Action Revenge Thriller OTT: ఓటీటీలోకి మరో రెండు రోజుల్లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..-telugu action revenge thriller kobali will be streaming on disney plus hotstar ott soon ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Action Revenge Thriller Ott: ఓటీటీలోకి మరో రెండు రోజుల్లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Action Revenge Thriller OTT: ఓటీటీలోకి మరో రెండు రోజుల్లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 02, 2025 08:05 PM IST

Action Revenge Thriller OTT: కోబలి వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ చిత్రం మరో రెండు రోజుల్లోనే స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది. యాక్షన్ రివేంజ్ థ్రిల్లర్‌ సిరీస్‍గా వస్తోంది.

Action Thriller OTT: ఓటీటీలోకి మరో రెండు రోజుల్లో డైరెక్ట్‌గా తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Action Thriller OTT: ఓటీటీలోకి మరో రెండు రోజుల్లో డైరెక్ట్‌గా తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

రాయలసీమ బ్యాక్‍డ్రాప్‍లో ‘కోబలి’ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఈ క్రైమ్ రివేంజ్ థ్రిల్లర్ సిరీస్‍లో రవి ప్రకాశ్ లీడ్ రోల్ చేశారు. ఇటీవలే వచ్చిన ఈ సిరీస్ ట్రైలర్ గ్రిప్పింగ్‍గా, రస్టిక్ యాక్షన్‍తో ఆకట్టుకుంది. దీంతో ఈ తెలుగు సిరీస్‍పై ఇంట్రెస్ట్ పెరిగింది. కోబలి సిరీస్‍కు రేవంత్ లెవక దర్శకత్వం వహించారు. మరో రెండు రోజుల్లో కోబలి సిరీస్ స్ట్రీమింగ్‍కు రానుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

yearly horoscope entry point

స్ట్రీమింగ్ వివరాలు ఇవే

కోబలి వెబ్ సిరీస్ ఫిబ్రవరి 4వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. అంటే మరో రెండు రోజుల్లో ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చేస్తుంది. ఈ సిరీస్ నుంచి ఇటీవలే లిల్లీ అంటూ ఓ పాటను కూడా రిలీజ్ చేసింది హాట్‍స్టార్.

కోబలి సిరీస్‍లో రవి ప్రకాశ్‍తో పాటు శ్యామల కూడా ప్రధాన పాత్ర పోషించారు. రాకీ సింగ్, వెంకట్, భరత్ రెడ్డి, తరుణ్ రోహిత్, యోగ్ ఖత్రీ, గడ్డం నవీన్, మణికంఠ కీలకపాత్రలు చేశారు. రాయలసీమ బ్యాక్‍డ్రాప్‍లో రివేంజ్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్‍ను తెరకెక్కించారు డైరెక్టర్ రేవంత్.

రస్టిక్ యాక్షన్‍తో..

కోబలి ట్రైలర్ ఇటీవలే వచ్చింది. రస్టిక్ యాక్షన్‍తో ఈ ట్రైలర్ ఉంది. “ఏ పురాణం చదివినా.. ఏ కథ విన్నా.. అన్నింట్లో స్వార్థం, ద్వేషం.. వీటి వల్లే యుద్ధాలు జరిగాయి” అంటూ మొదలైన ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గా సాగింది. కొన్ని వర్గాల ఆధిపత్యం కోసం సాగే ప్రతీకార పోరుగా ఈ సిరీస్ ఉండనుందని అర్థమవుతోంది. ఇంటెన్స్ యాక్షన్‍తో ట్రైలర్ ఉంది. దీంతో సిరీస్‍పై ఆసక్తి పెరిగింది.

కోబలి వెబ్ సిరీస్‍కు డైరెక్టర్ రేవంత్‍తో పాటు జీవన్ బండి, రాజశేఖర్ రెడ్డి, కమ్మి రెడ్డి సంయుక్తంగా కథ రాసుకున్నారు. ఈ సిరీస్‍ను జ్యోతి మేఘవత్ రాథోడ్, రాజశేఖర్ రెడ్డి, తిరుపతి శ్రీనివాసరావు ప్రొడ్యూజ్ చేశారు. గౌర హరి మ్యూజిక్ అందించిన ఈ సిరీస్‍కు కిశోర్ మద్దాలి ఎడిటర్‌గా వ్యవహరించారు. మరో రెండు రోజుల్లో ఫిబ్రవరి 4 నుంచి కోబలి సిరీస్‍ను చూడొచ్చు

డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో రీసెంట్‍గా ది సీక్రెట్స్ ఆఫ్ శీలేదార్స్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఛత్రపతి శివాజీ మహరాజ్ నిధిని అన్వేషించడం, సంరక్షించేందుకు చేసే ప్రయత్నాల చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. ఈ సిరీస్‍లో సాయి తంహనకర్, రాజీవ్ ఖండేవాల్ ప్రధాన పాత్రలు పోషించారు.

Whats_app_banner

సంబంధిత కథనం