Action Thriller OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ - ప‌రువు హ‌త్య‌ల నేప‌థ్యంలో!-telugu action thriller movie pothugadda streaming now on etv win latest telugu ott releases ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Action Thriller Ott: డైరెక్ట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ - ప‌రువు హ‌త్య‌ల నేప‌థ్యంలో!

Action Thriller OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ - ప‌రువు హ‌త్య‌ల నేప‌థ్యంలో!

Nelki Naresh Kumar HT Telugu
Jan 30, 2025 12:41 PM IST

Action Thriller OTT: తెలుగు యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ పోతుగ‌డ్డ నేరుగా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. గురువారం నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. పోతుగ‌డ్డ మూవీలో పృథ్వీ దండ‌మూడి, విస్మ‌య శ్రీ హీరోహీరోయిన్లుగా న‌టించారు.

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఓటీటీ
యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఓటీటీ

Action Thriller OTT: తెలుగు యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ పోతుగ‌డ్డ నేరుగా ఓటీటీలో రిలీజైంది. గురువారం (నేటి) నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ మూవీలో పృథ్వీ దండ‌మూడి, విస్మ‌య హీరోహీరోయిన్లుగా న‌టించారు. ఆడుకాలం న‌రేన్‌, శ‌త్రు కీల‌క పాత్ర‌లు పోషించారు.

ప‌రువు హ‌త్య‌ల నేప‌థ్యంలో...

ప‌రువు హ‌త్య‌ల నేప‌థ్యానికి పొలిటిక‌ల్ అంశాల‌ను జోడించి ద‌ర్శ‌కుడు ర‌క్ష వీర‌మ్ ఈ మూవీని తెర‌కెక్కించాడు. వాస్త‌వ ఘ‌ట‌న‌ల స్ఫూర్తితో పోతుగ‌డ్డ‌ మూవీని తెర‌కెక్కిన‌ట్లు మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్‌లో పేర్కొన్నారు.

పోతుగ‌డ్డ క‌థ ఇదే...

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోతుగ‌డ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే స‌ముద్ర‌ను (ఆడుకాలం న‌రేన్‌) ఎలాగైనా ఓడించాల‌ని భాస్క‌ర్ (శ‌త్రు) నిర్ణ‌యించుకుంటాడు. ఎన్నిక‌ల కోసం కోట్ల రూపాయ‌ల డ‌బ్బును సిద్ధం చేసుకుంటాడు. కృష్ణ (ఫృథ్వీ దండ‌మూడి) అనే అబ్బాయితో ప్రేమ‌లో ఉంటుంది స‌ముద్ర కూతురు గీత (విస్మ‌య‌).

ఇంట్లో త‌మ పెళ్లికి తండ్రి ఒప్పుకోడ‌ని భావించిన గీత ప్రేమించిన అబ్బాయితో క‌లిసి పారిపోవాల‌ని ప్లాన్ వేస్తుంది. కూతురి ప్రేమ విష‌యం తెలిసి స‌ముద్ర ఏం చేశాడు? ఆ ప్రేమ జంట వెళుతోన్న బ‌స్‌పై ఎటాక్ చేసింది ఎవ‌రు? ఆ బ‌స్‌లోనే కృష్ణ డ‌బ్బు ఎందుకు ఉంది? చివ‌ర‌కు ఆ ప్రేమ జంట ఏమ‌య్యారు అన్న‌దే పోతుగ‌డ్డ మూవీ క‌థ‌.

ఎన్నిక‌ల టైమ్‌లో...

ప్రేమ‌క‌థ‌తో పాటు ఎలెక్ష‌న్స్ టైమ్‌లో డ‌బ్బు ప్ర‌భావం ఎలా ఉంటుంది? ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం ప్ర‌త్య‌ర్థులు ఎలాంటి ఎత్తులు వేస్తార‌న్న‌ది ఈ మూవీలో ద‌ర్శ‌కుడు చూపించాడు. పోతుగ‌డ్డ మూవీకి మార్క‌స్ మ్యూజిక్ అందించాడు. ప‌రువు హ‌త్య‌ల‌కు సంబంధించి మంచి మెసేజ్‌ను ద‌ర్శ‌కుడు ఈ మూవీలో ట‌చ్ చేసిన‌ట్లు స‌మాచారం.ఈ మూవీలో ప్ర‌శాంత్ కార్తీ, వెంకీ ఇత‌ర పాత్ర‌ల్లో క‌నిపించారు.

తెలుగులో...

పోతుగ‌డ్డ మూవీలో హీరోగా న‌టించిన పృథ్వీ దండ‌మూడి గ‌తంలో ఐఐటీ కృష్ణ‌మూర్తి సినిమాలో హీరోగా న‌టించాడు. మెహ‌బూబాతో పాటు మ‌రికొన్ని తెలుగు సినిమాల్లో విభిన్న‌మైన పాత్ర‌లు పోషించాడు. ఆడుకాలం న‌రేన్‌, శ‌త్రు కూడా ప‌లు తెలుగు సినిమాల్లో విల‌న్లుగా క‌నిపించారు.

Whats_app_banner