టెహ్రాన్ టు కోర్ట్ కచేరి.. ఓటీటీలోని ఈ ట్రెండింగ్ సినిమాలు, సిరీస్‌లు చూశారా? కోర్టు, స్పై థ్రిల్లర్లు.. ఫ్యామిలీ డ్రామా-tehran to court kacheri top trending movies and series in ott now janaki vs state of kerala bakaiti digital streaming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  టెహ్రాన్ టు కోర్ట్ కచేరి.. ఓటీటీలోని ఈ ట్రెండింగ్ సినిమాలు, సిరీస్‌లు చూశారా? కోర్టు, స్పై థ్రిల్లర్లు.. ఫ్యామిలీ డ్రామా

టెహ్రాన్ టు కోర్ట్ కచేరి.. ఓటీటీలోని ఈ ట్రెండింగ్ సినిమాలు, సిరీస్‌లు చూశారా? కోర్టు, స్పై థ్రిల్లర్లు.. ఫ్యామిలీ డ్రామా

వారం వారం ఓటీటీలోకి కొత్త కంటెంట్ వస్తూనే ఉంది. ఒరిజినల్ సిరీస్ లూ రిలీజ్ అవుతున్నాయి. వీటిల్లో కొన్ని అదిరిపోయే స్టోరీ లైన్ తో, థ్రిల్ తో ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తున్నాయి. అలాంటి ఓటీటీలో ట్రెండింగ్ లో ఉన్న ఈ సినిమాలు, సిరీస్ లపై ఓ లుక్కేయండి.

ఓటీటీలో ట్రెండింగ్ సినిమాలు, సిరీస్ లు

గత కొన్ని వారాలుగా ప్రజల దృష్టిని ఆకర్షించిన అనేక ఓటీటీ సినిమాలు, సిరీస్ లు ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. వీటిలో కోర్ట్ రూమ్ డ్రామా, యాక్షన్ థ్రిల్లర్, మరెన్నో ఉన్నాయి. జాన్ అబ్రహం నటించిన టెహ్రాన్ నుంచి కోర్ట్ కచేరి సిరీస్ వరకు ట్రెండింగ్ లో కొనసాగుతున్న వీటిపై ఓ లుక్కేయండి.

టెహ్రాన్

ఇదొక హిందీ స్పై థ్రిల్లర్. జాన్ అబ్రహం లీడ్ రోల్ ప్లే చేశాడు. ఇరాన్, ఇజ్రాయెల్ తో సంబంధం ఉన్న బాంబు దాడిని దర్యాప్తు చేసే ఢిల్లీ పోలీసు అధికారి, ఏసీపీ రాజీవ్ కుమార్ (జాన్ అబ్రహం) చుట్టూ కథ తిరుగుతుంది. అతను అంతర్జాతీయ గూఢచర్యంతో ముందుకు సాగుతాడు. ఒక దశలో అతను దుర్మార్గంగా కూడా మారతాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో మానుషి చిల్లర్, నీరూ బజ్వా కూడా కీలక పాత్రలు పోషించారు. ఇది జీ5 ఓటీటీలో ఉంది.

కోర్ట్ కచేరి

కోర్ట్ కచేరి అనేది ఒక కోర్ట్ రూమ్ డ్రామెడీ సిరీస్. ఇందులో పరమ్ మాథుర్ (ఆశిష్ వర్మ) తనకు ఇష్టం లేకపోయినా తండ్రి కోసం లాయర్ గా మారతాడు. అతని తండ్రి హరీష్ మాథుర్ (పవన్ మల్హోత్రా) ప్రసిద్ధ న్యాయవాది. ఓ సంక్లిష్టమైన విడాకుల కేసులో చిక్కుకున్నప్పుడు పరమ్ తన తండ్రి, న్యాయవాద వృత్తిపై తన కోపం తీవ్రమవుతుంది. ఇది అతని నమ్మకాలను సవాలు చేసే వరుస సంఘటనలకు దారితీస్తుంది. ఈ కోర్టు డ్రామా సోనీ లివ్ లో ఉంది. తెలుగులోనూ చూడొచ్చు.

బకైటి

పాత ఘజియాబాద్ లోని కటారియా కుటుంబం చుట్టూ తిరిగే స్లైస్ ఆఫ్ లైఫ్ డ్రామా సిరీస్ బకైటి. సంజయ్ కటారియా (రాజేష్ తైలాంగ్) పిల్లలు నైనా, భరత్ ఒక గదిని పంచుకోవాల్సి రావడంతో కుటుంబం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడం చుట్టూ కథ తిరుగుతుంది. కుటుంబంలో తలెత్తే ఉద్రిక్తతలు, తరాల సంఘర్షణలను ఈ సిరీస్ లో చూడొచ్చు. ఇందులో షీబా చద్దా కూడా నటించింది. ఇది జీ5 ఓటీటీలో ఉంది.

జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ

జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మూవీ.. బెంగళూరుకు చెందిన జానకి విద్యాధరన్ అనే ఐటి ప్రొఫెషనల్ కథను చూపుతుంది. తన స్వగ్రామంలో జరిగిన ఓ ఉత్సవానికి వెళ్లిన ఆమె లైంగిక వేధింపులకు గురవుతుంది. డేవిడ్ అబెల్ డోనోవన్ అనే న్యాయవాది నిందితుడి తరఫున వాదించడానికి అడుగు పెట్టడంతో మూవీ మలుపు తీసుకుంటుంది. అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ కోర్టు థ్రిల్లర్ జీ5లో ఉంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం