జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోన్న సూపర్ హిట్ సీరియల్ జగద్ధాత్రి తమిళంలోకి రీమేక్ అవుతోంది. ఈ తమిళ సీరియల్‌లో కోయిలమ్మ సీరియల్ ఫేమ్ తేజస్విని గౌడ లీడ్ రోల్‌లో నటిస్తోంది. జగద్ధాత్రి తమిళ రీమేక్‌కు అయలీ అనే టైటిల్‌ను కన్ఫామ్ చేశారు. జీ తమిళ్ ఛానెల్‌లో అయలీ టెలికాస్ట్ కాబోతుంది.
అయలీ సీరియల్‌కు సంబంధించిన ప్రోమోను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో ట్రెడిషనల్‌గా, యాక్షన్ రోల్‌లో రెండు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్‌లో తేజస్విని గౌడ కనిపించింది. దేవుడి పూజ సందర్భంగా ఇంటి పనులు మొత్తం ఒంటి చేతితో చక్కబెడుతూ తేజస్విని గౌడ ఈ ప్రోమోలోకి ఎంట్రీ ఇచ్చింది. చివరలో త్రిశూలం దొంగతనం చేయడానికి వచ్చిన విలన్స్ తక్కురేగ్గొడుతూ యాక్షన్‌తోనూ అదరగొట్టింది. అయలీ సీరియల్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయలీ సీరియల్‌లో తేజస్విని గౌడతో పాటు ఆనంద్ సెల్వన్ లీడ్ రోల్స్‌లో కనిపించబోతున్నారు. జగద్ధాత్రి తెలుగు సీరియల్‌తో దీప్తి మన్నే లీడ్ రోల్‌లో కనిపించింది. దీప్తి మన్నే పాత్రను తమిళంలో తేజస్విని గౌడ చేయబోతుండటం గమనార్హం. జగద్ధాత్రి సీరియల్‌లో దర్శ్ చెంగప్ప, ప్రీతి, నీలమ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం జీ తెలుగులో రాత్రి తొమ్మిది గంటలకు ఈ సీరియల్ టెలికాస్ట్ అవుతోంది. ఇటీవలే ఐదు వందల ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్నది.
అయలీ సీరియల్‌తో దాదాపు నాలుగేళ్ల తర్వాత తమిళ బుల్లితెరపైకి రీఎంట్రీ ఇస్తోంది తేజస్విని గౌడ. చివరగా విద్య నంబర్ 1న సీరియల్‌లో తేజస్విని గౌడ హీరోయిన్‌గా కనిపించింది. అంతకుముందు సుందరి నీయమ్, సుందరన్ నానుమ్ అనే సీరియల్‌లో నటించింది.
తెలుగులో కేరాఫ్ అనసూయ, కోయిలమ్మ సీరియల్స్ తేజస్విని గౌడకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. స్టార్ మాలో టెలికాస్ట్ అయిన కోయిలమ్మ జీ తెలుగులో నంబర్ వన్ సీరియల్స్‌లో ఒకరిగా నిలిచింది.
బిగ్‌బాస్ రన్నరప్ అమర్‌దీప్ చౌదరిని ప్రేమించిన తేజస్విని గౌడ 2022తో అతడిని పెళ్లిచేసుకున్నది. వీరిద్దరు కలిసి జంటగా ఇస్మార్ట్ జోడీ టీవీ షోలో పాల్గొన్నాడు. బిగ్‌బాస్ సీజన్ 7 రన్నరప్‌గా నిలిచిన అమర్‌దీప్ చౌదరి ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెడుతోన్నాడు. హీరోగా మూడు సినిమాలు చేస్తోన్నాడు.
సంబంధిత కథనం