Alekhya reddy Post on Taraka Ratna: నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18న కన్నుమూసిన సంగతి తెలిసిందే. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన 23 రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. ఎలాగైన కోలుకుని తిరిగి వస్తారని అభిమానులు భావించారు. కానీ దురదృష్టవశాత్తు తారకత్న అందరిని వదిలి వెళ్లిపోయారు. తారకరత్న మరణం అందరి కంటే ఎక్కువ ఆయన భార్య అలేఖ్య రెడ్డిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కొన్ని రోజుల పాటు ఆసుపత్రి పాలు కూడా అయ్యారు. ఆ బాధ నుంచి ఇప్పుడప్పుడే ఆమె కోలుకోలేకపోతున్నారు. తారకరత్న మరణించి సరిగ్గా నెల రోజులు గడిచిన సందర్భంగా అలేఖ్య రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టు పెట్టారు.,"నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి సరిగ్గా నెల రోజులైంది. కానీ నీ జ్ఞాపకాలు నా మదిలో మెదులుతూనే ఉన్నాయి. మనం కలుసుకున్నా, డేటింగ్ చేశాం. మన జీవితంలో నూతన అధ్యాయాన్ని మొదలుపెట్టాలని నువ్వు చాలా పోరాడావు. చివరకు పెళ్లి చేసుకున్నాం. కానీ గందరగోళ పరిస్థితులు మొదలయ్యాయి. వివక్షకు గురయ్యావు. అయినా మనం ఇంకా జీవించే ఉన్నాం. ఈ రోజు వరకు నీతో మాత్రమే నేను సంతోషంగా ఉన్నాను. నిషికమ్మ వచ్చిన తర్వాత ఆ సంతోషం రెట్టింపైంది. కానీ బాధలు కూడా అలాగే ఉన్నాయి. కొంది ద్వేషం చూడలేక మనం కళ్లకు గంతలు కట్టుకున్నాం. అయినా వాళ్లే మనల్ని పదే పదే బాధపెట్టారు. కుటుంబానికి దూరమయ్యావు కాబట్టి పెద్ద కుటుంబం కావాలనుకున్నావు. 2019 సంవత్సరం మనకు సర్‌ప్రైజ్ లభించింది. ఇద్దరు కవలలు మన జీవితంలోకి వచ్చారు. అందమైన అనుభూతిని అందించారు. ఇన్నేళ్లు చివరి వరకు పోరాటం నిజమైంది. నీ హృదయంలో మీరు మోస్తున్న బాధను ఎవరూ అర్థం చేసుకోలేరు, చూడలేరు. కొన్నిసార్లు అంది చంపేస్తుంటుంది. నువ్వు ఎదుర్కొన్న బాధలకు నేను సహాయం చేయలేకపోయాను. నువ్వు నిజమైన హీరోవి ఓబు. కుటుంబంగా నిన్ను చూసి గర్వపడుతున్నాను. ఈ స్వల్ప కాలానికి కూడా మీతో ప్రయాణం సాగించినందుకు గర్వంగా ఉంది. మళ్లీ ఎక్కడైనా మిమ్మల్ని కలుస్తాను. అంత వరకు మీకు శాంతి, సంతోషం కలగాలని ఆశిస్తున్నాను. మామయ్య బాలకృష్ణకు, పెదనాన్న విజయసాయి రెడ్డికి ధన్యవాదాలు చెబుతున్నాను." అని అలేఖ్య రెడ్డి తన పోస్టులో పేర్కొంది.,అలేఖ్య రెడ్డిని పెళ్లి చేసుకోవడం ద్వారా తారకరత్న నిరాధరణకు గురయ్యాడని, తల్లిదండ్రులు దూరం పెట్టి వేదనకు గురి చేశారని ఆమె చెప్పకనే చెప్పారు. అంత పెద్ద కుటుంబంలో తారకరత్న ఒంటరి అయ్యాడని ఆమె పరోక్షంగా అన్నారు. అలేఖ్య రెడ్డిని తారకరత్న రెండో వివాహం చేసుకున్నారు. నందీశ్వరుడు చిత్రానికి అలేఖ్య కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు. అప్పుడే ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. అది ప్రేమ, తర్వాత పెళ్లికి దారితీసింది.,