతో తెలుగు హీరో ద్విభాష మూవీ.. తనకు రీ ఎంట్రీలా ఉందన్న రాధ
ముగ్గురు హీరోయిన్లతో తెలుగు హీరో ద్విభాష మూవీ.. తనకు రీ ఎంట్రీలా ఉందన్న రాధ

Trigun Sweety Naughty Crazy With Three Heroines: తెలుగులో హీరోగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నాడు త్రిగుణ్ (అదిత్ అరుణ్). ఇదివరకు లైన్ మ్యాన్‌ సినిమాతో అలరించిన త్రిగుణ్ ముగ్గురు హీరోయిన్లతో చేస్తున్న ద్విభాష చిత్రమే స్వీటీ నాటీ క్రేజీ. ఈ సినిమాలో శ్రీజిత ఘోష్, ఇనియ (Ineya), రాధ హీరోయిన్లుగా చేస్తున్నారు.

అరుణ్ విజువల్స్ బ్యానర్ మీద ఆర్. అరుణ్ నిర్మిస్తున్న స్వీటీ నాటీ క్రేజీ మూవీకి రాజశేఖర్.జి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. తిథుల సమక్షంలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి అలీ క్లాప్ కొట్టగా.. దామోదర ప్రసాద్ స్క్రిప్ట్ అందజేశారు. అలాగే బెక్కెం వేణు గోపాల్ దర్శకత్వం వహించారు.

ఈ స్వీటీ నాటీ క్రేజీ సినిమాలో హీరో హీరోయిన్లతోపాటు అలీ, రఘుబాబు, రవి మరియ ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో హీరోయిన్లు, ఇతర నటీనటులు ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకొచ్చారు.

హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. "అరుణ్ గారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అరుణ్ విజువల్స్ మీద రాజశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీజిత, ఇనియలు ఇందులో మంచి పాత్రలుంటాయి. టైటిల్‌కు తగ్గట్టుగా.. స్వీటీ, నాటీ, క్రేజీలా ఉంటాయి. నాకు ఇంత వరకు కామెడీ చిత్రాలు బాగా వర్కౌట్ అయ్యాయి. ‘కథ’తో మొదలైన నా ప్రయాణానికి మీడియా వారు సపోర్ట్ అందించారు" అని అన్నారు.

"త్రిగుణ్ ద్విభాష చిత్రంగా ఈ మూవీని చేస్తున్నారు. తెలుగులో నేను నటిస్తున్నాను. తమిళంలో నా పాత్రను రవి మరియ గారు చేస్తున్నారు. ఈ చిత్రం మంచి సక్సెస్ సాధిస్తుందని నమ్ముతున్నాను" అని నటుడు రఘుబాబు తెలిపారు.

"తమిళంలో నేను ఎన్నో చిత్రాల్లో నటించాను. దర్శకత్వం కూడా వహించాను. ఖుషీ, నాని చిత్రాలకు కో డైరెక్టర్‌గా పని చేశాను. ఇప్పుడు ఈ చిత్రంలో నేను ఓ మంచి పాత్రను పోషిస్తున్నాను" అని తమిళ నటుడు రవి మరియ చెప్పుకొచ్చారు.

హీరోయిన్ ఇనియ మాట్లాడుతూ.. "నాకు తెలుగు అంతగా రాదు. ఈ సినిమా అయ్యేలోపు నేర్చుకుంటాను. ఇది నాకు 45వ సినిమా. బాలనటిగా కెరీర్ మొదలు పెట్టాను. ఇందులో నేను నందిని అనే మంచి పాత్రను చేస్తున్నాను. ఈ చిత్రంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది" అని పేర్కొన్నారు.

"నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఇనియతో నేను తమిళంలో చేశాను. త్రిగుణ్‌తో నటించడం ఆనందంగా ఉంది. ఇది నాకు రీ ఎంట్రీలా అనిపిస్తోంది. మా సినిమాను అందరూ ఆదరించండి" అని హీరోయిన్ రాధ తెలిపారు.

"ఇలాంటి సినిమాలో నటిస్తుండటం మొదటి సారి. ఓ నటిగా అన్ని రకాల పాత్రలను, సినిమాలను చేయాలని ఈ చిత్రాన్ని ఎంచుకున్నాను. ఇది చాలా మంచి చిత్రం అవుతుందని నమ్మకం ఉంది. ఈ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది" అని హీరోయిన్ శ్రీజిత ఘోష్ చెప్పారు.