Tollywood: ‘అదిదా సర్‌ప్రైజ్’ ఎఫెక్ట్.. టాలీవుడ్‍కు మహిళా కమిషన్ వార్నింగ్.. బాధ్యతగా ఉండాలంటూ హెచ్చరిక-telangana state women commission gives warning to tollywood after complaints on adhi dha surprisu song ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tollywood: ‘అదిదా సర్‌ప్రైజ్’ ఎఫెక్ట్.. టాలీవుడ్‍కు మహిళా కమిషన్ వార్నింగ్.. బాధ్యతగా ఉండాలంటూ హెచ్చరిక

Tollywood: ‘అదిదా సర్‌ప్రైజ్’ ఎఫెక్ట్.. టాలీవుడ్‍కు మహిళా కమిషన్ వార్నింగ్.. బాధ్యతగా ఉండాలంటూ హెచ్చరిక

Tollywood: తెలుగు సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మహిళల కమిషన్ వార్నింగ్ ఇచ్చింది. అసభ్యకరమైన డాన్సులు లాంటి వద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల ఓ పాటపై ఫిర్యాదులు రావటంతో స్పందించింది.

అదిదా సర్‌ప్రైజ్ పాటలోని ఓ డ్యాన్స్ స్టెప్ ఇది

టాలీవుడ్‍లో ఇటీవల కొన్ని పాటల్లోని డ్యాన్స్ స్టెప్‍లపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. డాకు మహరాజ్ సినిమాలోని దిబిడి దబిడి పాటలో డాన్స్ మూవ్‍మెంట్లపై అసంతృప్తి వ్యక్తమైంది. తాజాగా రాబిన్‍హుడ్ చిత్రంలో ‘అదిదా సర్‌ప్రైజ్’ అంటూ లిరికల్ వీడియో రాగా.. ఇందులో కేతిక శర్మ చేసిన డ్యాన్స్ స్టెప్‍లపై కొందరు విమర్శలు చేశారు. అసభ్యంగా స్టెప్స్ ఉన్నాయంటూ ఆగ్రహించారు. ఈ విషయంపై నేడు (మార్చి 20) తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. టాలీవుడ్‍కు వార్నింగ్ ఇచ్చింది.

కంప్లైంట్స్ వచ్చాయి.. జాగ్రత్త

ఇటీవల కొన్ని సినిమా పాటల్లోని డ్యాన్స్ స్టెప్‍లు అసభ్యంగా ఉన్నాయంటూ తమకు ఫిర్యాదులు వచ్చాయని మహిళా కమిషన్ వెల్లడించింది. శక్తివంతమైన మాధ్యమైన సినిమాల్లో మహిళలను కించరిచేలా, అసభ్యంగా చూపించడం సరికాదని పేర్కొంది. కొరియోగ్రాఫర్లు, దర్శకులు, నిర్మాతలు ఈ విషయంపై బాధ్యతగా ఉండాలని, లేకపోతే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.

మహిళలను అసభ్యంగా చూపించేలా ఉండే డ్యాన్స్ స్టెప్‍లను పాట నుంచి తీసేయాలని మహిళా కమిషన్ ఆదేశించింది. లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సమాజానికి మేలు చేసే సందేశాలను, మహిళల గౌరవాన్ని కాపాడే బాధ్యత సినిమా రంగానికి ఉందని, స్వీయ నియంత్రణ పాటించాలని సూచించింది.

రాబిన్‍హుడ్ మూవీలోని ‘అదిదా సర్‌ప్రైజ్’ సాంగ్ గురించి మహిళా కమిషన్‍కు కొన్ని ఫిర్యాదులు అందాయి. మహిళలను కించపరిచేలా అసభ్యంగా డ్యాన్స్ స్టెప్స్ ఉన్నాయంటూ కంప్లైట్స్ వెళ్లాయి. సోషల్ మీడియాలోనూ నెటిజన్లు విమర్శలు కురిపించారు. ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ స్పందించింది.

మూవీ టీమ్ డ్యాన్స్ స్టెప్‍లను తొలగిస్తుందా!

‘అదిదా సర్‌ప్రైజ్’ పాటలో అభ్యంతరాలు వ్యక్తమైన డ్యాన్స్ స్టెప్‍లను మూవీ టీమ్ తొలగించే అవకాశం ఉంది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. గతంలో దబిడి దిబిడి పాటకు కూడా ఆయనే డ్యాన్స్ కంపోజ్ చేశారు. దీంతో శేఖర్‌పై నెటిజన్ల నుంచి భారీగా విమర్శలు వస్తున్నాయి. అదిదా సర్‌ప్రైజ్ పాటలో స్కర్టును లాగుతూ కేతిక శర్మ చేసిన స్టెప్‍పై చాలా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మరి దీన్ని మూవీ టీమ్ తీసేస్తుందేమో చూడాలి.

రాబిన్‍హుడ్ చిత్రంలో నితిన్ హీరోగా నటించగా.. శ్రీలీల హీరోయిన్‍గా చేశారు. కేతిక శర్మ స్పెషల్ సాంగ్‍లో చిందేశారు. ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. ఈ సినిమా వచ్చే వారం మార్చి 28వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రమోషన్లను జోరుగా చేస్తోంది మూవీ టీమ్. నితిన్ - వెంకీ కాంబోలో గతంలో వచ్చిన భీష్మ భారీ హిట్ అయింది. వీరి కాంబో మళ్లీ వస్తుండటంతో రాబిన్‍హుడ్‍పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం