తెలుగు మూవీ వీరరాజు 1991 థియేటర్లలో రిలీజైన వారంలోనే ఓటీటీలోకి వచ్చింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. రుద్ర విరాజ్ హీరోగా నటిస్తూ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. అజయ్ ఘోష్, బెనర్జీ, అర్చన, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషించారు.
వీరరాజు 1991 మూవీ మే 22న థియేటర్లలో రిలీజైంది. పది రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వచ్చేసింది. 1991లో నెల్లూరు జిల్లాలో మత్స్యకారుడి జీవితంలో జరిగిన వాస్తవ ఘటనల స్ఫూర్తితో మేకర్స్ ఈ మూవీని తెరకెక్కించారు. గగన్ బదేరియా ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.
వీరరాజు ఓ మత్స్యకారుడు. చేపలు పట్టుకుంటూ జీవిస్తుంటాడు. అన్యాయాన్ని అస్సలు సహించడు. ఓ రాజకీయనాయకుడు చేసే అన్యాయాలకు వీరరాజు ఎదురుతిరుగుతాడు. ఆ తర్వాత ఏమైంది? తన అధికారం, పలుకుబడితో వీరరాజును చంపాలని ఆ నాయకుడు ఎలాంటి ఎత్తులు వేశాడు? ఈ పోరాటంలో ఊరివాళ్లు వీర రాజుకు ఎలా అండగా నిలిచారు అన్నదే ఈ మూవీ కథ.
వీరరాజు 1991 మూవీ థియేటర్లలో రిలీజైన విషయం తెలియకుండానే వెళ్లిపోయింది. కమర్షియల్‌గా సరైన విజయాన్ని అందుకోలేకపోవడంతోనే వారం రోజుల్లోనే మేకర్స్ ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసినట్లు సమాచారం. హీరోగా, డైరెక్టర్‌గా రుద్ర విరాజ్‌కు ఇదే ఫస్ట్ మూవీ.
ఈ వారం ఓటీటీలోకి వీరరాజు 1991తో పాటు నాని హిట్ 3, సూర్య రెట్రో, మోహన్ లాల్ తుడరుం సినిమాలు వచ్చాయి. వీటితో పాటు తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ కూడా జూన్ 2న ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది .హిట్ 3, రెట్రో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోండగా...తుడరుం జియో హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. టూరిస్ట్ ఫ్యామిలీ కూడా జియో హాట్ స్టార్ లోనే రిలీజ్ కాబోతోంది.
సంబంధిత కథనం