యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్ర పోషిస్తున్న మిరాయ్ చిత్రంపై ముందు నుంచి క్యూరియాసిటీ నెలకొంది. బ్లాక్‍బస్టర్ హనుమాన్ తర్వాత తేజ చేస్తున్న మూవీ కావడం, ఇప్పటికే వచ్చిన గ్లింప్స్‌తో హైప్ బాగా ఉంది. ఈ సూపర్ హీరో అడ్వెంచర్ యాక్షన్ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. మంచు మనోజ్ ఈ మూవీలో నెగెటివ్ రోల్ చేస్తున్నారు. ఇంత ఎగ్జైట్‍మెంట్ ఉన్న మిరాయ్ చిత్రం నుంచి నేడు (మే 28) టీజర్ వచ్చింది.
“జరగబోతోంది మారణహోమం.. శిథిలం కాబోతోంది అశోకుడి ఆశయం. కలియుగంలో పుట్టిన ఏ శక్తీ దీన్ని ఆపలేదు ” అని జయరాం చెప్పే డైలాగ్‍తో మిరాయ్ టీజర్ మొదలైంది. వార్ సీక్వెన్స్ షాట్స్ ఉన్నాయి. నెగెటివ్ రోల్‍లో మనోజ్ విధ్వంసం సృష్టిస్తుంటాడు. తనకు అడ్డువచ్చిన వారిని అంతమొందిస్తుంటాడు. ఈ ప్రమాదాన్ని ఆపే దారే లేదా అని శ్రీయా అంటుంది.
“ఈసారి దారి దైవం కాదు.. యుగాల వెనుక అవతరించిన ఓ ఆయుధం చూపిస్తుంది. అదే మిరాయ్” అంటూ జయరాం డైలాగ్ చెబుతాడు. సూపర్ యోధగా తేజ సజ్జా మిరాయ్‍తో ఉంటాడు. నువ్వు ఎవరో నీకు తెలియదు అంటూ రితికా నాయక్ చెబుతుంది. తానెవరో కనుగొనేందుకు యోధ ప్రయత్నిస్తాడు.
“తొమ్మిది పుస్తకాలు.. వందల ప్రశ్నలు.. వన్ స్టిక్” అని మిరాయ్‍ను పట్టుకొని అంటాడు సూపర్ యోధ (తేజ సజ్జా). పుస్తకాల్లో ఏవో రహస్యాలు ఉంటాయి. బిగ్ అడ్వెంచర్ అంటూ రంగంలోకి దిగుతాడు యోధ.
ప్రపంచానికి చేటు చేయాలనుకునే శక్తులతో యోధ పోరాడుతూ ఉంటాడు. టీజర్ చివర్లో శ్రీరాముడి నడిచివస్తున్నట్టుగా పాదాలు కనిపిస్తాయి. వానరాలు చుట్టూ చేరి దండాలు పెడుతుంటాయి. శ్రీరాముడి ఆగమనం ఈ మూవీలో ఉంటుందని మేకర్స్ హింట్ ఇచ్చారు.
మిరాయ్ టీజర్ గ్రాండ్ విజువల్స్, యాక్షన్ సీక్వెన్సులు, ఇంట్రెస్టింగ్ స్టోరీలైన్, బలమైన పాత్రలతో మెప్పించింది. సాధారణంగా ఉండే యోధ ఆ తర్వాత వీరుడిగా మారిన క్రమంలో తేజ సజ్జా యాక్టింగ్, యాక్షన్ కూడా మెప్పించాయి. మనోజ్ యాక్షన్‍తో అదరగొట్టారు. జగపతి బాబు, జయరాం, శ్రీయా లాంటి సీనియర్ నటీనటులు కనిపించారు.
సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన కార్తీక్ ఘట్టమనేని.. మిరాయ్ చిత్రంతో అద్భుతం చేయనున్నారనే అంచనాలు బలపడ్డాయి. టీజర్ గ్రాండ్‍గా బలమైన రైటింగ్‍తో మెప్పించేలా ఉంది. సినిమాటోగ్రఫీ కూడా మరో హైలైట్‍గా నిలిచింది. మొత్తంగా లార్జర్ దన్ లైఫ్ చిత్రంతో కార్తీక్ మ్యాజిక్ చేస్తారనే హైప్ మరింత పెరిగిపోయింది. ఈ చిత్రానికి గౌర హరి మ్యూజిక్ ఇచ్చారు. టీజర్లో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది.
మిరాయ్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాకరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ ప్రొడ్యూజ్ చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 5వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో ఈ మూవీని విడుదల అవుతుంది. ఐదు భాషల్లో టీజర్ వచ్చింది.
సంబంధిత కథనం