Harom Hara New OTT Date: హరోం హర ఓటీటీ రిలీజ్‍కు కొత్త డేట్ ఖరారు.. ఎప్పుడు.. ఎక్కడ రానుందంటే..-telugu action thriller movie harom hara movie gets new ott streaming date on etv win ott release date sudheer babu ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Harom Hara New Ott Date: హరోం హర ఓటీటీ రిలీజ్‍కు కొత్త డేట్ ఖరారు.. ఎప్పుడు.. ఎక్కడ రానుందంటే..

Harom Hara New OTT Date: హరోం హర ఓటీటీ రిలీజ్‍కు కొత్త డేట్ ఖరారు.. ఎప్పుడు.. ఎక్కడ రానుందంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 13, 2024 02:59 PM IST

Harom Hara New OTT Release Date: హరోం హర సినిమా కొత్త ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ వారంలోనే స్ట్రీమింగ్‍కు రావాల్సిన ఈ చిత్రం ఓ కారణం వాయిదా పడింది. అయితే, కొత్త స్ట్రీమింగ్ తేదీని ఈటీవీ విన్ తాజాగా ప్రకటించింది.

Harom Hara: హరోం హర ఓటీటీ రిలీజ్‍కు కొత్త డేట్ ఖరారు.. ఎప్పుడు.. ఎక్కడ రానుందంటే..
Harom Hara: హరోం హర ఓటీటీ రిలీజ్‍కు కొత్త డేట్ ఖరారు.. ఎప్పుడు.. ఎక్కడ రానుందంటే..

హరోం హర సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఆఖరి నిమిషాల్లో వాయిదా పడింది. యువ దళపతి సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం జూలై 11వ తేదీన ఓటీటీలోకి రావాల్సి ఉంది. ఆ తేదీని ఈటీవీ విన్, ఆహా ఓటీటీలు అధికారికంగా కూడా ప్రకటించాయి. అయితే, జూలై 11న ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రాలేదు. ఇప్పుడు కొత్త స్ట్రీమింగ్ డేట్‍ను ఈటీవీ విన్ వెల్లడించింది.

yearly horoscope entry point

కొత్త డేట్ ఇదే

హరోం హర చిత్రాన్ని జూలై 18వ తేదీన స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ అధికారికంగా వెల్లడించింది. సోషల్ మీడియాలో పోస్టర్ కూడా తీసుకొచ్చింది. దీంతో వచ్చే వారం జూలై 18న ఈ మూవీ ఈటీవీ విన్‍లో అడుగుపెట్టడం ఖరారైంది.

ఇంకా క్లారిటీ ఇవ్వని ఆహా

హరోం హర చిత్రం స్ట్రీమింగ్ హక్కులను ఆహా ఓటీటీ కూడా తీసుకుంది. జూలై 11న తెస్తామని ఆ ప్లాట్‍ఫామ్ కూడా ప్రకటించింది. కానీ వాయిదా పడింది. అయితే, జూలై 18న ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు ఈటీవీ విన్ కొత్త తేదీని వెల్లడించినా.. ఈ విషయంపై ఆహా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. త్వరలోనే ఆహా నుంచి ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఆహా కూడా అదే రోజున తీసుకొస్తుందా.. ఏమైనా ఛేంజ్ ఉంటుందా అనేది చూడాలి.

వాయిదా ఇందుకే!

హరోం హర సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వాయిదా పడేందుకు యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. ఓ తండ్రీకూతుళ్ల వీడియోపై ప్రణీత్ తన యూట్యూబ్ ఛానెల్‍లో స్నేహితులతో కలిసి అసభ్య కామెంట్లు చేశాడు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రణీత్‍ను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హరోం హర చిత్రంలో ప్రణీత్ హనుమంతు ఓ పాత్ర చేశాడు. అయితే, అతడికి ఈ చిత్రంలో యాక్టింగ్ ఛాన్స్ ఇచ్చినందుకు అసహ్యంగా ఉందంటూ సుధీర్ బాబు కూడా ఓ ట్వీట్ చేశారు. హరోం హర చిత్రంలో ప్రణీత్ ఉన్న సీన్లను కట్ చేసి ఓటీటీలోకి తీసుకురావాలని మూవీ యూనిట్ నిర్ణయించుకుంది. అందుకే స్ట్రీమింగ్ డేట్ వాయిదా పడింది.

బాక్సాఫీస్ వద్ద నిరాశ

హరోం హర చిత్రం జూన్ 14వ తేదీన థియేటర్లలో విడుదలైంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సుధీర్ బాబు కెరీర్లో అత్యధిక బడ్జెట్ చిత్రంగా తెరకెక్కింది. చిత్తూరు బ్యాక్‍డ్రాప్‍లో దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక ఈ మూవీని తెరకెక్కించారు. అయితే, హరోం హర చిత్రానికి అంచనాలకు తగట్టు వసూళ్లు రాలేదు. మొదటి నుంచి మిక్స్డ్ టాక్ రావటంతో బాక్సాఫీస్ వద్ద నిరాశ ఎదురైంది. ఈ మూవీకి రూ.7కోట్లలోపే వసూళ్లు వచ్చినట్టు అంచనా.

హరోం హర చిత్రంలో సుధీర్‌కు జోడీగా మాళవిక శర్మ హీరోయిన్‍గా చేయగా.. సునీల్ కూడా ఓ ప్రధాన పాత్ర పోషించారు. తుపాకులను అక్రమంగా తయారు చేయడం, వాటితో వ్యాపారం చేయడం చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జీ నాయుడు ప్రొడ్యూజ్ చేసిన ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ ఇచ్చారు.

Whats_app_banner