ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వచ్చేసింది. తమిళంలో థియేటర్లలో రిలీజైన రెండేళ్ల తర్వాత ఇప్పుడు తెలుగులో డబ్ అయి డైరెక్ట్ గా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఆ సినిమానే ‘రెడ్ శాండల్ వుడ్’ (Red Sandal wood). ఈ సినిమా తెలుగు వర్షన్ తో ఇవాళ (జులై 31) ఓటీటీలో అడుగుపెట్టింది.
2023లో తమిళంలో రిలీజైన ఈ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే అక్కడ తమిళంలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడీ సినిమా తెలుగు వర్షన్ ను నేరుగా ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ చేశారు. గురువారం ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
‘‘రెడ్ శాండల్ వుడ్ ఈటీవీ విన్ లో ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది. యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ ను ఇప్పుడే చూసేయండి’’ అని ఈటీవీ విన్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. ఈ మూవీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో మంచి థ్రిల్ లు పంచనుంది. తెలుగు ఫ్యాన్స్ ను ఆకట్టుకునేందుకు ఈ మూవీ రెడీ అయింది.
రెడ్ శాండల్ వుడ్ మూవీ సెప్టెంబర్ 8, 2023లో థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాను గురు రామానుజన్ డైరెక్ట్ చేశాడు. ఇందులో వెట్రి, దియా మయూరి, గణేష్ వెంకట్రామన్ లాంటి వాళ్లు నటించారు. చెన్నైకి చెందిన ఓ బాక్సర్ పోలీస్ కావాలనుకుంటాడు. ఆ లక్ష్యం కోసం కష్టపడతాడు. అయితే కనిపించకుండాపోయిన తన గర్ల్‌ఫ్రెండ్ సోదరుడిని వెతుక్కుంటూ వెళ్లడంతో అతని లైఫ్ మలుపు తీసుకుంటుంది. ఆ క్రమంలో రేణిగుంట వెళ్తాడు.
అక్కడికి వెళ్లిన అతనికి ఆ కనిపించకుండాపోయిన వ్యక్తితోపాటు ఓ భయంకరమైన నిజం కూడా తెలుస్తుంది. అదే ఎర్ర చందనం అక్రమ రవాణా. ఈ ఎర్ర చందనం అక్రమ రవాణా కేసులో బాక్సర్ ఇరుక్కుంటాడు. తమిళ అమాయక ప్రజలు ఈ ఎర్ర చందనం స్మగ్లింగ్ ఉచ్చులో ఎలా చిక్కుకుంటున్నారనే విషయాన్ని హీరో కనిపెట్టాలనుకుంటాడు. వాళ్లను కాపాడాలని చూస్తాడు.
ఆ తర్వాత ఏం జరుగుతుంది? అత్యంత ప్రమాదకరమైన ఎర్ర చందనం గ్యాన్ నుంచి అతను ఎలా తప్పించుకుంటాడు? స్మగ్లింగ్ ను అతడు ఎలా బయటపెడతాడు? సురక్షితంగా అక్కడి నుంచి వెళ్లగలడా అన్నది ఈ సినిమాలో చూడొచ్చు. థియేటర్లో ప్రేక్షకుల నుంచి ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చిన ఈ రెడ్ శాండల్ వుడ్ మూవీని ఈ రోజు నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో తెలుగులోనూ చూడొచ్చు.
సంబంధిత కథనం