Tammareddy Bharadwaja On Liger: లైగర్ రిజల్ట్ పై తమ్మారెడ్డి భరద్వాజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Tammareddy Bharadwaja On Liger:లైగర్ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా చూడాలని అనిపించలేదని టాలీవుడ్ సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. లైగర్ రిజల్ట్ పై ఆయన చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.
Tammareddy Bharadwaja On Liger:విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ చిత్రం గత నెల 25న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రమోషన్స్ లో లైగర్ విజయంపై విజయ్ దేవరకొండ తో పాటు పూరి జగన్నాథ్ నమ్మకాన్ని వ్యక్తం చేయడంతో సినిమాపై భారీగా హైప్ ఏర్పడింది. కానీ కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. పూరి అందించిన కథతో పాటు అతడి టేకింగ్ పై చాలా విమర్శలొచ్చాయి. పూరి మార్కుకు దూరంగా ఈ సినిమా ఉందంటూ అభిమానులు కామెంట్ చేశారు. మొదటివారంలోనే ఈ సినిమా ను థియేటర్ల నుండి ఎత్తేశారు. ఈ సినిమా రిజల్ట్ పై టాలీవుడ్ సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

మన యాక్షన్ ను బట్టే ప్రేక్షకుల రియాక్షన్ ఉంటుందని తెలిపాడు. అతిగా ఎగిరిపడితే ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతాయని అన్నాడు. తాను పూరి జగన్నాథ్ అభిమానినేని, అతడి సినిమాల్ని ఇష్టపడతానని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. కానీ లైగర్ ట్రైలర్ చూసిన తర్వాత డిసపాయింట్ అయ్యానని, సినిమా చూడాలనిపించలేదని వ్యాఖ్యానించాడు. భవిష్యత్తులో కుదిరితే చూస్తానని పేర్కొన్నాడు. సినిమాను చూడమని ప్రేక్షకుల్ని రిక్వెస్ట్ చేయాలి, కానీ చిటికెలు వేస్తే రియాక్షన్ ఇలాగే ఉంటుందని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పాడు.
విజయ్ దేవరకొండను ఉద్దేశించే తమ్మారెడ్డి భరద్వాజ ఈ కామెంట్స్ చేసినట్లుగా టాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. లైగర్ ప్రమోషన్స్ లో ఇండియాను షేక్ చేసే సినిమా ఇదంటూ విజయ్ దేవరకొండ అన్నాడు. 200 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టే సత్తా ఉదంటూ పేర్కొన్నాడు. అతడి కామెంట్స్ పై తమ్మారెడ్డి భరద్వాజ కౌంటర్స్ వేసినట్లుగా చెబుతున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యలు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాగా లైగర్ సినిమాతోనే విజయ్ దేవరకొండ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో అనన్యా పాండే హీరోయిన్ గా నటించింది.